తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan: మేనల్లుడితో పవన్ సినిమా ఎప్పుడు మొదలుకానుందంటే...

pawan kalyan: మేనల్లుడితో పవన్ సినిమా ఎప్పుడు మొదలుకానుందంటే...

HT Telugu Desk HT Telugu

01 July 2022, 14:39 IST

  •  ప‌వ‌న్ క‌ళ్యాణ్(pawan kalyan), సాయిధ‌ర‌మ్‌తేజ్ (saidharam tej)హీరోలుగా స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో ఫాంట‌సీ డ్రామా సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకిరానున్న‌దంటే...

ప‌వ‌న్ క‌ళ్యాణ్
ప‌వ‌న్ క‌ళ్యాణ్ (twitter)

ప‌వ‌న్ క‌ళ్యాణ్

భీమ్లానాయ‌క్ త‌ర్వాత కొత్త సినిమాల్ని అంగీక‌రించే విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఏపీ ఎల‌క్ష‌న్స్ దృష్టిలో పెట్టుకొని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొన్నాళ్లు సినిమాల‌కు దూరంగా ఉండ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. కానీ ఈ రూమ‌ర్స్‌కు చెక్ పెడుతూ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో క‌లిసి ఓ సినిమా చేయ‌డానికి అంగీక‌రించారు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. త‌మిళంలో ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల్ని అందుకున్న వినోధయ సీతమ్ చిత్రానికి రీమేక్‌గా ఈ మామాఅల్లుళ్ల సినిమా తెర‌కెక్కుతోంది. త‌మిళ మాతృక‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స‌ముద్ర‌ఖ‌ని తెలుగు వెర్ష‌న్ ను తెర‌కెక్కించే బాధ్య‌త‌ల్ని తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన ఓ యువ‌కుడు దేవుడు అనుగ్ర‌హంతో తిరిగి జీవితాన్ని పొంది త‌న బాధ్య‌త‌ల్ని ఎలా నెర‌వేర్చాడ‌నే పాయింట్‌తో ఫాంటసీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో దేవుడి పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపించ‌బోతున్నారు. భ‌క్తుడిగా సాయిధ‌ర‌మ్‌తేజ్ న‌టిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఇందులో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో పాటు సాయిధ‌ర‌మ్‌తేజ్ పాల్గొన్నారు. ఈ నెల 12న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. తొలి షెడ్యూల్‌లో సాయిధ‌ర‌మ్‌తేజ్ పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేందుకు ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలిసింది.

ఈ నెలాఖ‌రు నుండి ప‌వ‌న్ క‌ళ్యాణ్ షూటింగ్‌లో భాగం కాబోతున్న‌ట్లు స‌మాచారం. ఆగ‌స్ట్ నెలలో అత‌డి షూటింగ్ పార్ట్ పూర్త‌వుతుంద‌ని అంటున్నారు. ఈ సినిమా కోసం ప‌వ‌న్ కేవ‌లం ఇర‌వై రోజులు మాత్ర‌మే డేట్స్ కేటాయించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందుకోసం యాభైకోట్ల వ‌ర‌కు పారితోషికాన్ని డిమాండ్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం