తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas- Maruthi Film: ప్రభాస్ - మారుతి కాంబో మూవీ పూజా కార్యక్రమాలతో షురూ

Prabhas- Maruthi FIlm: ప్రభాస్ - మారుతి కాంబో మూవీ పూజా కార్యక్రమాలతో షురూ

HT Telugu Desk HT Telugu

25 August 2022, 14:57 IST

  • ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి (Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా గురువారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ వేడుక తాలుకు విశేషాలేమిటంటే....

ప్రభాస్
ప్రభాస్ (twitter)

ప్రభాస్

Prabhas- Maruthi FIlm: బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయారు ప్రభాస్. ప్రస్తుతం అతడి సినిమాల కోసం తెలుగుతో పాటు ఇండియా వైడ్ గా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మూడు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్.

ట్రెండింగ్ వార్తలు

Prabhas Chakram: రీ రిలీజ్ కానున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ - ఈ వార‌మే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోంది!

Chandini Chowdary: ఒకే రోజు థియేట‌ర్ల‌లో విడుద‌ల‌ కానున్న చాందిని చౌద‌రి రెండు సినిమాలు

OTT: ఓటీటీలో ప్రసన్నవదనం చిత్రానికి రికార్డుస్థాయి వ్యూస్.. 9 రోజుల్లోనే ఆ మైలురాయి దాటేసింది

Elections Results 2024: సినిమా థియేటర్లలో ఎన్నికల ఫలితాల లైవ్.. ఈ సిటీల్లో బుకింగ్స్ కూడా షురూ

తాజాగా మరో కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా పూజా కార్యక్రమాలను గురువారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ పుజా కార్యక్రమాలకు ప్రభాస్ హాజరైనట్లు తెలిసింది. ప్రభాస్ తో పాటు దర్శకుడు మారుతి, మరికొందరు యూనిట్ సభ్యుల సమక్షంలో సింపుల్ గా పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు సమాచారం.

సూపర్ నాచురల్ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు మారుతి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రయోగాత్మకంగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.ఈ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలిసింది. వారు ఎవరన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దసరా తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మారుతితో ప్రభాస్ సినిమా చేయడం అతడి అభిమానులకు నచ్చడం లేదు. అందుకే మారుతిని టాలీవుడ్ నుంచి బహిష్కరించాలంటూ బాయ్ కట్ మారుతి ఫ్రమ్ టీఎఫ్ఐ హ్యాష్ ట్యాగ్ తో ప్రభాస్ ఫ్యాన్స్ వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాగా

ప్రస్తుతం ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్నాడుప్రభాస్. గ్యాంగ్ స్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే షూటింగ్ జరుగుతోంది. పౌరాణిక కథాంశంతో ప్రభాస్ చేసిన ఆది పురుష్ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం