Vyooham Trailer: పవన్‌కు తెలివి లేదు.. జగన్ పిల్ల పిత్రే.. ఇంట్రెస్టింగ్ డైలాగ్‌లతో వ్యూహం ట్రైలర్
13 October 2023, 14:22 IST
RGV Vyuham Trailer: సంచలనాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత స్పీడుగా సినిమాలు తెరకెక్కిస్తాడో అంతే స్పీడుగా ప్రమోషన్లతో అట్రాక్ట్ చేస్తుంటాడు. తాజాగా వ్యూహం సినిమా ట్రైలర్‌ను విడుదల చేసి అందరి అటెన్షన్ తనవైపుకు తిప్పుకున్నాడు.
రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా ట్రైలర్ విడుదల
RGV Vyooham Trailer: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నాడు ఆర్జీవీ. ఇప్పటికే వ్యూహం సినిమా పోస్టర్స్, టీజర్ తెగ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. తాజాగా వ్యూహం సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా వదిలాడు రామ్ గోపాల్ వర్మ.
రెండు నిమిషాల 20 సెకన్లు ఉన్న వ్యూహం ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇందులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయపరంగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో తనదైన మార్కుతో చూపించాడు రామ్ గోపాల్ వర్మ. సోనియా గాంధీ పాత్ర ఫోన్ కాల్ మాట్లాడటంతో వ్యూహం ట్రైలర్ ప్రారంభం అవుతుంది. జగన్ పాత్ర చేస్తున్న ఓదార్పు యాత్ర ఆపేయాలని వార్నింగ్ ఇస్తారు.
అప్పుడు చంద్రబాబు పాత్ర తెరపై కనిపించి ఇప్పుడు మన వ్యూహం మొదలు అవుతుంది అని చెబుతాడు. జగన్ పాత్ర పాదయాత్ర చేయడం, సీబీఐ విచారణ, సంక్షేమ పథకాల గురించి జగన్ భార్య పాత్ర చెప్పడం వంటి సీన్లు చూపించారు. మరోవైపు ఒంటరిగా పోటి చేస్తే గెలుస్తానా అంటూ పవన్ పాత్రతో డైలాగ్ చెప్పించారు. రెండు లక్షలు చదివిన మనిషికి ఆమాత్రం తెలియదా అని జగన్ భార్య పాత్ర అంటుంది.
ఈ గ్లాసుతోనేనా సావాసం అని ఒకరు అంటే.. ఎన్నికలు అవ్వనివ్వు అంటూ చంద్రబాబు పాత్ర గ్లాసును కింద పగలగొట్టడం చూపించారు. ఆ కల్యాణ్‌కు ఎవరు శత్రువో.. ఎవరు మిత్రుడో గుర్తించే తెలివి లేదయ్యా అంటా చంద్రబాబు పాత్ర చెబుతుంది. అనంతరం ఆ స్కిల్ డెవలెప్ మెంట్ స్కామ్‌లో దోచుకున్న సొమ్ము ఎవరి పాకెట్‌లోకి వెళ్లింది అని జగన్ పాత్ర ప్రశ్నించడం ఇంటెన్స్ క్రియేట్ చేసింది. జగనా.. నా ముందు వాడు పిల్ల పిత్రేగాడు అంటూ చంద్రబాబు పాత్ర డైలాగ్ చెప్పడంతో ట్రైలర్ ముగిసింది.
ఇలా డైలాగ్‌లతో వ్యూహం ట్రైలర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే వ్యూహం సినిమాను నవంబర్ 10న విడుదల చేయనున్నారు. అలాగే దీనికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న శపథం మూవీని వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయనున్నట్లు ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ల ద్వారా ప్రకటించారు.