తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan:సల్మాన్‌ఖాన్‌ మూవీలో నటిస్తున్న రామ్‌చరణ్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

Ram Charan:సల్మాన్‌ఖాన్‌ మూవీలో నటిస్తున్న రామ్‌చరణ్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu

22 June 2022, 10:16 IST

    • ట్రిపుల్‌ ఆర్‌ మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు రామ్‌చరణ్‌. హిందీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో అతని నటనకు ఫిదా అయ్యారు. ఇప్పుడతడు సల్మాన్‌ఖాన్‌ మూవీతో మరోసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నాడు.
రామ్ చరణ్, సల్మాన్ ఖాన్
రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ (twitter)

రామ్ చరణ్, సల్మాన్ ఖాన్

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ట్రిపుల్‌ ఆర్‌ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఆచార్య మూవీ ప్రొడ్యూసర్‌గా, యాక్టర్‌గా చెర్రీకి చేదు అనుభవాన్ని మిగిల్చినా.. ఆర్‌ఆర్‌ఆర్‌తో పాన్‌ ఇండియా సక్సెస్‌ను అందుకోవడం అతని స్థాయిని పెంచింది. దీంతో అతనికి బాలీవుడ్‌ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Eesha Rebba: ఆ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నన్ను హీరోయిన్ అని చెప్పి మోసం చేశారు: ఈషా రెబ్బ

Madgaon Express OTT: ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్ యాక్టర్ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Yuvaraj OTT: ఓటీటీలోకి వ‌చ్చేసిన కాంతార‌ హీరోయిన్ యాక్ష‌న్ డ్రామా మూవీ - తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

Bollywood Actor: 200 సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ న‌టుడు - సూప‌ర్‌స్టార్ కావాల్సినోడు .. సీరియ‌ల్స్ చేస్తోన్నాడు

తాజాగా అతడు సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న కభీ ఈద్‌ కభీ దివాళీ మూవీలో ఓ అతిథి పాత్రలో నటిస్తున్నాడన్న విషయం తెలుసు కదా. ఈ మధ్య ఇదే సినిమాలో ఓ పాట షూటింగ్‌ కోసం సల్మాన్‌ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు చెర్రీ అతన్ని కలిశాడు. అప్పుడే ఇందులో గెస్ట్‌ రోల్‌లో రామ్‌ చరణ్‌ కనిపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. ఇదే సాంగ్‌లో మరో టాలీవుడ్‌ స్టార్‌ వెంకటేశ్‌ కూడా కనిపించనున్నాడు.

గెస్ట్‌ రోల్‌కు రామ్‌ చరణ్‌ కూడా ఓకే చెప్పాడు. అయితే ఈ రోల్‌ కోసం రామ్‌ చరణ్‌ ఎలాంటి రెమ్యునరేషన్‌ తీసుకోకుండా ఫ్రీగా నటిస్తున్నట్లు తెలిసింది. సల్మాన్‌ ఖాన్‌ను తమ ఇంటివాడిగా భావించే చెర్రీ.. రెమ్యునరేషన్‌కు నో చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాను సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. వారం రోజుల పాటు హైదరాబాద్‌లో షూటింగ్‌ పూర్తి చేసుకున్న కభీ ఈద్‌ కభీ దివాళీ టీమ్‌ ముంబైలో తర్వాతి షెడ్యూల్‌ జరుపుకోనుంది.

నిజానికి సల్మాన్‌ ఖాన్‌ కూడా చిరంజీవి నటిస్తున్న గాడ్‌ ఫాదర్‌ మూవీలో ఓ గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్‌ కోసం అతడు ఆ మధ్య హైదరాబాద్‌ వచ్చాడు. ఇక కభీ ఈద్‌ కభీ దివాళీ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తుండటం విశేషం. గతంలో అల్లు అర్జున్‌ సీటీ మార్‌ సాంగ్‌ను హిందీలో సల్మాన్‌ రాధే మూవీ కోసం దేవీ మ్యూజిక్‌ కంపోజ్‌ చేశాడు. ఈ కభీ ఈద్‌ కభీ దివాళీ మూవీ ఈ ఏడాది డిసెంబర్‌ 30న రిలీజ్‌ కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం