Prabhas Salaar Dialogues: సలార్‌లో ప్రభాస్ డైలాగ్స్ లెంగ్త్ నాలుగు నిమిషాలే - 38 డైలాగ్స్ మాత్రమే చెప్పిన డార్లింగ్
22 January 2024, 12:55 IST
Prabhas Salaar Dialogues: సలార్ సినిమా మొత్తంలో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ లెంగ్త్ కేవలం నాలుగున్నర నిమిషాలే ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. రెండు గంటల యాభై ఐదు నిమిషాల నిడివితో కూడిన సినిమాలో కేవలం 38 చిన్న డైలాగ్స్ మాత్రమే ప్రభాస్ చెప్పాడం గమనార్హం.
ప్రభాస్ సలార్ మూవీ
Prabhas Salaar Dialogues: ప్రభాస్ సలార్ మూవీ 2023లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. డిసెంబర్ 22న రిలీజైన సలార్ మూవీ వరల్డ్ వైడ్‌గా 700 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ప్రభాస్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. రెండు గంటల యాభై ఐదు నిమిషాల నిడివితో థియేటర్లలో సలార్ మూవీ రిలీజైంది.
అయితే సినిమా మొత్తంలో ప్రభాస్ డైలాగ్స్ చెప్పిన లెంగ్త్ మాత్రం నాలుగున్నర నిమిషాలే ఉన్నాయంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో చాలా వరకు ప్రభాస్ సైలెంట్‌గానే కనిపిస్తాడు. సలార్‌లో కేవలం 38 డైలాగ్స్ మాత్రమే చెప్పాడు ప్రభాస్. అవి కూడా చిన్న చిన్న పదాలతో కూడినవే ఎక్కువగా ఉన్నాయి. ప్రభాస్ కోసం పదివరకు మాత్రమే ప్రశాంత్ నీల్ పెద్ద డైలాగ్స్ రాశారు. దాదాపు మూడు గంటల నిడివి కలిగిన సినిమాలో అతి తక్కువ డైలాగ్స్ చెప్పిన హీరోగా ప్రభాస్ నిలిచాడు.
ఓటీటీలో రిలీజైన థియేటర్లలో కోటి కలెక్షన్స్...
ప్రభాస్ సలార్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం (జనవరి 20) నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఐదు భాషల్లో ఇండియా వైడ్‌గా ట్రెండింగ్ లిస్ట్‌లో సలార్ మూవీ నిలిచింది. ఓటీటీలో రిలీజైన కూడా ఈ సినిమా థియేటర్లలో ఆదివారం 70 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది. శుక్ర, శనివారాల కంటే ఆదివారం థియేటర్లలో సలార్ వసూళ్లు పెరగడం గమనార్హం.
స్నేహితుల కథతో...
సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. ఇద్దరు స్నేహితుల కథతో ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఇందులో ప్రభాస్ స్నేహితుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు. తన స్నేహితుడు వరదరాజమన్నార్‌ను కాపాడటానికి దేవా ఎలాంటి పోరాటం చేశాడు. ఖన్సార్ దొర కుర్చీలో వరదరాజమన్నార్ కూర్చొకుండా శత్రువులు ఎలాంటి ఎత్తులు వేశారు? దేవా వారందరిని ఏ విధంగా మట్టుపెట్టాడు అన్నదే ఈ మూవీ కథ. సలార్‌లో శృతిహాసన్, జగపతిబాబు, శ్రియారెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. సలార్‌కు శౌర్యంగపర్వమ్ పేరుతో సీక్వెల్ రాబోతోంది.
ఉగ్రమ్ స్ఫూర్తితో...
కన్నడంలో విజయవంతమైన ఉగ్రమ్ సినిమా స్ఫూర్తితో సలార్‌ను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. సలార్ తర్వాత ప్రభాస్ కల్కి 2989 ఏడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈమూవీ మే 9న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే డైరెక్టర్ మారుతితో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. హారర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.