తెలుగు న్యూస్  /  Entertainment  /  Producer Skn Imitates Dil Raju Tamil Speech

SKN Imitates Dil Raju : కామెడీ ఇరుక్కు.. స్టోరీ ఇరుక్కు.. దిల్ రాజును ఇమిటేట్ చేసిన మరో నిర్మాత!

Anand Sai HT Telugu

21 January 2023, 13:47 IST

    • Producer SKN Speech : కాస్త అటు.. ఇటుగా మాట్లాడిన సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతుంటారు. ఈ ట్రోల్స్ సెగ సెలబ్రెటీలకు ఎక్కువగా తగులుతుంటుంది. అయితే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇటీవల తమిళంలో ఓ స్పీచ్ ఇచ్చారు. అదే స్పీచ్ ను మరో ప్రొడ్యూసర్ ఓ సినిమా ఫంక్షన్ లో ఇమిటేట్ చేశారు.
ఎస్కేఎన్
ఎస్కేఎన్ (twitter)

ఎస్కేఎన్

సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్(writer padmabhushan) ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్(SKN) పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీచ్ ఇచ్చారు. తమిళంలో దిల్ రాజు ఇచ్చిన స్పీచ్ లాగానే మాట్లాడారు. దీంతో మళ్లీ ట్రోల్స్ మెుదలయ్యాయి. సేమ్ దిల్ రాజులాగానే ఎస్కేఎన్ మాట్లాడారని చెబుతున్నారు. దీని మీద చాలా మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

SS Rajamouli's Bahubali: ఓటీటీలోకి బాహుబలి సరికొత్త కథ.. కట్టప్పే విలన్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

విజయ్ దళపతి(Vijay Thalapathy) నటించిన వారిసు(వారసుడు) సినిమాను దిల్ రాజు నిర్మించారు. తమిళంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేపర్ మీద కొన్ని పాయింట్స్ కూడా రాసుకున్నారు. విజయ్ దళపతి గురించి మాట్లాడారు. ఆ తర్వాత సినిమా గురించి మాట్లాడుతూ.. కామెడీ ఇరుక్కు(ఉంది), ఫైట్స్ ఇరుక్కు, స్టోరీ ఇరుక్కు, విజయ్ మేనరిజమ్ ఇరుక్కు అంటూ తమిళంలో స్పీచ్ ఇచ్చారు.

దిల్ రాజు తమిళ్ స్పీచ్(Dil Raju Tamil Speech) సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కొన్నిరోజుల పాటు ఎక్కడ చూసినా ఇవే కనిపించాయి. ఇంగ్లీష్, తమిళ్, తెలుగు కలిపి మాట్లాడారు దిల్ రాజు. దీని మీద విపరీతంగా మీమ్స్ క్రియేట్ చేశారు. ఇదే తరహాలో సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత ఎస్కేఎన్(శ్రీనివాస్ కుమార్) పాల్గొన్నాడు. స్పీచ్ ఇస్తూ లాస్ట్ లో కొన్ని రాసుకొచ్చానని, మొబైల్ తీసి చూశాడు. అప్పటికే అందరూ నవ్వడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమాలో కామెడీ ఇరుక్కు, స్టొరీ ఇరుక్కు అంటూ మాట్లాడారు.

దిల్ రాజు(Dil Raju) తరహాలోనే తెలుగు సినిమా ఫంక్షన్ లో ఎస్కేఎన్ తమిళ్ లో మాట్లాడుతూ.. ఇరుక్కు.. ఇరుక్కు అనడంతో ఈవెంట్లో ఫన్నీగా అందరూ నవ్వారు. ఇప్పుడు ఎస్కేఎన్ స్పీచ్ ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.