తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tiger Nageswara Rao Twitter Review: రవితేజ రఫ్పాడించాడు - టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ట్విట్ట‌ర్ టాక్ ఎలా ఉందంటే?

Tiger Nageswara Rao Twitter Review: రవితేజ రఫ్పాడించాడు - టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ట్విట్ట‌ర్ టాక్ ఎలా ఉందంటే?

20 October 2023, 6:33 IST

google News
  • Tiger Nageswara Rao Twitter Review: ర‌వితేజ హీరోగా వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ మూవీతోనే ఫ‌స్ట్ టైమ్‌ ర‌వితేజ పాన్ ఇండియ‌న్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ర‌వితేజ
ర‌వితేజ

ర‌వితేజ

Tiger Nageswara Rao Twitter Review: ర‌వితేజ హీరోగా న‌టించిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు మూవీ అక్టోబ‌ర్ 20న (శుక్ర‌వారం) పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీ ఎత్తున‌ రిలీజైంది. 1980 ద‌శ‌కానికి చెందిన స్టూవ‌ర్ట్‌పురం గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నుపుర్ స‌న‌న్‌, గాయ‌త్రి భ‌ర‌ద్వాజ్ హీరోయిన్లుగా న‌టించారు. రేణు దేశాయ్ కీల‌క పాత్ర పోషించింది. ఈ ఫిక్ష‌న‌ల్ బ‌యోపిక్ మూవీ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

కెరీర్ బెస్ట్ ప‌ర్ఫామెన్స్‌

తెలుగు రాష్ట్రాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో ర‌వితేజ జీవించాడ‌ని ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్ చెబుతోన్నారు. రాబిన్ హుడ్ క్యారెక్ట‌ర్‌లో ర‌వితేజ త‌న యాక్టింగ్‌తో ర‌ఫ్పాడించాడ‌ని అంటున్నారు. అత‌డి కెరీర్‌లోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ప‌ర్ఫామెన్స్‌గా ఈ మూవీ నిలిచే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంటున్నారు. అత‌డి ఎంట్రీ, స్క్రీన్ ప్ర‌జెన్స్‌, ఎలివేష‌న్స్‌ ఆక‌ట్టుకుంటాయ‌ని అంటున్నారు.

ఫ‌స్ట్ హాఫ్ ఫ‌న్‌...

ప్రొడ‌క్ష‌న్‌ వాల్యూస్‌, సినిమాటోగ్ర‌ఫీతో పాటు యాక్ష‌న్ సీక్వెన్స్‌లు టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా ట్వీట్స్ చేస్తున్నారు. 1980 కాలాన్ని అద్భుతంగా సినిమాలో రీక్రియేట్ చేశార‌ని అంటున్నారు. ఫ‌న్‌, ఎలివేష‌న్స్‌తో ఫ‌స్ట్ హాఫ్ స‌ర‌దాగా సాగిపోతుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. ర‌వితేజ‌, రేణుదేశాయ్‌తో పాటు మిగిలిన క్యారెక్ట‌ర్స్‌ను డిజైన్ చేసిన తీరు బాగుంద‌ని పేర్కొంటున్నారు.

సెకండాఫ్ మైన‌స్‌....

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాకు సెకండాఫ్ మైన‌స్‌గా నిలిచింద‌ని ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్ పేర్కొంటున్నారు. సెకండాఫ్‌ను డైరెక్ట‌ర్ పూర్తిగా సాగ‌దీశార‌ని, మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ స‌రిగా వ‌ర్క‌వుట్ కాలేద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మూడు గంట‌ల‌కుపైగా ఉన్న నిడివి కూడా ఇబ్బంది పెడుతోంద‌ని అంటున్నారు ముఖ్యంగా పాట‌లు, బీజీఎమ్‌ . టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాకు పెద్ద డ్రా బ్యాక్ చెబుతున్నారు. వీఎఫ్ఎక్స్ విష‌యంలో క్వాలిటీ మిస్స‌యింద‌ని అంటున్నారు.

చిన్న చిన్న లోపాలున్న మంచి పీరియాడిక్ యాక్ష‌న్ మూవీగా ఆడియెన్స్‌ను ఈ సినిమా అల‌రిస్తుంద‌ని చెబుతోన్నారు. ర‌వితేజ అభిమానుల‌ను పూర్తిగా ఈ సినిమా సంతృప్తిని పరుస్తుంద‌ని ఓవ‌ర్ సీస్ ఆడియెన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం