Chandramukhi 2 Twitter Review: రజనీలా లారెన్స్ మెప్పించాడా? కంగనా భయపెట్టిందా? చంద్రముఖి 2 ట్విటర్ రివ్యూ
28 September 2023, 7:02 IST
Chandramukhi 2 Movie Twitter Review: నటుడు, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటి కంగనా రనౌత్ కాంబినేషన్‍లో వస్తున్న క్రేజీ మూవీ చంద్రముఖి 2. చంద్రముఖి సినిమాకు సీక్వెల్‍గా వచ్చిన చంద్రముఖి 2 ట్విటర్ రివ్యూలో నెటిజన్స్ రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం.
చంద్రముఖి 2 ట్విటర్ రివ్యూ
2005 సంవత్సరంలో వచ్చిన చంద్రముఖి సినిమా ఎంతటి సెన్సేషనల్ హిట్ కొట్టిందో తెలిసిందే. సూపర్ స్టార్ రజనీ కాంత్, జ్యోతికల పర్ఫామెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక డైరెక్టర్ పి. వాసు టేకింగ్, నయనతార స్క్రీన్ ప్రజెన్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సుమారు 17 ఏళ్ల తర్వాత చంద్రముఖి సినిమాకు సీక్వెల్‍గా చంద్రముఖి 2 చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ పి. వాసి. దీంతో చంద్రముఖి 2పై అంచనాలు భారీగా పెరిగాయి.
కొత్త పెయిర్
చంద్రముఖిలో రజనీ, జ్యోతిక బెంచ్ మార్క్ క్రియేట్ చేయగా.. చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్ (Raghava Lawrence), కంగనా రనౌత్ (Kangana Ranaut) నటించారు. మధ్యలో వెంకటేష్, అనుష్క కాంబోలో నాగవల్లి వచ్చిన అంతగా హిట్ కొట్టలేకపోయింది. మరి ఇప్పుడు లారెన్స్, కంగనా పెయిర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో మరికాసేపట్లో తెలియనుంది.
స్కందతో పోటీ
ఇక చంద్రముఖి 2 సినిమాను పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్‍గా రిలీజ్ చేశారు. హిందీ బెల్టులో కంగనా వల్ల కాస్తా థియేటర్లు ఎక్కువగా దక్కినట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు, తమిళంలో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించడం ప్రధాన ఆకర్షణగా మారింది. ఇదిలా ఉంటే చంద్రముఖి 2 మూవీ రామ్ పోతినేని స్కంద (Skanda Movie) చిత్రంతో పోటీ పడనుంది. మరి గురువారం (సెప్టెంబర్ 28) రిలీజ్ అవుతున్న చంద్రముఖి 2 ట్విటర్ రివ్యూపై లుక్కేద్దాం.
కీరవాణిపై నమ్మకంతో
కీరవాణి (MM Keeravani) ట్వీట్‍ను రీట్వీట్ చేస్తూ ఓ నెటిజన్.. "కీరవాణి చెప్పిన మాటలపై నమ్మకంతో టికెట్లు బుక్ చేసుకన్నాను. మేము మైండ్ బ్లోయింగ్ సీన్స్ ఏం ఊహించుకోవట్లేదు. జస్ట్ కనీసం ఎంటర్టైన్ మెంట్ చేస్తే చాలు" అని చెప్పుకొచ్చాడు. చంద్రముఖి 2 కోసం తెగ భయపడ్డానని రెండు నెలలు నిద్రలేదంటూ కీరవాణి ట్వీట్ చేశారు.
మార్క్ క్రియేట్
Chandramukhi 2 First Review: చంద్రముఖి 2 డైరెక్టర్ పి. వాసు స్క్రీన్ ప్లే సినిమాకు ప్లస్ అంటున్నారు. ఆయన కథను నడిపించిన తీరు ఆకట్టుకుందని చెబుతున్నారు. హీరో రాఘవ లారెన్స్ రెండు భిన్నమైన పాత్రల్లో మెప్పించాడని, రజనీకాంత్‌ను అనుకరించకుండా తన మార్క్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడని టాక్ వస్తోంది. అయితే.. రజనీ పోలిస్తే.. రాఘవ లారెన్స్ నటన తేలిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
స్టార్ క్యాస్ట్ ప్లస్
ఇక చంద్రముఖిగా కంగనా రనౌత్‍కి నెటిజన్లు పాస్ మార్కులు వేస్తున్నారు. జ్యోతికలా కంగనా ప్రేక్షకులను భయపెట్టలేకపోయిందట. రాధిక, వడివేలు వంటి స్టార్స్ క్యాస్ట్ సినిమాకు ప్లస్ అనే టాక్ వస్తోంది. చాలా కాలం తర్వాత కీరవాణి తమిళ చిత్రానికి పని చేయగా.. అది వర్కౌట్ అయిందని అంటున్నారు.
అంచనాలతో చూస్తే
మొత్తంగా చెప్పాలంటే ఒరిజినల్ స్థాయిలో చంద్రముఖి 2 ఉండదు. పోలికలతో చూస్తే సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేయలేం. ఇది రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ వెర్షన్ ఆఫ్ చంద్రముఖి. కాబట్టి అదే స్థాయిలో అంచనాలు పెట్టుకుని సినిమాకు వెళితే ఎంజాయ్ చేస్తారు. ఇలా ఇదివరకే పడిన ప్రీమియర్స్ చూసిన జనాలు చంద్రముఖి 2పై రివ్యూ ఇచ్చారు.