Pareshan OTT Release Date: ‘పరేషాన్’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఏ ఓటీటీలోకి రానుందంటే..
20 July 2023, 15:52 IST
- Pareshan OTT Release Date: తిరువీర్ హీరోగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘పరేషాన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‍ఫామ్ ఫిక్స్ అయ్యాయి. ఆ వివరాలు ఇవే.
Pareshan OTT Release Date: అఫీషియల్: ‘పరేషాన్’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Pareshan OTT Release Date: కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన పరేషాన్ సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకుంది. తెలంగాణ బ్యాక్‍డ్రాప్‍లో తిరువీర్ హీరోగా ఈ సినిమా వచ్చింది. స్టార్ హీరో రానా సమర్పణలో రావటంతో పరేషాన్ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. జూన్ 2వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మోస్తరుగా ఆడింది. కాగా, ఇప్పడు ఈ పరేషాన్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్, ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్ అయ్యాయి. వివరాలివే..
పరేషాన్ సినిమా ఆగస్టు 4వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని సోనీ లివ్ నేడు అధికారికంగా ప్రకటించింది. “మీ మంచి స్నేహితులే మీకు పీడకలలుగా మారితే?. రానా దగ్గుబాటి సమర్పించిన కామెడీ మూవీ ఆఫ్ ది ఇయర్.. పరేషాన్ స్ట్రీమింగ్ సోనీ లివ్‍లో ఆగస్టు 4 నుంచి” అని సోనీ లివ్ ట్వీట్ చేసింది. మొత్తంగా థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఆగస్టు 4న సోనీ లివ్ ఓటీటీలోకి రానుంది పరేషాన్ మూవీ.
పరేషాన్ సినిమాకు రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహించాడు. తిరువీర్‌కు జోడీగా పావని కరణం ఈ మూవీలో హీరోయిన్‍గా నటించింది. బన్నీ అబిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, శృతి రియాన్, మురళీధర్ గౌడ్, బుడ్డరఖాన్ రవి, రాజు బెడిగెల కీలకపాత్రల్లో కనిపించారు. సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన పరేషాన్ మూవీని దగ్గుబాటి రానా సమర్పించాడు. ఈ సినిమాకు యశ్వంత్ నాగ్ సంగీతం అందించాడు.
తెలంగాణ బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కిన పరేషన్ మూవీలో ఐజాక్‍గా తిరువీర్ పర్ఫార్మెన్స్ అందరినీ మెప్పించింది. అతడు డైలాగ్స్ చెప్పిన విధానం, నటన ఆకట్టుకున్నాయి. సింగరేణి ప్రాంతమైన మంచిర్యాలలో పరేషాన్ మూవీ కథ సాగుతుంది. ఆద్యంతం ఈ సినిమా సరదాగా.. కాస్త హడావుడిగా ఉంటుంది. స్నేహితుల మధ్య సరదాలు, ఐజాక్ ప్రేమ వ్యవహారం చుట్టూ కథ నడుస్తుంది.