తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajinikanth: ‘సన్‍రైజర్స్ నుంచి ఆల్కహాల్ వరకు’: ‘జైలర్’ ఆడియో లాంచ్‍లో రజినీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు ఇవే

Rajinikanth: ‘సన్‍రైజర్స్ నుంచి ఆల్కహాల్ వరకు’: ‘జైలర్’ ఆడియో లాంచ్‍లో రజినీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు ఇవే

29 July 2023, 16:50 IST

google News
    • Rajinikanth - Jailer Audio Launch : జైలర్ ఆడియో లాంచ్ ఈవెంట్లో సూపర్ స్టార్ రజినీ కాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. వివిధ విషయాలపై మాట్లాడారు.
Rajinikanth: ‘సన్‍రైజర్స్ నుంచి ఆల్కహాల్ వరకు’: ‘జైలర్’ ఆడియో లాంచ్‍లో రజినీ కాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు ఇవే (Photo: Sun Pictures)
Rajinikanth: ‘సన్‍రైజర్స్ నుంచి ఆల్కహాల్ వరకు’: ‘జైలర్’ ఆడియో లాంచ్‍లో రజినీ కాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు ఇవే (Photo: Sun Pictures)

Rajinikanth: ‘సన్‍రైజర్స్ నుంచి ఆల్కహాల్ వరకు’: ‘జైలర్’ ఆడియో లాంచ్‍లో రజినీ కాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు ఇవే (Photo: Sun Pictures)

Rajinikanth - Jailer Audio Launch : తమిళ సూపర్ స్టార్, సీనియర్ హీరో రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా విడుదల సమీపిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్‍ను శుక్రవారం నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్‍లో హీరో రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. జైలర్ సినిమా గురించే కాకుండా ఇతర అంశాలపై కూడా మాట్లాడారు. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఐపీఎల్‍లో సన్ రైజర్స్ టీమ్ నుంచి తన మద్యం వ్యసనం వరకు కొన్ని అంశాలపై మాట్లాడారు. ఆ వివరాలివే..

మద్యం విపరీతంగా తాగేవాడిని..

తాను ఒకప్పుడు తాను ఆల్కహాల్ (మద్యం) విపరీతంగా తాగేవాడనని రజీనీకాంత్ గుర్తు చేసుకున్నారు. దాని వల్ల తన కుటుంబంలోని అందరూ చాలా బాధపడ్డారని, తన ఆరోగ్యం కూడా దెబ్బ తినిందని అన్నారు. మద్యం తాగడమే తాను జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని అన్నారు. తన అభిమానులు అసలు మద్యం సేవించకూడదని రజినీ సూచించారు. మద్యం వల్ల కుటుంబాలకు చెడు జరుగుతుందని, ఆరోగ్యం పాడవుతుందని వివరించారు.

సన్‍రైజర్స్ ‘కావ్య’ను అలా చూడలేకున్నా

ఐపీఎల్‍లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) గురించి కూడా రజినీ కాంత్ ప్రస్తావించారు. కళానిధి మారన్, ఎస్‍ఆర్‌హెచ్ మంచి ఆటగాళ్లను తీసుకోవాలని, స్టేడియంలో కావ్య దిగాలుగా ఉంటే తాను చూడలేకున్నానని రజినీ అన్నారు. కళానిధి మారన్‍కు చెందిన సన్ పిక్చర్స్ జైలర్ సినిమాను నిర్మిస్తోంది. సన్‍రైజర్స్ జట్టు ఓనర్ కూడా కళానిధి మారన్‍దే. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్‍లో SRH పేలవ ప్రదర్శన చేస్తోంది. కళానిధి మారన్ కూతురే కావ్య.

‘బీస్ట్’కు నెగెటివ్ రివ్యూలు వచ్చినా..

నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ‘బీస్ట్’ సినిమాకు నెగెటివ్ రివ్యూలు వచ్చినా.. అతడితో జైలర్ మూవీకి ఎందుకు అంగీకరించారో రజినీ వెల్లడించారు. “సన్ పిక్చర్స్‌తో మేం అంతర్గత మీటింగ్ నిర్వహించాం. బీస్ట్ మూవీకి నెగెటివ్ రివ్యూలు వచ్చినా డిస్ట్రిబ్యూటర్లు డబ్బు కోల్పోలేదని తెలిసింది” అని రజినీ అన్నారు. ఆ మూవీకి నష్టాలు రానందునే నెల్సన్ దర్శకత్వంలో జైలర్ చేసేందుకు అంగీకరించాననేలా రజినీ అన్నారు.

విమర్శలు చేసే వారిపై..

తనపై కొందరు చేస్తున్న నెగెటివ్ కామెంట్స్, విమర్శలపై రజినీ కాంత్ స్పందించారు. “మొరగని కుక్క ఉండదు.. విమర్శించని నాలుకలు ఉండవు. ఆ రెండు లేని చోటూ లేదు” అని రజినీ తన మార్క్ పంచ్ వేశారు.

జైలర్ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్‍గా నటించింది. మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ యోగిబాబు, వసంత్ రవి, నాగబాబు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 10న జైలర్ మూవీ విడుదల కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం