తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Favorite Recipe: రామ్‍చరణ్‍కు బాగా నచ్చే వంటకం ఇదే.. రెసిపీ కూడా షేర్ చేసిన గ్లోబల్ స్టార్.. రానాకు ఛాలెంజ్

Ram Charan Favorite Recipe: రామ్‍చరణ్‍కు బాగా నచ్చే వంటకం ఇదే.. రెసిపీ కూడా షేర్ చేసిన గ్లోబల్ స్టార్.. రానాకు ఛాలెంజ్

06 September 2023, 17:23 IST

google News
    • Ram Charan Favorite Recipe: తనకు ఇష్టమైన ఫుడ్ ఏదో వెల్లడించారు స్టార్ హీరో రామ్‍చరణ్. అలాగే ఆ రెసిపీని షేర్ చేశారు. రానాకుC #MSMPrecipeChallenge చాలెంజ్ విసిరారు.
Ramcharan Favorite Recipe: రామ్‍చరణ్‍కు నచ్చిన వంటకం ఇదే.. రెసిపీ కూడా షేర్ చేసిన గ్లోబల్ స్టార్.. రానాకు ఛాలెంజ్
Ramcharan Favorite Recipe: రామ్‍చరణ్‍కు నచ్చిన వంటకం ఇదే.. రెసిపీ కూడా షేర్ చేసిన గ్లోబల్ స్టార్.. రానాకు ఛాలెంజ్

Ramcharan Favorite Recipe: రామ్‍చరణ్‍కు నచ్చిన వంటకం ఇదే.. రెసిపీ కూడా షేర్ చేసిన గ్లోబల్ స్టార్.. రానాకు ఛాలెంజ్

Ram Charan Favorite Recipe - #MSMPrecipeChallenge: సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ డైనమిక్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రేపు (సెప్టెంబర్ 7) థియేటర్లలో విడుదల కానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ వినూత్నంగా ఓ చాలెంజ్‍తో ప్రమోషన్లను చేస్తోంది. #MSMPrecipeChallenge చాలెంజ్‍తో తమకు నచ్చిన ఫుడ్‍ను సోషల్ మీడియాలో షేర్ చేయాలని సెలెబ్రిటీలను, నెటిజన్లను కోరుతోంది. ఈ సినిమాలో చెఫ్ పాత్రను పోషించారు అనుష్క. ఇందులో భాగంగా ఆమె ముందుగా తనకు మంగళూరు చికెన్ కర్రీ, నీర్ దోశ ఇష్టమని.. వాటి రెసిపీలను పోస్ట్ చేశారు. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‍కు చాలెంజ్ విసిరారు. దీంతో తనకు ఇష్టమైన రొయ్యల పులావ్ రెసిపీని ప్రభాస్ షేర్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్‍కు #MSMPrecipeChallenge చేశారు. దీనికి రామ్‍చరణ్ స్పందించారు.

ప్రభాస్ విసిరిన #MSMPrecipeChallengeను మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ స్వీకరించారు. ఈ చాలెంజ్‍లోకి వచ్చారు. తనకు ఇష్టమైన ఫుడ్ ‘చేపల పులుసు’ అని ట్వీట్ చేశారు. ‘నెల్లూరు చేపల పులుసు’ రెసిపీని పోస్ట్ చేశారు. పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటిని ఈ చాలెంజ్‍లోకి ఆహ్వానించారు. “నేను చాలెంజ్ తీసుకున్నా. #MSMPrecipeChallengeలోకి ఇదే నా ఎంట్రీ. నా ఫేవరెట్ చేపల పులుసు. ఈ ఫన్‍లో జాయిన్ అవ్వాలని నేను రానా దగ్గుబాటిని ఆహ్వానిస్తున్నా. రేపు రిలీజ్ ఉన్నందున ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ చిత్ర టీమ్‍కు ఆల్‍ది వెరీ బెస్ట్” అని రామ్‍చరణ్ ట్వీట్ చేశారు. నెల్లూరు చేపల పులుసు రెసిపీ పూర్తిగా ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు.

‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం రేపు (సెప్టెంబర్ 7) థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలవుతుంది. ఈ సినిమాలో స్టాండప్ కమెడియన్‍గా నవీన్ పోలిశెట్టి, చెఫ్‍గా అనుష్క నటిస్తున్నారు. పెళ్లి చేసుకోకుండానే తల్లి కావాలని అనుష్క భావిస్తుంటుంది. ఆమెకు నవీన్ పరిచయం అవుతారు. ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంది. సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమాకు పి.మహేశ్ బాబు దర్శకత్వం వహించారు.

‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ చిత్రానికి రధన్ పాటలకు స్వరాలు సమకూర్చగా.. బ్యాక్‍గ్రౌండ్ స్కోర్‌ను గోపీసుందర్ అందించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు. మురళీ శర్మ, జయసుధ, అభినవ్ గోమఠం, సోనియా దీప్తి కీలక పాత్రలు చేశారు. 

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం