తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 The Rule Live Updates: అల్లు అర్జున్ పుష్ప 2 రివ్యూ, కలెక్షన్స్, వివాదాలు, ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇవే!
అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీ లైవ్ అప్డేట్స్
అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీ లైవ్ అప్డేట్స్

Pushpa 2 The Rule Live Updates: అల్లు అర్జున్ పుష్ప 2 రివ్యూ, కలెక్షన్స్, వివాదాలు, ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇవే!

05 December 2024, 14:35 IST

  • Pushpa 2 The Rule Movie Live Updates: పుష్ప 2 ది రూల్ మూవీ ఇవాళ థియేటర్లలో విడుదల కానుంది. ఈపాటికే ప్రీమియర్ షోలు పడిపోయాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 రివ్యూ, లైవ్ అప్డేట్స్, కలెక్షన్స్ వంటి విషయాలపై లుక్కేద్దాం.

05 December 2024, 14:35 IST

పుష్ప 2 నెట్ కలెక్షన్స్

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు ఇండియాలో రూ. 58.47 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. భారతదేశంలో ఇవాళ ఒక్కరోజే ఇప్పటివరకు రూ. 58 కోట్లకుపైగా నికర వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

05 December 2024, 14:26 IST

అభిమాని మృతిపై స్పందించిన అల్లు అర్జున్ టీమ్‌

అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో సంద‌ర్భంగా సంధ్య థియేటర్ వద్ద బుధవారం రాత్రి జ‌రిగిన‌ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటనపై తాజాగా అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ఇది నిజంగా దురదృష్టక‌ర‌మ‌ని తెలిపింది. ప్రస్తుతం శ్రీతేజ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నాడ‌ని, మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామ‌ని తెలిపింది.

05 December 2024, 14:17 IST

కిస్సింగ్ సాంగ్

పుష్ప 2 సినిమాలో శ్రీలీల చేసిన కిస్సిక్ సాంగ్‌కు అనేక ప్రశంసలు వస్తున్నాయి. పాటలో బన్నీ, శ్రీలీల డ్యాన్స్ అదిరిపోయిందని అంటున్నారు

05 December 2024, 13:01 IST

అల్లు అర్జున్ స్పందించాలి

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ మహిళా అభిమాని రేవతి మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవతి భర్త భాస్కర్ మాట్లాడుతూ..

"మా బాబు శ్రీ తేజ.. అల్లు అర్జున్ ఫ్యాన్..

వాడి కోసమే మేము సినిమాకి వచ్చాము..

అందరూ మా బాబుని పుష్పా అని పిలుస్తారు..

కానీ మా భార్య ను కోల్పోవడం తట్టుకోలేక పోతున్న..

పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహ లోకి వచ్చాడు..

వెంటనే ఆసుపత్రికి తరలించారు..

మొదట నా భార్య పిల్లలు లోపలికి వెళ్లారు..

అప్పటికి అభిమానులు మాములుగా ఉండే..

ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ పెరిగింది..

తొక్కిసలాట జరిగింది..

మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు..

బంధువులు..

ఇప్పటికీ ఈ ఘటన పై అల్లు అర్జున్ స్పందించలేదు..

వెంటనే అల్లు అర్జున్ స్పందించి కుటుంబానికి అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం..

సంధ్య థియెటర్ పై చర్యలు తీసుకోవాలి" అని కోరారు.

05 December 2024, 11:58 IST

చిరంజీవిని కించపరిచాడని!

పుష్ప 2 మూవీలో అల్లు అర్జన్ చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది. మీ బాస్‌కు నేనే బాస్ అని బన్నీ డైలాగ్ చెబితే సోషల్ మీడియాలో మాత్రం మరోలా ట్రెండ్ చేస్తున్నారు. "ఎవడ్రా బాస్? ఎవడికిరా బాస్?ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్! అన్నట్లుగా మార్చారు. దాంతో చిరంజీవి, రామ్ చరణ్‌ను అల్లు అర్జున్ కించపరిచాడని తప్పుగా చిత్రీకరిస్తున్నారు.

05 December 2024, 11:25 IST

మహిళ అభిమాని మృతి

పుష్ప‌2' ప్రీమియ‌ర్ షోలో అప‌శ్రుతి చోటు చేసుకుంది. ఆర్‌టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేట‌ర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయింది. పుష్ప 2 సినిమాను వీక్షించ‌డానికి థియేట‌ర్‌కు వ‌చ్చిన అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీగా అభిమానులు ఎగబడ్డారు. వారిని చెద‌ర‌గొట్టే క్ర‌మంలో తొక్కిస‌లాట‌ జరిగింది. ఈ తొక్కిసలాటలో తీవ్ర గాయాల‌తో అయి ఓ మ‌హిళ అభిమాని మృతి చెందింది.

05 December 2024, 10:52 IST

పుష్ప 2 ఓటీటీ

పుష్ప 2 సినిమా ఓటీటీ రైట్స్‌ను దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుందని సమాచారం. నాలుగు నెలల తర్వాత పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

05 December 2024, 9:57 IST

తొలి రోజే 100 కోట్లు

పుష్ప 2 సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి. విడుదలైన తొలి రోజునాడే పుష్ప 2 ది రూల్ మూవీ రూ. 100 కోట్లు కొల్లగొట్టనుందని సమాచారం. ఇప్పటివరకు ఉన్న బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ 2, లియో, కల్కి 2898 ఏడీ కలెక్షన్స్ మైలురాయిని అల్లు అర్జున్ మూవీ చేరింది.

05 December 2024, 8:47 IST

మిస్సయిన సుక్కు మార్క్

పుష్ప 2 సెకండాఫ్‌లో ఎమోషన్లకు పెద్ద పీట వేశారని రివ్యూలు వస్తున్నాయి. స్టోరీలో కీలకమైన స్మగ్లింగ్‌ను పక్కన పెట్టినట్లు, సైగదీత సీన్స్, ఎక్కువ రన్‌టైమ్, విలనిజంలో బలం లేకపోవడం మైనస్ అని సుకుమార్ డైరెక్షన్‌పై కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే సుకుమార్ డైరెక్షన్ మార్క్ మిస్ అయిందని రివ్యూవర్స్ చెబుతున్నారు.

05 December 2024, 8:04 IST

బన్నీ నట విశ్వరూపం

పుష్ప 2 సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్పరాజ్ అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగాడన్నదే చూపించారు. పుష్ 2 ది రూల్ మూవీలో అల్లు అర్జున్ నట విశ్వరూపం, రష్మిక యాక్టింగ్, ప్రీ ఇంటర్వెల్, సాంగ్స్ చాలా బాగున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

05 December 2024, 7:31 IST

అక్కడక్కడ తొక్కిసలాటలు

ఇండియాలో పుష్ప 2 ది రూల్ హవా కొనసాగుతోంది. భారతదేశంలోని పుష్ప 2 థియేటర్లు ప్రేక్షకులతో కిటకిటలాడుతున్నాయి. పలు చోట్ల ప్రీమియర్ షోలకు భారీగా జనం రావడంతో తొక్కిసలాటలు కూడా చోటుచేసుకుంటున్నాయి.

05 December 2024, 7:07 IST

పుష్ప 2 ప్రీమియర్ టాక్

పుష్ప 2 ది రూల్ మూవీ ప్రీమియర్ షోలకు అదిరిపోయే టాక్ వస్తోంది. ఇంటర్వెల్, క్రైమాక్స్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పించాయని చూసిన ప్రేక్షకులు, ఫ్యాన్స్ చెబుతున్నారు.

05 December 2024, 7:05 IST

ఇండియావైడ్‌గా

ఇవాళ (డిసెంబర్ 5) ఇండియావైడ్‌గా భారీగా పుష్ప 2 ది రూల్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈపాటికే డిసెంబర్ 4 రాత్రి 9:30 గంటల నుంచి ప్రీమియర్ షోలు పడిపోయాయి.

05 December 2024, 7:05 IST

పుష్ప 2 యాక్టర్స్

అతి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్నతోపాటు ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, బిగ్ బాస్ దివి, అనసూయ భరద్వాజ్, జగదీష్ ఇతరులు కీలక పాత్రలు పోషించారు.

05 December 2024, 7:05 IST

భారీ నిర్మాణ సంస్థ

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 ది రూల్ సినిమాను భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరించారు.

05 December 2024, 7:04 IST

కెమిస్ట్రీతో మరోసారి

పుష్ప 2 మూవీలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్, శ్రీవల్లిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి తమ కెమిస్ట్రీతో మ్యాజిక్ క్రియేట్ చేయనున్నారు.

05 December 2024, 7:04 IST

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత

పుష్ప వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వస్తోన్న సీక్వెల్ మూవీ పుష్ప 2 ది రూల్. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మరో బిగ్గెస్ట్ ప్రెస్టీజియస్ సినిమాగా తెరకెక్కిన పుష్ప 2 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    ఆర్టికల్ షేర్ చేయండి