Ranbir Gifts bag to Alia: హ్యాండ్ బ్యాగ్‌కు రూ.10 లక్షలా.. ఆలియాకు రణ్‌బీర్ గిఫ్ట్ అదిరిందిగా!
17 April 2023, 20:33 IST
- Ranbir Gifts bag to Alia: హ్యాండ్ బ్యాగ్‌కు రూ.10 లక్షలట. అది కూడా ఆలియాకు రణ్‌బీర్ గిఫ్ట్ ఇచ్చాడట. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్
Ranbir Gifts bag to Alia: బాగా డబ్బున్నోళ్లు.. అందులోనూ సెలబ్రిటీలు.. ఇంకేం.. వెడ్డింగ్ యానివర్సరీలకు కూడా ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చుకుంటూ ఉంటారు. సరే ఏ కారుకో, మరో దానికో లక్షలు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ మాత్రం తన భార్య ఆలియా భట్ కు పెళ్లి రోజు కానుకగా రూ.10 లక్షల విలువైన హ్యాండ్ బ్యాగ్ ఇవ్వడం విశేషం.
నిజానికి ఈ విషయం ఆ సెలబ్రిటీ కపుల్ చెప్పలేదు. వాళ్ల వీడియోలు చూసిన కొందరు నెటిజన్లు నెట్ లో సెర్చ్ చేసి మరీ ఈ విషయాన్ని బయటపెట్టడం విశేషం. గతేడాది ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న రణ్‌బీర్, ఆలియా.. ఈ మధ్యే తొలి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నారు. అయితే ఆ పెళ్లి రోజుకు ముందు రణ్‌బీర్ ఎయిర్ పోర్టులో కనిపించాడు.
ఆ సమయంలో అతని చేతిలో ఓ గిఫ్ట్ బ్యాగ్ కనిపించింది. ఇక్కడ కట్ చేస్తే.. వాళ్ల పెళ్లి రోజు నాడు ఆలియా చేతిలో ఓ పింక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. ఆలియా కోసం రణ్‌బీర్ అంతకుముందు తెచ్చిన గిఫ్ట్ ఇదేనని, దాని విలువ 12250 డాలర్లు (సుమారు రూ.10 లక్షలు) అని నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన రెండు వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి.
అందులో ఒక వీడియోలో రణ్‌బీర్ ఎయిర్ పోర్టు నుంచి చేతిలో బ్యాగుతో బయటకు వస్తుండటం చూడొచ్చు. మరో దాంట్లో వెడ్డింగ్ యానివర్సరీ నాటు ఈ ఇద్దరూ తాము కొత్తగా కట్టుకుంటున్న ఇంట్లోకి వెళ్లడం కనిపిస్తుంది. ఆ సమయంలోనే ఆలియా చేతిలో ఆ పింక్ బ్యాగ్ కనిపించింది. అది చూసిన నెటిజన్లు ఇంటర్నెట్ లో బ్యాగు వివరాలు ఆరా తీశారు.
పెళ్లి రోజును వీళ్లు ఘనంగా జరుపుకోలేదు. సింపుల్ గా తాము కొత్తగా కట్టుకుంటున్న ఇంటికి మాత్రం వెళ్లి వచ్చారు. ఆలియా, రణ్‌బీర్ లు గతేడాది నవంబర్ లో పేరెంట్స్ గా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. వీళ్లకు కూతురు పుట్టగా.. ఆమెకు రాహా కపూర్ అనే పెట్టుకున్నారు.