తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tiger Nageswara Rao Ott Streaming: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Tiger Nageswara Rao OTT Streaming: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

17 November 2023, 5:54 IST

google News
  • Tiger Nageswara Rao OTT Streaming: ర‌వితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. నేటి (శుక్ర‌వారం) నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ర‌వితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు
ర‌వితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు

ర‌వితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు

Tiger Nageswara Rao OTT Streaming: ర‌వితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు మూవీ థియేట‌ర్‌లో రిలీజై నెల రోజులు కూడా గ‌డ‌వ‌క ముందే ఓటీటీలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఎలాంటి ముంద‌స్తు ప్ర‌చారం లేకుండా సెలైంట్‌గా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావును ఓటీటీలో రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు త‌మిళం,మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉన్న‌ట్లు అమెజాన్ ప్రైమ్ ప్ర‌క‌టించింది.

ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 20న భారీ అంచ‌నాల న‌డుమ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ర‌వితేజ ఫ‌స్ట్ బ‌యోపిక్ మూవీ కావ‌డం, ఈ సినిమాతోనే అత‌డు పాన్ ఇండియ‌న్ మార్కెట్‌లోకి అడుగుపెట్ట‌నుండ‌టంతో టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జ‌రిగింది. కానీ క‌థ‌లో ఆస‌క్తి లోపించ‌డం, ర‌వితేజ నుంచి అభిమానులు కోరుకునే వినోదం, మాస్ అంశాలు పెద్ద‌గా లేక‌పోవ‌డంతో టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.

తెలుగులో దాదాపు 36 ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ 15 కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. తెలుగులో మోస్తారు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ భారీ బ‌డ్జెట్ మూవీ మిగిలిన భాష‌ల్లో డిజాస్ట‌ర్‌గా నిలిచింది. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాలో నుపుర్ స‌న‌న్, గాయ‌త్రి భ‌ర‌ద్వాజ్ హీరోయిన్లుగా న‌టించారు.

1970-80 ద‌శ‌కంలో తెలుగు రాష్ట్రాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన స్టూవ‌ర్ట్‌పురం గ‌జ దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవితం ఆధారంగా ద‌ర్శ‌కుడు వంశీ ఈ మూవీని తెర‌కెక్కించాడు. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావులో అనుప‌మ్ ఖేర్‌, రేణు దేశాయ్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం