తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Preethi Pagadala: హీరోయిన్‌గా ఇన్‌స్టా గ్రామ్ సెన్సేషన్.. పతంగుల పోటీతో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్

Preethi Pagadala: హీరోయిన్‌గా ఇన్‌స్టా గ్రామ్ సెన్సేషన్.. పతంగుల పోటీతో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్

Sanjiv Kumar HT Telugu

17 January 2024, 8:27 IST

  • Patang Movie 2024: ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే తొలిసారిగా పతంగుల పోటీతో వస్తోన్న సినిమా పతంగ్. కామెడీ స్పోర్ట్స్ డ్రామా మూవీగా వస్తోన్న పతంగ్ కొత్త పోస్టర్స్ విడుదల చేశారు మేకర్స్.

హీరోయిన్‌గా ఇన్‌స్టా గ్రామ్ సెన్సేషన్.. పతంగుల పోటీతో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్
హీరోయిన్‌గా ఇన్‌స్టా గ్రామ్ సెన్సేషన్.. పతంగుల పోటీతో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్

హీరోయిన్‌గా ఇన్‌స్టా గ్రామ్ సెన్సేషన్.. పతంగుల పోటీతో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్

Preethi Pagadala Patang: సంక్రాంతి పండుగ అంటే పతంగుల సందడి ఉంటుంది. ఈ సంక్రాంతికి కూడా చిన్నపెద్దా తేడా లేకుండా ఎంతోమంది కైట్స్ ఎగురేస్తూ సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. అలా రెండు తెలుగు రాష్ట్రాలవ్యాప్తంగా సంక్రాంతి 2024 సెలబ్రేషన్స్ జరిగాయి. సంక్రాంతి పండుగకు పతంగులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో తెలిసిందే. ఇప్పుడు వాటి ప్రాముఖ్యతను మరింతగా చెప్పేలా సినిమా రాబోతుంది.

ట్రెండింగ్ వార్తలు

Madgaon Express OTT: ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్ యాక్టర్ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Yuvaraj OTT: ఓటీటీలోకి వ‌చ్చేసిన కాంతార‌ హీరోయిన్ యాక్ష‌న్ డ్రామా మూవీ - తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

Bollywood Actor: 200 సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ న‌టుడు - సూప‌ర్‌స్టార్ కావాల్సినోడు .. సీరియ‌ల్స్ చేస్తోన్నాడు

Prabhas Marriage: ప్రభాస్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్.. కాబోయే భార్య గురించేనా డార్లింగ్ పోస్ట్?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొత్తగా వస్తోన్న సరికొత్త మూవీ పతంగ్ (Patang 2024 Movie). ఇప్ప‌టి వ‌ర‌కు భార‌తీయ సినిమాలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్ష‌కులు చూసి ఉంటారు. కానీ, తొలిసారిగా ప‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే ప‌తంగ్. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిష‌న్ సినిమాస్ ప‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి సంయుక్తంగా పతంగ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అలాగే తెలుగులో వస్తోన్న పతంగ్ మూవీకి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ పతంగ్ చిత్రంలో ఇన్‌స్టాగ్రామ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌ (Preethi Pagadala), జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు. మ‌రికొంత మంది నూత‌న న‌టీన‌టుల‌తో పాటు ప్ర‌ముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

ప్ర‌స్తుతం ఈ పతంగ్ చిత్రం ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటోంది. 2024 సంవత్సరం వేస‌విలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి సంక్రాంతి ఫెస్టివల్‌ను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ ఇటీవల మేకర్స్ న్యూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. సంక్రాంతి పండుగలో భాగమైన పతంగ్ సెలబ్రేషన్స్‌ని తెలియజేసేలా ఉన్న ఈ పోస్టర్‌లో ఇద్దరు హీరోలు పతంగులు ఎగరవేస్తూ.. పోటీపడుతున్నట్లుగా ఉన్నారు.

అలాగే హీరోలు పోటీ పడుతూ ఉంటే హీరోయిన్ ప్రీతి పగడలా చక్కగా నవ్వుతూ కనపించింది. చూడగానే ఈ పోస్టర్ ఆకర్షిస్తోంది. సంక్రాంతి పండుగ ఉట్టపడేలా ఉంది పోస్టర్. చూస్తుంటే పతంగ్ పోటీతోపాటు ట్రయాంగిల్ లవ్ స్టోరీలా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పోస్టర్ విడుదల సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సికింద్ర‌బాద్ బ‌స్తీ నేప‌థ్యంలో రూపొందుతోన్న యూత్‌ఫుల్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా ఇది అని తెలిపారు.

"పతంగ్ సినిమాలో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎమోష‌న్ ఇలా అన్ని ఈ చిత్రంలో ఉంటాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ప్ర‌తి స‌న్నివేశం ఎంతో సహ‌జంగా ఉంటుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివరాలను తెలియ‌జేస్తాం" అని నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌‌గా శ‌క్తి అర‌వింద్‌ వర్క్ చేస్తే.. జొస్ జిమ్మి సంగీతం అందించారు. ఇక ఎడిట‌ర్‌‌గా చాణ‌క్య రెడ్డి, ప్రొడ‌క్ష‌న్ డిజైనర్‌గా వెంక‌ట్ శాతావాహ‌న‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా మేఘన శాతావాహ‌న పని చేశారు.

ఇదిలా ఉంటే ఇన్ స్టా గ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల గురించి ఇన్ స్టా యాజర్స్‌కు చెప్పాల్సిన పని లేదు. తన ఫొటోలు, వీడియోలతో నిత్యం ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. వీడియోల్లో అమెరికన్ యాసెంట్‌లో తెలుగు మాట్లాడుతూ అభిమానులకు ఎక్కువగా సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ ప్రీతి పగడాల. సోషల్ మీడియాలో బాగా క్లిక్ అయిన ప్రీతి పగడాల హీరోయిన్‌గా ఎంతవరకు రాణిస్తుందో చూడాలి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం