తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suvarna Sundari Release Date: పూర్ణ సూప‌ర్ నాచుర‌ల్ థ్రిల్ల‌ర్‌ సువ‌ర్ణ సుంద‌రి రిలీజ్ డేట్ ఫిక్స్

Suvarna Sundari Release Date: పూర్ణ సూప‌ర్ నాచుర‌ల్ థ్రిల్ల‌ర్‌ సువ‌ర్ణ సుంద‌రి రిలీజ్ డేట్ ఫిక్స్

23 January 2023, 23:36 IST

  • Suvarna Sundari Release Date:పూర్ణ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సువ‌ర్ణ సుంద‌రి సినిమా రిలీజ్ డేట్ ఖ‌రారైంది. సూప‌ర్ నాచుర‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు రానుందంటే...

పూర్ణ
పూర్ణ

పూర్ణ

Suvarna Sundari Release Date:ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ భాష‌ల్లో డిఫ‌రెంట్ రోల్స్ చేస్తూ బిజీగా ఉంది న‌టి పూర్ణ‌. ఆమె క‌థానాయిక‌గా న‌టించిన తాజా సినిమా సువ‌ర్ణ సుంద‌రి ఫిబ్ర‌వ‌రి 3న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. సూప‌ర్ నాచుర‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టి జ‌య‌ప్ర‌ద కీల‌క పాత్ర‌ను పోషించింది.

ట్రెండింగ్ వార్తలు

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Devara vs NBK 109: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

సాక్షి చౌద‌రి మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాకు సురేంద్ర మాదార‌పు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2019లోనే ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. క‌రోనా కార‌ణంగా చాలా రోజుల పాటు వాయిదా ప‌డిన ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 3న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు డైరెక్ట‌ర్ పేర్కొన్నాడు.

బింబిసార‌, కార్తికేయ -2 త‌ర‌హాలో సోషియా ఫాంట‌సీ జాన‌ర్‌లో రూపొందిన సువ‌ర్ణ సుంద‌రి త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంద‌నే న‌మ్మ‌క‌ముంద‌ని డైరెక్ట‌ర్ పేర్కొన్నాడు. సువ‌ర్ణ సుంద‌రి సినిమాలో సాయికుమార్‌, కోట శ్రీనివాస‌రావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

ఈ సినిమాకు సాయికార్తిక్ సంగీతాన్ని అందించాడు. కాగా తెలుగులో సీమ‌ట‌పాకాయ్‌, అవును, ల‌డ్డుబాబుతో పాటు ప‌లు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది పూర్ణ‌. ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్‌ను ప్రారంభించిన ఆమె అఖండ‌, దృశ్యం-2 సినిమాల‌తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న‌ది. ప్ర‌స్తుతం నాని ద‌స‌రా సినిమాలో పూర్ణ కీల‌క పాత్ర చేస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం