Salaar: 28 ఏళ్లుగా ఆ థియేటర్‌లో షారుక్ మూవీనే.. కానీ, ఈసారి మాత్రం ప్రభాస్ సలార్.. ఎక్కడంటే?
31 December 2023, 8:13 IST
Prabhas Salaar vs Shah Rukh Khan Dunki: ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సలార్ వర్సెస్ డంకీ నడుస్తోంది. ఈ నేపథ్యంలో 28 ఏళ్లుగా షారుక్ ఖాన్ సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్‌లో డంకీకి బదులు ప్రభాస్ సలార్ మూవీని విడుదల చేశారు. ఇంతకీ ఏంటా థియేటర్, ఎక్కడనే వివరాల్లోకి వెళితే..
28 ఏళ్లుగా ఆ థియేటర్‌లో షారుక్ మూవీనే.. కానీ, ఈసారి మాత్రం ప్రభాస్ సలార్.. ఎక్కడంటే?
Salaar In Maratha Mandir: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద అరాచకం సృష్టిస్తోంది. సలార్ సినిమాకు 9 రోజుల్లో సుమారుగా 500 కోట్లకుపైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. సలార్ కంటే ఒక రోజు ముందు విడుదలైన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ డంకీ మూవీ మాత్రం కలెక్షన్ల పరంగా వెనుకంజలో ఉంది.
ఇదిలా ఉంటే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్‌కు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండియా వైడ్‌గా షారుక్ ఖాన్‌కు ఫుల్ క్రేజ్ ఉంది. ఆయన సినిమాలంటే ఫ్యాన్స్ ఎగబడి చూస్తారు. అందుకు ఉదాహరణే పఠాన్, జవాన్. అలాంటి షారుక్ ఖాన్ సినీ కెరీర్‌లో దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే (1995) మూవీ చాలా స్పెషల్.
షారుక్, కాజోల్ జంటగా నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే మూవీని ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్‌లో ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారు. అంటే సుమారుగా 28 సంవత్సరాలుగా దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాను మరాఠా మందిర్‌లో రోజుకు ఓ షో వేస్తున్నారు. మిగిలిన సమయంలో ఆ టైమ్‌లో విడుదలయ్యే సూపర్ హిట్ మూవీస్, కొత్త రిలీజ్ సినిమాలు ప్రదర్శిస్తుంటారు. ఒకవేళ షారుక్ మూవీ వస్తే అన్ని షోలు ఆయన సినిమాలే ఆడతాయి.
అయితే, డంకీ రిలీజ్‌కు ముందు మరాఠా మందిర్ థియేటర్‌లో యానిమల్‌తో ప్రదర్శించారు. తర్వాత యానిమల్ తీసేసి డంకీ సినిమాను షోస్‌గా వేశారు. కానీ, సలార్ విడుదలయ్యాక మాత్రం షారుక్ డంకీని సైతం తీసేసి ప్రభాస్ మూవీని ప్రదర్శించారు. ఎప్పుడూ అధికంగా షారుక్ సినిమాలు ఆడే ఆ థియేటర్‌లో డంకీని ఒక్కరోజు మాత్రమే ప్రదర్శించారు.
ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. దాదాపుగా షారుక్ టెరిటరీగా చెప్పుకునే మరాఠా మందిర్‌లో డంకీ పక్కన పెట్టి ప్రభాస్ సలార్ మూవీ ప్రదర్శించి 28 ఏళ్ల సెంటిమెంట్‌ను బ్రేక్ చేశారు థియేటర్ యాజమాన్యం. ఇది ఒక రకంగా షారుక్‌కు అవమానం అని కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా కానీ ప్రభాస్ క్రేజ్ మాత్రం మాములుగా లేదు అనేలా ఉందిగా ఈ విషయం.