తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Trailer: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. సలార్ ట్రైలర్ వాయిదా.. రిలీజ్ కొత్త డేట్ ఇదే!

Salaar Trailer: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. సలార్ ట్రైలర్ వాయిదా.. రిలీజ్ కొత్త డేట్ ఇదే!

Sanjiv Kumar HT Telugu

17 December 2023, 18:03 IST

google News
  • Salaar Trailer Postponed: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు హౌంబలే ఫిల్మ్స్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఎంతగానో ఎదురుచూస్తున్న సలార్ ట్రైలర్ వాయిదా వేస్తున్నట్లుగా ఆఖరి నిమిషంలో చెప్పి హ్యాండ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సలార్ రెండో ట్రైలర్ కొత్త డేట్ ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది.

ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. సలార్ ట్రైలర్ వాయిదా.. రిలీజ్ కొత్త డేట్ ఇదే!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. సలార్ ట్రైలర్ వాయిదా.. రిలీజ్ కొత్త డేట్ ఇదే!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. సలార్ ట్రైలర్ వాయిదా.. రిలీజ్ కొత్త డేట్ ఇదే!

Salaar Release Trailer Postponed: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‍కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక డార్లింగ్ సినిమాల కోసం ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులే కాదు.. బాక్సాఫీస్ కూడా ఎదురుచూస్తుంటుంది. అలాంటి ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి.

కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ క్రేజీయెస్ట్ మూవీ సలార్. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్‌ను డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే సలార్ గ్లింప్స్, రిలీజ్ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేశాయి.

ఈ మూవీ థియేట్రికల్ విడుదలకు ముందు ఆదివారం (డిసెంబర్ 17) సలార్ రెండో ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. అయితే ఆఖరు నిమిషంలో సలార్ ట్రైలర్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి ప్రభాస్ ఫ్యాన్స్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. పలు సాంకేతిక కారణాల వల్ల సలార్ ట్రైలర్ వాయిదా వేసినట్లుగా సమాచారం.

అయితే, సలార్ ట్రైలర్‌ను సోమవారం (డిసెంబర్ 18) సాయంత్ర విడుదల చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరగుతోంది. ఇందులో ఎంత నిజముందో తెలియరాలేదు. కాగా ఇప్పటికే సలార్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా మొదటి టికెట్‌ను రాజమౌళి కొనుగోలు చేశారు. ఏకంగా రూ. 10 వేల 116 పెట్టి జక్కన్న సలార్ ఫస్ట్ టికెట్ కొన్నారు. దీంతో సలార్‌పై ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం