తెలుగు న్యూస్  /  Entertainment  /  Prashanth Neel Twitter Account Close After He Tweeted Birth Day Wishes To Yash

Prashanth Neel Twitter : రాకీ భాయ్​కి బర్త్ డే విష్.. కేజీఎఫ్ డైరెక్టర్ ట్విట్టర్ క్లోజ్

HT Telugu Desk HT Telugu

10 January 2023, 14:32 IST

    • Yash Birthday Tweet : కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ యశ్ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెప్పాడు. అయితే అతడి ట్విట్టర్ ఖాతా క్లోజ్ అయింది. బర్త్ డే విషెస్ పై వచ్చిన వ్యతిరేకత కారణంగానే ఇలా జరిగినట్టుగా తెలుస్తోంది.
యశ్, ప్రశాంత్ నీల్
యశ్, ప్రశాంత్ నీల్ (twitter)

యశ్, ప్రశాంత్ నీల్

సెలబ్రిటీలు అభిమానులతో చాలా విషయాలను పంచుకునేందుకు.. సోషల్ మీడియా(Social Media) ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు అన్నింటికి అదే.. దిక్కు. ఏ చిన్న విషయమైనా.. అందులో పెట్టేస్తే.. కోట్ల మందికి తెలిసిపోతుంది. అయితే కొన్నిసార్లు సోషల్ మీడియాతో వివాదాలు కూడా కావొచ్చు. ఇటీవల ప్రశాంత్ నీల్(Prashanth Neel) చేసిన ట్వీట్ కూడా వివాదం సృష్టించింది. ఈ వివాదం కారణంగానే.. ప్రశాంత్ నీల్ వారి ట్విట్టర్ ఖాతా క్లోజ్ అయింది.

ట్రెండింగ్ వార్తలు

Prasanna Vadanam OTT: ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆరోజే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

Kubera Nagarjuna: కుబేర నుంచి నాగార్జున ఫస్ట్ లుక్.. SRH vs RR మ్యాచ్‌ లైవ్‌లో గ్లింప్స్ రిలీజ్

Shaitaan OTT: ఓటీటీలోకి ఒక్క రోజు ఆలస్యంగా బ్లాక్ బస్టర్ హారర్ మూవీ.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Shriya Reddy Web Series: త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై స‌లార్ విల‌న్ శ్రియా రెడ్డి వెబ్ సిరీస్‌ - తెలుగులోనూ స్ట్రీమింగ్

జనవరి 8న రాకీ భాయ్ యశ్ బర్త్ డే(Yash Birthday). ఈ సందర్భంగా కేజీఎఫ్(KGF) డైరెక్టర్ ప్రశాంత్ నీల్ విషెస్ చెప్పాడు. అయితే దీనిపై వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత ఎందుకంటే.. విషెస్ ను ఉర్దూలో చెప్పాడు ఈ స్టార్ డైరెక్టర్. దీంతో కన్నడిగులు మండిపడ్డారు. ప్రశాంత్ ను దారుణంగా ట్రోల్ చేశారు.

ఉర్దూ డైలాగ్‌ని రాసి యశ్‌కి ప్రశాంత్ నీల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ ట్వీట్‌కి చాలా మంది కామెంట్ చేశారు. ఇదేంటి ఉర్దూలో చెప్పడం అంటూ మండిపడ్డారు. ప్రశాంత్ నీల్‌ కన్నడలో ట్వీట్ చేయోచ్చు కదా అని విమర్శించారు. అయితే ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ట్విట్టర్ అకౌంట్ మాత్రం పనిచేయడం లేదు.

ప్రశాంత్ నీల్ ట్విటర్(Prashant Neel Twitter)) ఖాతాలోకి ఎంట్రీ ఇస్తే 'ఈ ఖాతా లేదు' అనే నోటిఫికేషన్ చూపుతోంది. ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. కావాలనే.. ఇలా చేశాడా? లేదంటే.. అకౌంట్ ఎవరైనా హ్యాక్ చేసి క్లోజ్ చేశారా తెలియదు. మెుత్తానికి బర్త్ డే విష్ తర్వాత వ్యతిరేకత కనిపించింది. ఆ తర్వాత ఇలా ట్విట్టర్ ఖాతా క్లోజ్ అయింది.

KGF Sequel Update : ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ సినిమా(KGF Cinema) ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యశ్ హీరోగా రూపొందిన ఈ సినిమా అద్భుత వసూళ్లతో అదరగొట్టింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్స్‌పై కూడా ఆసక్తి మొదలైంది. కేజీఎఫ్‌ను నిర్మించిన హోంబళే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ కేజీఎఫ్ ఛాప్టర్ 3కి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. కేజీఎఫ్-3 2025లో మొదలవుతుందని, 2026 తర్వాత విడుదలవుతుందని స్పష్టం చేశారు. ఇంత వరకు ఈ సీక్వెల్‌కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభం కాలేదని చెప్పారు.

అంతేకాకుండా కేజీఎఫ్ ఛాప్టర్ 3లో హీరో ఎవరనేది కూడా విజయ్ హింట్ ఇచ్చారు. అధికారికంగా ఇందులో హీరో గురించి చెప్పనప్పటికీ కొత్త హీరో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ సీక్వెల్స్‌లో జేమ్స్ బాండ్ తరహాలో విభిన్న హీరోలు ఉంటారని తెలిపారు. మొత్తం కేజీఎఫ్‌కు ఐదు సీక్వెల్స్‌ వస్తాయని, కేజీఎఫ్ సిరీస్‌లో వీరు ఛేంజ్ అవుతుంటారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.