తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prashna Song: అవినీతిని ప్రశ్నిస్తున్న కొత్త దేశభక్తి పాట.. యూట్యూబ్‌లో ట్రెండింగ్.. ప్రశ్న సాంగ్ లిరిక్స్

Prashna Song: అవినీతిని ప్రశ్నిస్తున్న కొత్త దేశభక్తి పాట.. యూట్యూబ్‌లో ట్రెండింగ్.. ప్రశ్న సాంగ్ లిరిక్స్

Sanjiv Kumar HT Telugu

29 January 2024, 10:22 IST

  • Planet Red Music Prashna Song Lyrics: ఇప్పటివరకు దేశభక్తి గీతంతో ఎన్నో పాటలు వచ్చి ఆలోచింపజేశాయి. ఇదే పంథాలో అవినితీని ప్రశ్నించమంటూ సరికొత్త దేశభక్తి సాంగ్ ప్రశ్న యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ప్లానెట్ రెడ్ మ్యూజిక్ అందించిన ప్రశ్న సాంగ్ లిరిక్స్ చూస్తే..

అవినీతిని ప్రశ్నిస్తున్న కొత్త దేశభక్తి పాట.. యూట్యూబ్‌లో ట్రెండింగ్.. ప్రశ్న సాంగ్ లిరిక్స్
అవినీతిని ప్రశ్నిస్తున్న కొత్త దేశభక్తి పాట.. యూట్యూబ్‌లో ట్రెండింగ్.. ప్రశ్న సాంగ్ లిరిక్స్

అవినీతిని ప్రశ్నిస్తున్న కొత్త దేశభక్తి పాట.. యూట్యూబ్‌లో ట్రెండింగ్.. ప్రశ్న సాంగ్ లిరిక్స్

Patriotic Song Telugu 2024: సుమంత్ బొర్రా, వెంకటేష్ వుప్పల, తిరునగరి శరత్ చంద్ర, అనంత్ అశ్రిత్‌లు ఈ సారి దేశభక్తి గీతంతో ముందుకు వచ్చారు. సమాజంలో అడుగడుగున జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తూ, ప్రపంచం నలుమూలలా జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ 'ప్రశ్నించు.. ప్రశ్నించు' అంటున్నారు. పాటనే బాణాలుగా, ఈటెలుగా, బాటగా చేసుకుని సమాజంపైకి ఎక్కుపెట్టి సంధిస్తున్నారు. దోపిడీలు, కల్తీసరుకులు, అక్రమాలు, పరాయి దేశంపై వ్యామోహం.. ఇలా భారతదేశంలో జరుగుతున్న ప్రతి తప్పును తమ పాటలతో ప్రశ్నిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. 'దీపకి, నీ కొడుక్కి ఏంటి సంబంధం'నిలదీసిన జ్యోత్స్న.. కార్తీక్ పై దీప ఫైర్

Brahmamudi May 20th Episode: బ్రహ్మముడి- దుగ్గిరాల ఇంట్లో బిడ్డ తల్లిని నిలబెట్టిన కావ్య- రుద్రాణికి పెళ్లి సంబంధాలు!

NNS May 20th Episode: బయటపడిన మనోహరి బాగోతం.. అందరిలో మొదలైన అనుమానం.. భాగీని వదిలి బయల్దేరిన అమర్​​​​!

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

ప్రజలకు న్యాయం చేయనప్పుడు ప్రభుత్వాలనే ప్రశ్నించాలంటున్నారు. ఇప్పటిదాకా మెలోడీ పాటలతో, విషాదగీతాలతో, భక్తిపాటలతో, ప్రేమపాటలతో, పబ్ సాంగ్స్‌తో సాంగ్ లవర్స్‌ను అలరించిన ప్లానెట్ రెడ్ మ్యూజిక్ టీమ్ ఈసారి దేశభక్తిని చాటేలా ప్రశ్న పాటతో ముందుకు వచ్చింది. ఈ సాంగ్ ప్రతి తప్పుని ప్రశ్నించేలా చేస్తుందని, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునేలా మెసేజ్ ఇస్తుందని మేకర్స్ అంటున్నారు. ఈ పాటకు మ్యూజిక్, మిక్సింగ్ అండ్ మాస్టరింగ్, ర్యాప్‌ని వెంకటేష్ వుప్పల అందించగా, సుమంత్ బొర్రా, అనంత్ అశ్రిత్‌లు ఆలపించారు.

తిరునగరి శరత్ చంద్ర ఈ ప్రశ్న పాటను రాశారు. సుమంత్ బొర్రా ప్రొడ్యూసర్‌గా, బిపిన్ చంద్రహాస్ విజువల్ ఆర్ట్స్‌ అందించారు. అవసరం అయితే ప్రభుత్వాలనే ప్రశ్నించు అని స్ఫూర్తినిస్తున్న ఈ ప్రశ్న పాట జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా యూట్యూబ్‌లోని ప్లానెట్ రెడ్ మ్యూజిక్ ఛానల్‌లో విడుదలైంది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఆడియో పోర్టల్స్‌లో రిలీజైన ఈ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. మరి ఎంతోమందిని ఆలోచింపజేస్తున్న ప్రశ్న పాట లిరిక్స్‌ మీకోసం.

ప్రశ్న సాంగ్ లిరిక్స్

ప్రశ్నించు..ప్రశ్నించు..ప్రశ్నించు..ప్రశ్నించు

ప్రశ్నించు..ప్రశ్నించు..ప్రశ్నించు..

ఎదురుగ ఉన్నది తప్పైతే సూటిగా వెళ్లి ప్రశ్నించు

నీలో ఉన్నది తప్పైతే నిన్నే నువ్వు ప్రశ్నించు

గద్దెలెక్కిన పెద్దలైనా తప్పులు చేస్తే ప్రశ్నించు

నీతో ఉన్న నీ వాళ్లైనా ముప్పే చేస్తే ప్రశ్నించు..

గద్దెలెక్కిన పెద్దలైనా తప్పులు చేస్తే ప్రశ్నించు..

నీతో ఉన్న నీ వాళ్లైనా ముప్పే చేస్తే ప్రశ్నించు..

కూడు తినేదేమో నువు ఇంట్ల

నువు సంపాదించి పెడుతున్నదంత బయట

ఇంటికేమొ రేషన్ కార్డు అప్లై చేయడంట

వీనికి ఆ గ్రీన్ కార్డే ఇంపార్టెంట్ అంట.

సరే సరే ఆడికి పోయి ఏం చేస్తావ్ ?

క్యాబులు తోల్తావా?

బంక్‌లో పెట్రోల్ పోస్తవా?

విండోలు సాఫు చేస్తవా?

లేదా మొమొలు అమ్ముతవా?

మియా పైసా చోడో, మాన్ కైసా హై?

First Freedom should within us

Be fearsome, have wisdom, build kingdom

Sing anthem, like rudram

questions your choices be indian

First freedom should within us

Have forum, Change system, see spectrum

Feel grandsome, Chage overcome

feel indian be indian

1వ చరణం:

నేనే అంతా నాదే అంతా

అనుకున్నోణ్ణి ప్రశ్నించు

తప్పును చూసి తప్పే అనక

తప్పుకు తిరిగితే ప్రశ్నించు..

మోసం చేసే ప్రేమలనైనా

ద్రోహం చేసే స్నేహాన్నైనా

ప్రశ్నించు..ప్రశ్నించు..ప్రశ్నించు..

ప్రజలకు న్యాయం చేయనప్పుడు

ప్రభుత్వాలనే ప్రశ్నించు..

ప్రభుత్వాలనే ప్రశ్నించు..

ప్రశ్నించు..ప్రశ్నించు..ప్రశ్నించు..

ప్రశ్నించు..ప్రశ్నించు..ప్రశ్నించు..

2వ చరణం:

మన దేశంలో ఏదీ లేదని

పరాయిదేశంలేముంది?

ఎగబడిపోయే వాళ్ళను కూడా

ఎగబడి ఎగబడి ప్రశ్నించు..

మనదేశాన్ని తక్కువ చేస్తే

మన ప్రాంతాన్ని లోకువ చేస్తే

నిలువున నిలేసి ప్రశ్నించు

నక్కల లాగా కుక్కల లాగా

తిరిగే దొంగల ప్రశ్నించు

కల్తీసరుకులు పంచే వాళ్ళను

పేదలబతుకులు ముంచే వాళ్ళను

కడిగి కడిగి ప్రశ్నించు..

ప్రశ్నించు..ప్రశ్నించు..

ప్రశ్నించు..ప్రశ్నించు..ప్రశ్నించు..

ప్రశ్నించు..ప్రశ్నించు..ప్రశ్నించు..

First freedom should within us

ప్రశ్నించు..ప్రశ్నించు..

First freedom should within us

ప్రశ్నించు..ప్రశ్నించు..

First freedom should within us

ప్రశ్నించు..ప్రశ్నించు..

First freedom should within us

ప్రశ్నించు..ప్రశ్నించు..

భారతదేశం మన ఇల్లంటూ

భారతమాత మన కళ్ళంటూ

దేశసేవకై నీ బతుకంతా

త్యాగం చేస్తూ సాగించు..

త్యాగం చేస్తూ సాగించు..

త్యాగం చేస్తూ సాగించు..

ఇలా ఆకట్టుకునేలా, ఆలోచింపజేసేలా ప్రశ్న సాంగ్ లిరిక్స్ ఉన్నాయి. మధ్యలో ఇంగ్లీష్, హిందీ భాష పదాలతో అర్థవంతంగా లిరిక్స్ సమకూర్చారు రచయిత. అక్కడక్కడ వచ్చే ర్యాప్ కూడా ఆకట్టుకునేలా ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం