తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Martial Artist Look: మార్షల్ ఆర్ట్స్ సాధన చేస్తున్న పవన్ కల్యాణ్.. ఫొటో సోషల్ మీడియాలో వైరల్

Pawan Martial Artist Look: మార్షల్ ఆర్ట్స్ సాధన చేస్తున్న పవన్ కల్యాణ్.. ఫొటో సోషల్ మీడియాలో వైరల్

09 December 2022, 22:51 IST

    • Pawan Martial Artist Look: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటోను షేర్ చేశారు. మార్షల్ ఆర్ట్స్‌ను ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఫొటోను షేర్ చేశారు. ఈ వింటేజ్ లుక్‌లో ఆయన అదరగొట్టారు.
పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లుక్
పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లుక్

పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లుక్

Pawan Martial Artist Look: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ శైలే వేరు. రెగ్యూలర్ తెలుగు హీరోల మాదిరిగా కాకుండా.. తనకంటూ ఓ వ్యక్తిత్వం, మేనరిజంతో అభిమానులను విపరీతంగా సంపాదించుకున్నారు. అంతేకాకుండా మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యమున్న తెలుగు హీరో ఎవరంటే అందరూ ఆయన పేరే టక్కున చెబుతారు. తన ప్రతిభతో వ్యక్తిగతంగానే కాకుండా.. కొన్ని సినిమాల్లోనూ మార్షల్ ఆర్ట్స్‌ను ఉపయోగించి అదరగొట్టారు. ప్రస్తుతం హరి హర వీర మల్లు అనే సినిమా చేస్తున్న పవర్ స్టార్.. అందుకు సంబంధించిన కసరత్తులు కూడా ప్రారంభించారు.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: నా బుజ్జిని చూస్తారా: కల్కి 2898 ఏడీపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్

Prasanna Vadanam OTT Release date: ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇలా చేస్తే 24 గంటలు ముందుగానే చూడొచ్చు..

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

తాజాగా చాలా రోజుల తర్వాత మార్షల్ ఆర్ట్స్‌ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అంతేకాకుండా ఇందుకు సంబంధిచిన ఫొటోను కూడా షేర్ చేస్తూ.. రెండు దశాబ్దాల తర్వాత మార్షల్ ఆర్ట్స్‌ను ప్రారభిస్తున్నానని పేర్కొన్నారు. తన అధికారిక ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు.

పవర్ స్టార్ షేర్ చేసిన ఫొటో కొన్ని క్షణాల్లోనే వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఈ ఫొటోపై విశేషంగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. అప్పటికీ, ఇప్పటికీ ఏం మారలేదంటూ తమ కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ గురించి చెప్పిన మాటలు, ప్రాక్టీసును పవర్ స్టార్ గుర్తు చేసుకున్నారు. పవన్ కల్యాణ్ చివరగా జాని చిత్రం కోసం తనలోని ప్రతిభను బయటపెట్టారు.

మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ ఎం రత్నం సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఇది విడుదల కానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం