తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rana Naidu In Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో రానా నాయుడు సంచలనం.. ఎగబడి చూసేస్తున్నారు

Rana Naidu in Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో రానా నాయుడు సంచలనం.. ఎగబడి చూసేస్తున్నారు

Hari Prasad S HT Telugu

15 March 2023, 17:42 IST

    • Rana Naidu in Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో రానా నాయుడు సంచలనం సృష్టిస్తోంది. ఇదో బూతు సిరీస్ అంటూనే జనం ఎగబడి చూసేస్తున్నారు. దీంతో ఈ వెబ్ సిరీస్ రికార్డులు క్రియేట్ చేస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ లో సంచలనాలు క్రియేట్ చేస్తున్న రానా నాయుడు
నెట్‌ఫ్లిక్స్ లో సంచలనాలు క్రియేట్ చేస్తున్న రానా నాయుడు

నెట్‌ఫ్లిక్స్ లో సంచలనాలు క్రియేట్ చేస్తున్న రానా నాయుడు

Rana Naidu in Netflix: రానా నాయుడు.. తెలుగు హీరోలు వెంకటేశ్, రానా కలిసి నటించిన హిందీ వెబ్ సిరీస్. తెలుగులోనూ డబ్ అయిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్ లో బూతు ఓ లెవల్లో ఉందంటూ విమర్శలు కూడా ఎదుర్కొంది. దీనిపై రానా క్షమాపణ కూడా చెప్పాడు. అయితే ఈ రానా నాయుడును మాత్రం ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Adivi Sesh: అదే కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తుంది.. హీరోయిన్‌పై అడవి శేష్ కామెంట్స్ వైరల్

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ ఆకట్టుకుందా?

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ లో ఇంగ్లిషేతర సిరీస్ లో ఎక్కువ మంది చూస్తున్న వాటిలో 10వ స్థానంలో నిలిచింది. ఇండియన్ సిరీస్ అయిన ఖాకీ: ద బీహార్ ఛాప్టర్, యంగ్ అడల్ట్ షో క్లాస్ లను ఈ రానా నాయుడు మించిపోయింది. ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తుండటంతో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సిరీస్ దూసుకెళ్తూనే ఉంది.

ఈ సిరీస్ వాచ్ హవర్స్ పరంగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. తొలి వారంలోనే 80.7 లక్షల గంటల పాటు ఈ సిరీస్ ను చూడటం విశేషం. తెలుగులో ఇద్దరు బడా స్టార్లు నటించిన సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో రావడం ఇదే తొలిసారి. నిజ జీవితంలో వెంకటేశ్ అన్న కొడుకైన రానా ఈ సిరీస్ లో మాత్రం అతని సొంత కొడుకుగా నటించాడు.

రానా నాయుడులో చెప్పుకోవ‌డానికి పెద్ద‌గా క‌థ లేదు. క్యారెక్ట‌రైజేష‌న్స్‌ను డిఫ‌రెంట్‌గా మ‌లుస్తూ ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటీని రేకెత్తించ‌డానికి ప్ర‌య‌త్నించారు ద‌ర్శ‌కులు. సిరీస్ చాలా వ‌ర‌కు బోర్ కొట్టించింది.

ఫ్యామిలీ ఎమోష‌న్స్ సాగ‌దీసిన ఫీలింగ్ క‌లుగుతుంది. తండ్రిని రానానాయుడు ద్వేషించ‌డానికి గ‌ల కార‌ణాల్లో డెప్త్ లేదు. రానా నాయుడు సోద‌రులు పాత్ర‌ల్లోని ఎమోష‌న్స్ స‌రిగా వ‌ర్క‌వుట్ కాలేదు.

రానా నాయుడి, నాగనాయుడిగా వెంక‌టేష్ రానా పాత్ర‌లో పోటీపోటీగాసాగాయి. త‌న‌కున్న ఫ్యామిలీ ఇమేజ్‌కు భిన్నంగా ప్లేబాయ్ త‌ర‌హా పాత్ర‌లో వెంక‌టేష్ చెల‌రేగిపోయాడు. సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో అత‌డి మేన‌రిజ‌మ్స్‌, డైలాగ్ డెలివ‌రీ కొత్త‌గా ఉన్నాయి.

రానా నాయుడిగా నెగెటివ్ షేడ్స్‌లో కూడిన పాత్ర‌లో రానా న‌ట‌న ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంది. సీరియ‌స్ రోల్‌లో జీవించాడు. రానా వైఫ్‌గా సుర్వీన్ చావ్లా, సోద‌రులుగా సుశాంత్ సింగ్‌, అభిషేక్ బెన‌ర్జీ ల న‌ట‌న సిరీస్‌కు ప్ల‌స్‌గా నిలిచింది. ఆశీష్ విద్యార్థి విల‌నిజం రొటీన్‌గా ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.