Pallavi Prashanth: బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్‌దీప్‌పై కేసు నమోదు - కారణం ఇదే!
19 December 2023, 12:48 IST
Pallavi Prashanth: పోలీసుల నుంచి అనుమతులు తీసుకోకుండా ర్యాలీ చేసినందుకు బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అతడితో పాటు బిగ్‌బాస్ రన్నరప్ అమర్‌దీప్‌తో పాటు షో నిర్వహకులపై కూడా కేసు పెట్టినట్లు తెలిసింది.
పల్లవి ప్రశాంత్, అమర్ దీప్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్‌గా నిలిచిన పల్లవి ప్రశాంత్‌తో పాటు రన్నరప్ అమర్‌దీప్‌కు పోలీసులు షాకిచ్చారు. వీరిద్దరితో పాటు బిగ్‌బాస్ నిర్వహకులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం జరిగిన బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలో పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు. గ్రాండ్ ఫినాలేలో పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ మధ్య పోటీ నువ్వా...నేనా అన్నట్లుగా సాగింది. చివరకు టైటిల్ పల్లవి ప్రశాంత్‌నే వరించింది.
గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత రన్నరప్ అమర్‌దీప్ అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వస్తోన్న క్రమంలో అతడిపై దాడి చేసేందుకు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ప్రయత్నించారు. ఇందులో అమర్‌దీప్ కారు ధ్వంసం అయ్యింది. గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత ఎలాంటి గొడవ జరగకుండా ఉండేందుకు అన్నపూర్ణ స్టూడియో బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు దూరంగా పంపించినట్లు తెలిసింది.
కానీ అతడు తిరిగి మళ్లీ అక్కడకు రావడంతో గొడవ పెద్దదైనట్లు తెలిసింది. పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ ఫ్యాన్స్ ఒకరిపై మరొకరు దాడిచేసుకున్నారు.ఈ గొడవలో ఐదు ఆర్టీసీ బస్ అద్దాలతో పాటు కొన్ని కార్లు, పోలీస్ బస్ అద్దాలు పగలిపోయాయి. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ గీతూరాయల్, అశ్విని కార్లను కూడా ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్‌లపై దాటి ఘటనను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఖండించారు.
దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీ చేసి పబ్లిక్ న్యూసెన్స్ చేసినందుకు పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
అభిమానులను రెచ్చగొట్టినందుకు అమర్‌దీప్‌పై కేసు పెట్టినట్లు సమాచారం. గొడవలు జరుగుతాయని ముందే పోలీసులు హెచ్చించిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో బిగ్‌బాస్ నిర్వహకులపై కూడా కేసును నమోదు చేసినట్లు తెలుస్తోంది. పబ్లిక్ ప్రాపర్టీ ని ధ్వంసం చేసిన పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
టాపిక్