తెలుగు న్యూస్  /  Entertainment  /  Pokiri Special Shows Creates History In Indian Cinema Industry

Pokiri Special Shows: పోకిరి రీరిలీజ్‌తో చరిత్ర సృష్టించిన మహేష్‌ బాబు

HT Telugu Desk HT Telugu

08 August 2022, 15:22 IST

    • Pokiri Special Shows: సరిగ్గా 16 ఏళ్ల కిందట ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనాలు సృష్టించిన పోకిరి మూవీ ఇప్పుడు రీరిలీజ్‌ సందర్భంగా కూడా చరిత్ర సృష్టిస్తోంది.
పోకిరిలో మహేష్ బాబు
పోకిరిలో మహేష్ బాబు (Twitter)

పోకిరిలో మహేష్ బాబు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌కు మరోసారి అద్దం పడుతోంది అతని సూపర్‌ హిట్‌ మూవీ పోకిరి రీరిలీజ్‌. మంగళవారం (ఆగస్ట్‌ 9) మహేష్‌ బాబు 47వ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పోకిరి స్పెషల్‌ షోలు వేయనున్నారు. అయితే ఇప్పటి వరకూ ఏ ఇండియన్‌ మూవీకి లేనన్ని స్పెషల్‌ షోలు పోకిరి మూవీకి వేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Aarambham: ఆ సినిమాలన్నీ ఓటీటీలోకే.. సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ అన్ని జోనర్లతో ఆరంభం: నటుడు రవీంద్ర విజయ్

Suhas: నా సినిమాలు మౌత్ టాక్‌తోనే వెళ్తాయి.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది.. సుహాస్ కామెంట్స్

Mahesh Babu: మ‌హేష్ బాబు రిజెక్ట్ చేసిన ల‌వ్ స్టోరీ థియేట‌ర్ల‌లో ఏడాది ఆడింది- ఆ సినిమా ఏదంటే?

NNS May 2nd Episode: మనోహరికి షాక్ ఇచ్చిన మిస్సమ్మ.. చివరిసారిగా వీడ్కోలు పలికిన అరుంధతి.. ముగియనున్న పాత్ర

ప్రపంచవ్యాప్తంగా 175కుపైగా స్పెషల్‌ షోలు ఏర్పాటు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 60, తెలంగాణలో 42 షోలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇండియా, ఓవర్సీస్‌లలోనూ ఈ పోకిరి స్పెషల్‌ షోలు పడనున్నాయి. ఈ షోల టికెట్లు కూడా ఎప్పుడో పూర్తిగా అమ్ముడుపోయాయి. ఆ టికెట్లు అమ్మడం ద్వారా వచ్చిన మొత్తం డబ్బును మహేస్‌ బాబు ఫౌండేషన్‌ ద్వారా చిన్న పిల్లల హార్ట్‌ సర్జరీలకే ఇవ్వనున్నట్లు మహేష్‌ భార్య నమ్రత తన ఇన్‌స్టా పోస్ట్‌ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే.

పోకిరి స్పెషల్‌ షోలు ఆడియెన్స్‌ డిమాండ్‌, రియాక్షన్‌ను బట్టి మరిన్ని పెంచే ఆలోచనలో కూడా మేకర్స్‌ ఉన్నారు. మంగళవారమే ఈ మూవీ స్పెషల్‌ షోలు ఉండటంతో సోమవారం ఉదయం నుంచే సోషల్‌ మీడియాలో మహేష్‌ ఫ్యాన్స్‌ సందడి మామూలుగా లేదు. ఉదయం నుంచి పోకిరి స్పెషల్‌ షోస్‌ ట్రెండింగ్‌లో ఉంది. ప్రిన్స్‌ బర్త్‌డే రోజు అతని కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ చూడనుండటంపై ఫ్యాన్స్‌ ఎక్సైటింగ్‌గా ఉన్నారు.

2006లో రిలీజైన పోకిరి మూవీ అప్పటి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్‌ చేసింది. ఆ ఏడాది హయ్యెస్ట్‌ గ్రాసింగ్‌ తెలుగు మూవీగా నిలిచింది. మరోవైపు మహేష్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌తో మూవీకి సిద్ధమవుతున్నాడు. ఇందులో పూజా హెగ్డే ఫిమేల్‌ లీడ్‌లో కనిపించనుంది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్‌ కానుండగా.. దీని తర్వాత అతడు ఎస్ఎస్‌ రాజమౌళితో మరో మూవీ చేయనున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.