తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chandramukhi 2 Day 1 Collection: చంద్రముఖి 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. హిట్‍కి ఎన్ని కోట్లు రావాలంటే?

Chandramukhi 2 Day 1 Collection: చంద్రముఖి 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. హిట్‍కి ఎన్ని కోట్లు రావాలంటే?

Sanjiv Kumar HT Telugu

28 September 2023, 16:34 IST

  • Chandramukhi 2 Day 1 BO Collection: 2005లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన మూవీనే చంద్రముఖి 2. సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్‌గా విడుదలైన చంద్రముఖి 2 మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

చంద్రముఖి 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. హిట్‍కి ఎన్ని కోట్లు రావాలంటే?
చంద్రముఖి 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. హిట్‍కి ఎన్ని కోట్లు రావాలంటే?

చంద్రముఖి 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. హిట్‍కి ఎన్ని కోట్లు రావాలంటే?

Chandramukhi 2 Box Office Collection: ప్రముఖ తమిళ డైరెక్టర్ పి వాసు దర్శకత్వంలో వచ్చిన మరో కొత్త సినిమా చంద్రముఖి 2. ఈ మూవీలో రాఘవ లారెన్స్, బాలీవుడ్ బ్యూటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇంతకుముందు వచ్చిన చంద్రముఖిలో రజనీ కాంత్, జ్యోతిక పాత్రల స్థానంలో లారెన్స్, కంగనా ఉన్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియాగా వరల్డ్ వైడ్‍గా చంద్రముఖి 2 సినిమా విడుదలైంది.

ట్రెండింగ్ వార్తలు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

నటీనటులు

లైకా ప్రొడక్షన్ బ్యానర్‍లో సుభాస్కరన్ అలిరాజా నిర్మించిన చంద్రముఖి 2 చిత్రాన్ని తెలుగులో శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్ రిలీజ్ చేసింది. చంద్రముఖి 2 సినిమాలో లారెన్స్, కంగనాతోపాటు రాధికా శరత్ కుమార్, వడివేలు, సృష్టి దంగే, లక్ష్మీ మీనన్, మహిమ నంబియార్, రావు రమేష్, విగ్నేష్, రవి మరియా, సురేష్ మీనన్, టీఎమ్ కార్తీక్, సుభిక్ష కృష్ణన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.

బడ్జెట్-ప్రీ రిలిజ్ బిజినెస్

సుమారు రూ. 50 నుంచి 60 కోట్ల బడ్జెట్‍తో చంద్రముఖి 2 సినిమాను నిర్మించారు. చంద్రముఖి 2 సినిమా తెలంగాణలోని నైజాం ఏరియాలో రూ. 3.50 కోట్లు, రాయలసీమలోని సీడెడ్‍లో రూ. 2.1 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మొత్తంగా రూ. 4.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. ఓవరాల్‍గా తెలంగాణ, ఏపీలో చంద్రముఖి 2 మూవీకి రూ. 10.10 కోట్ల ప్రీ బిజినెస్ జరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11 కోట్లుగా ఫిక్స్ అయింది. ఇక వరల్డ్ వైడ్‍గా రూ. 40 నుంచి 45 కోట్ల వరకు మార్కెట్ అయినట్లు సమాచారం.

ఫస్ట్ డే కలెక్షన్స్

చంద్రముఖి 2 సినిమా వరల్డ్ వైడ్‍గా హిట్ కొట్టాలంటే రూ. 46 కోట్లకుపైగా రాబట్టాలి. ఈ క్రమంలో చంద్రముఖి 2 చిత్రానికి విడుదలైన తొలి రోజున (సెప్టెంబర్ 28) రూ. 5.50 కోట్ల వరకు నెట్ ఇండియా కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళంలో 44.64 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. అయితే, తెలుగులో స్కంద పోటీకి గట్టిగా నిలబడితే తప్పా చంద్రముఖి 2కి కలెక్షన్స్ భారీగా వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం