తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmastra Collection: కేజీఎఫ్ 2 రికార్డును బ్రేక్ చేసిన బ్రహ్మాస్త్ర

Brahmastra Collection: కేజీఎఫ్ 2 రికార్డును బ్రేక్ చేసిన బ్రహ్మాస్త్ర

HT Telugu Desk HT Telugu

12 September 2022, 14:12 IST

google News
  • Brahmastra Collection:ర‌ణ్‌భీర్ క‌పూర్ బ్రహ్మాస్త్ర చిత్రం యశ్ కేజీఎఫ్ 2, హృతిక్ రోషన్ వార్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. ఆ రికార్డ్ ఏదంటే..
ర‌ణ్‌భీర్ క‌పూర్
ర‌ణ్‌భీర్ క‌పూర్ (twitter)

ర‌ణ్‌భీర్ క‌పూర్

Brahmastra Collection: ర‌ణ్‌భీర్ క‌పూర్‌(Ranbir kapoor), అలియా భట్ (Alia bhatt) జంటగా విజువల్ వండర్ గా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర చిత్రం వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మైథలాజిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. వరల్డ్ వైడ్ గా బ్రహ్మాస్త్ర మూడు రోజుల్లో210 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలిసింది. తాజాగా ఈ సినిమా యశ్ కేజీఎఫ్ 2, హృతిక్ రోషన్ వార్ సినిమాల రికార్డులను అధిగమిస్తూ పీవీఆర్ చైన్ మార్కెట్ థియేటర్లలో ఒక రోజులో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.

దేశవ్యాప్తంగా పీవీఆర్ థియేటర్లలో కేజీఎఫ్ 2 (Kgf 2) చిత్రం తొలి రోజు 9.33 కోట్ల వసూళ్లను రాబట్టింది. హృతిక్ రోషన్ వార్ సినిమా ఫస్ట్ డే 8.85 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్నది. ఆ సినిమాల రికార్డులను 9.50 కోట్లతో బ్రహ్మాస్త్ర తిరగరాసింది. శనివారం ఒక్క రోజులోనే 9.50 కోట్ల వసూళ్లను బ్రహ్మాస్త్ర సాధించినట్లు పీవీఆర్ వర్గాలు తెలిపాయి.

అంతేకాకుండా ఈ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా అత్యధిక కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాగా బ్రహ్మాస్త్ర నిలిచింది. ఆదివారం నాటితో వరల్డ్ వైడ్ గా బ్రహ్మాస్త్ర 26.50 మిలియన్ల వసూళ్లను రాబట్టింది. బ్రహ్మాస్త్ర తర్వాత 21.50 మిలియన్లతో హాలీవుడ్ సినిమా గివ్ మీ ఫైవ్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది.

గతంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్(, విజయ్ మాస్టర్ సినిమాలు మాత్రమే వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీకెండ్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాలుగా నిలిచాయి. వాటి తర్వాత ఈ ఘనతను సాధించిన మూడో ఇండియన్ సినిమాగా బ్రహ్మాస్త్ర నిలిచింది.

బ్రహ్మాస్త్ర సినిమాకు ఇండియా 18 మిలియన్ల వసూళ్లు రాగా, నార్గ్ అమెరికాలో 4.50 కోట్లు, ఆస్ట్రేలియా, యూకే, యుఏఈతో పాటు మిగిలిన ఓవర్ సీస్ మార్కెట్ లో మరో నాలుగు కోట్ల వసూళ్లను ఈ సినిమా రాబట్టింది. బ్రహ్మాస్త్ర సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలను పోషించారు. కరణ్ జోహార్ నిర్మించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం