తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Dating Kriti Sanon: ప్రభాస్-కృతి డేటింగ్.. త్వరలో పెళ్లా? సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం

Prabhas Dating Kriti Sanon: ప్రభాస్-కృతి డేటింగ్.. త్వరలో పెళ్లా? సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం

29 November 2022, 7:40 IST

  • Prabhas Dating Kriti Sanon: ప్రభాస్-కృతి సనన్ ప్రేమలో ఉన్నారని గత కొద్దికాలంగా వస్తున్న వార్తలపై బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరి సంబంధం గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా.. పరోక్షంగా హింట్ ఇచ్చాడు.

కృతి సనన్‌తో ప్రభాస్ డేటింగ్
కృతి సనన్‌తో ప్రభాస్ డేటింగ్

కృతి సనన్‌తో ప్రభాస్ డేటింగ్

Prabhas Dating Kriti Sanon: రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మధ్య ఏదో నడుస్తుందని గత కొద్ది కాలంగా విపరీతంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఇద్దరూ అధికారికంగా ప్రకటించనప్పటికీ పలు సందర్భాల్లో పరోక్షంగా తమ సంబంధాన్ని ఒప్పుకున్నట్లు ప్రవర్తించారు. త్వరలో కృతి సనన్‌కు ప్రభాస్ ప్రపోజ్ చేయబోతున్నాడని నెట్టింట పెద్ద దుమారేమే చెలరేగుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్.. పరోక్షంగా కృతి సనన్‌ -ప్రభాస్ డేటింగ్‌లో ఉన్నాడని తెలిపడంతో.. సోషల్ మీడియా వేదికగా విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి. అంతేకాకుండా త్వరలో ప్రభాస్.. కృతికి ప్రపోజ్ చేయనున్నాడని, ఆ తర్వాత పెళ్లి, పీటలెక్కనున్నారని పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వరుణ్ ధావన్ వీడియోను నెట్టింట వైరల్ చేస్తున్నారు.

వరుణ్-కృతి ఇద్దరూ కలిసి భేడియా తెలుగులో తోడేలు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ప్రముఖ హిందీ డ్యాన్స్ షోకు వీరు హాజరయ్యారు. ఆ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్.. వరుణ్‌ను బాలీవుడ్‌లో సింగిల్‌గా ఉన్న హీరోయిన్ల గురించి అడిగారు. ఇందుకు వరుణ్ కృతి సనన్ పేరును చెప్పకుండా కొంతమంది పేర్లను సూచించాడు. దీనికి కరణ్ కృతి పేరును ఎందుకు చెప్పలేదు అని అడుగ్గా.. "ఎందుకంటే కృతి ఇప్పటికే ఒకరి హృదయంలో ఉంది. అతడు ముంబయిలో లేడు. ప్రస్తుతం అతడు దీపికాతో కలిసి ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు" అంటూ పరోక్షంగా ప్రభాస్ గురించి తెలియజేశాడు.

వరుణ్ మాటలకు కృతి కూడా నవ్వూతూ చూస్తుండిపోయింది. ప్రభాస్ పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా.. వరుణ్ చెప్పింది.. మన డార్లింగ్ గురించేనని ఫ్యాన్స్ ఓ నిర్ణాయానికి వచ్చారు. ఇదే అధికారిక కన్ఫార్మేషన్‌గా భావిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్టు కే సినిమాలో దీపికాతో పదుకునేతో కలిసి నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2024లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

ప్రభాస్-కృతి సనన్ ఓ రౌత్ తెరకెక్కిస్తోన్న ఆదిపురుష్ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సెట్స్‌లోనే వీరిద్దరూ క్లోజ్ అయ్యారని, ఎప్పుడూ షూటింగ్‌లో సైలెంట్‌గా ఉండే ప్రభాస్.. కృతితో మాత్రం తెగ కబుర్లు చెప్పేవాడని, ఇద్దరూ సన్నిహితంగా మెలిగేవారని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది. తాజాగా వరుణ్ వీడియోతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.