తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Raja Deluxe Pic Leaked: ప్ర‌భాస్ రాజా డీల‌క్స్ ఫొటో లీక్ - సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

Prabhas Raja Deluxe Pic leaked: ప్ర‌భాస్ రాజా డీల‌క్స్ ఫొటో లీక్ - సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

25 December 2022, 7:09 IST

  • Prabhas Raja Deluxe leaked Pic: ప్ర‌భాస్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాకు సంబంధించిన వ‌ర్కింగ్ స్టిల్ లీక్ అయ్యింది. ఈ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ప్రభాస్, మారుతి
ప్రభాస్, మారుతి

ప్రభాస్, మారుతి

Prabhas Raja Deluxe Pic leaked : ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు మారుతి సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు ప్ర‌భాస్‌. సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ సినిమా వ‌ర్కింగ్ స్టిల్ సోష‌ల్ మీడియాలో లీక్ అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

షూటింగ్ సెట్స్‌లో ప్ర‌భాస్‌, ద‌ర్శ‌కుడు మారుతి ముచ్చ‌టిస్తూ ఈ ఫొటోలో క‌నిపిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ స్టైలిష్‌లుక్‌లో క‌నిపిస్తున్నారు. ఈ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలోవైర‌ల్‌గా మారింది. ప్ర‌భాస్ అభిమానులు ఈ లీక్‌డ్ పిక్‌ను తెగ షేర్ చేస్తున్నారు. హైద‌రాబాద్‌లో జ‌రుగుతోన్న షెడ్యూల్‌లో ప్ర‌భాస్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై మారుతి కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఈ సినిమాకు రాజా డీల‌క్స్ అనే పేరును ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు సంజ‌య్‌ద‌త్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌భాస్ తాత‌గా సంజ‌య్ ద‌త్‌ క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. తాతా మ‌న‌వ‌ళ్ల అనుబంధం ఈ సినిమాలో మెయిన్ పాయింట్‌గా ఉంటుంద‌ని తెలిసింది.

ప‌రిమిత బ‌డ్జెట్‌లో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ఈసినిమాను రూపొందిస్తున్నారు. రాజా డీల‌క్స్ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ప్ర‌భాస్‌- మారుతి సినిమాప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రాజా డీల‌క్స్‌తో పాటు ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్‌, స‌లార్‌, ప్రాజెక్ట్ సినిమాలు కూడా వ‌చ్చే ఏడాది రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం