తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ponniyin Selvan Box Office Collection: పొన్నియ‌న్ సెల్వ‌న్ క‌లెక్ష‌న్స్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌

Ponniyin Selvan Box Office Collection: పొన్నియ‌న్ సెల్వ‌న్ క‌లెక్ష‌న్స్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌

03 October 2022, 13:25 IST

google News
  • Ponniyin Selvan Box Office Collection: పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమా త‌మిళ‌నాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంటోంది. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చారిత్ర‌క సినిమాకు మూడు రోజుల్లో వ‌చ్చిన వ‌సూళ్లు ఎంతంటే....

పొన్నియ‌న్ సెల్వ‌న్
పొన్నియ‌న్ సెల్వ‌న్ (Twitter)

పొన్నియ‌న్ సెల్వ‌న్

Ponniyin Selvan Box Office Collection: మ‌ణిర‌త్నం పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుత‌మైన వ‌సూళ్ల‌తో దూసుకుపోతున్న‌ది. మూడు రోజుల్లోనే 230 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తెలుగులో మూడు రోజుల్లో పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాకు 14. 50 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయి.

టాలీవుడ్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఆదివారం నాటితో ఎగ్జిబిట‌ర్లు సేఫ్ జోన్‌లోకి వెళ్లిన‌ట్లు చెబుతున్నారు. సోమ‌వారం నుంచి లాభాల బాట ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. కాగా మూడు రోజుల్లో త‌మిళ‌నాడులో 74 కోట్లు, ఓవ‌ర్‌సీస్‌లో 87.80 కోట్లు, కేరళ‌లో ప‌ది కోట్లు, క‌ర్ణాట‌క‌లో 13.70 కోట్ల వ‌సూళ్ల‌ను పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమా రాబ‌ట్టిన‌ట్లు తెలిసింది. ఇత‌ర రాష్ట్రాల్లో 10 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

త‌మిళ‌నాడుతో పాటు ఓవ‌ర్‌సీస్‌లో ఈ సినిమా చ‌క్క‌టి వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంటోంది. మిగిలిన చోట్ల నెగెటివ్ టాక్ ఉన్నా క‌లెక్ష‌న్స్ మాత్రం నిల‌క‌డ‌గా ఉన్నాయి. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ సినిమా 130 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన‌ట్లు స‌మాచారం. మూడు రోజుల క‌లెక్ష‌న్స్‌తోనే నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు లాభాల బాట ప‌ట్టిన‌ట్లు చెబుతున్నారు.

క‌ల్కి కృష్ణ‌మూర్తి రాసిన పొన్నియ‌న్ సెల్వ‌న్ న‌వ‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ఈ సినిమాను తెర‌కెక్కించాడు. విక్ర‌మ్‌, కార్తి, జ‌యంర‌వి, ఐశ్వ‌ర్యారాయ్‌, త్రిష కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. చోళ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయ‌డానికి శ‌త్రువులు వేసిన ప‌న్నాగాల చుట్టూ మొద‌టి పార్ట్‌ను తెర‌కెక్కించారు మ‌ణిర‌త్నం. రెండో భాగాన్ని వ‌చ్చే ఏడాది వేస‌విలో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి మ‌ణిర‌త్నం నిర్మించారు. ఏ.ఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందించాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం