తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chandramukhi 2 Ott: క్రేజీ ఓటీటీలో చంద్రముఖి 2.. ఆ ఛానెల్‍కు టీవీ హక్కులు.. రిలీజ్‍ విషయంలో ట్విస్ట్

Chandramukhi 2 OTT: క్రేజీ ఓటీటీలో చంద్రముఖి 2.. ఆ ఛానెల్‍కు టీవీ హక్కులు.. రిలీజ్‍ విషయంలో ట్విస్ట్

Sanjiv Kumar HT Telugu

28 September 2023, 12:58 IST

  • Chandramukhi 2 Movie OTT Release: సూపర్ హిట్ మూవీ చంద్రముఖు డైరెక్టర్ పి వాసి మరోసారి దర్శకత్వం వహించిన సినిమా చంద్రముఖి 2. సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్‍గా విడుదలైన చంద్రముఖి 2 మూవీ ఓటీటీ వేదిక, టెలివిజన్ ఛానెల్ స్ట్రీమింగ్ విషయాలపై లుక్కేస్తే..

చంద్రముఖి 2 అండ్ శాటిలైట్ రైట్స్
చంద్రముఖి 2 అండ్ శాటిలైట్ రైట్స్

చంద్రముఖి 2 అండ్ శాటిలైట్ రైట్స్

కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్, బాలీవుడ్ హాట్ బ్యూటి కంగనా రనౌత్ తొలిసారి కలిసి నటించిన సినిమా చంద్రముఖి 2. 17 సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించిన చంద్రముఖి మూవీకి సీక్వెల్‌గా అప్పటి డైరెక్టర్ పి వాసు దర్శకత్వంలో తెరకెక్కింది చంద్రముఖి 2. ఈ సినిమాను కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‍లో సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించారు.

ట్రెండింగ్ వార్తలు

Malayalam Movie: వామ్మో ఇదేం టైటిల్‌ -ఈ కొత్త మ‌ల‌యాళం మూవీ పేరు చెప్ప‌డానికి నోరు తిర‌గ‌డం క‌ష్ట‌మే!

NNS May 17th Episode: మళ్లీ భూలోకానికి అరుంధతి.. ఈసారి యముడు కూడా.. అమర్​కి తలంటిన భాగీ.. పిల్లలను రెచ్చగొట్టిన మనోహరి

Brahmamudi May 17th Episode: బ్రహ్మముడి- అనామికకు కల్యాణ్ విడాకులు- లేచిపోదామన్న అప్పు- తాతయ్య వార్నింగ్- కావ్యకు 2 డేస్

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా? - కేజీఎఫ్‌కు మించి యాక్ష‌న్‌…ఎలివేష‌న్స్?

మిశ్రమ స్పందన

చంద్రముఖి తర్వాత సీక్వెల్‍గా వస్తున్న చంద్రముఖి 2 సినిమాపై ఆది నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు గురువారం (సెప్టెంబర్ 28)న తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా వరల్డ్ వైడ్‌గా విడుదల చేశారు. అయితే చంద్రముఖి 2 సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. సేమ్ చంద్రముఖి తరహాలోనే మూవీని దింపేసారని అంటున్నారు.

థియేట్రికల్ తర్వాత

ఇక సినిమా టాక్ విషయం పక్కన పెడితే చంద్రముఖి 2 ఓటీటీ రిలీజ్ డేట్, రైట్స్ ఆసక్తిగా మారాయి. థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఓటీటీల్లో చూసే అవకాశం ఎక్కువగా ఉంది. చంద్రముఖి 2 సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మూవీ థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో చంద్రముఖి 2ని స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే చంద్రముఖి 2 చిత్రాన్ని ఏకంగా రెండు, మూడు నెలలకు విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఓటీటీ అండ్ టెలివిజన్

ఈ మధ్య కాలంలో థియేటర్లలో విడుదలైన సినిమాలు హిట్టియినా, ఫట్టయినా నెల రోజుల లోపే ఓటీటీలోకి దింపేస్తున్నారు. అలాంటి 2, 3 నెలలు అంటే మరి టూమచ్ అనే టాక్ వినిపిస్తోంది. కాకపోతే చంద్రముఖి 2కి థియేటర్ ఆడియెన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి ఓటీటీ రిలీజ్ డేట్‍లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇక చంద్రముఖి టెలివిజన్ హక్కులను ప్రఖ్యాత జెమినీ టీవీ సొంతం చేసుకుంది. కాగా చంద్రముఖి 2లో రాధికా శరత్ కుమార్, వడివేలు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం