తెలుగు న్యూస్  /  Entertainment  /  Ott Bigg Boss 8th Day Highlights

OTT BIGGBOSS | జ్యోతిష్యుడి అవతారం ఎత్తిన శివ... డేటింగ్ కోసం లవర్ కావాలన్న బిందు మాధవి

Nelki Naresh HT Telugu

07 March 2022, 23:29 IST

  • బిగ్ బాస్ ఎనిమిదో రోజు శివ జ్యోతిష్యుడి అవతారం ఎత్తారు. ఈ యాక్టివిటీలో తనకు డేటింగ్ చేయడానికి లవర్ దొరుకుతాడా అని అతడిని బిందు మాధవి అడగటం నవ్వులను పూయించింది.  

శివ
శివ (twitter)

శివ

బిగ్‌బాస్ ఎనిమిదో రోజు త‌గ్గేదేలే అంటూ జోష్ తో మొద‌లైంది. ‘పుష్ప’ సినిమాలోని ‘త‌గ్గేదేలే’ పాట‌తో బిగ్‌బాస్ ఇంటి స‌భ్యుల‌ను నిద్ర‌లేపారు. మార్నింగ్ యాక్టివిటీలో భాగంగా ఇంటి స‌భ్యుల అంద‌రి చేతి రేఖ‌లు చూసి వారి జ్యోతిష్యం చెప్పాల‌ని శివ‌ను బిగ్‌బాస్ ఆదేశించాడు. కంటెస్టెంట్స్ భ‌విష్య‌త్తు, వారి ప్ర‌యాణాన్ని గురించి వివరించాలని బిగ్ బాస్ అన్నారు. ఈ యాక్టివిటీ కోసం శివ చిలుక జ్యోతిష్యుడిగా అవ‌తారం ఎత్తారు. హౌస్ లో మీకు ఉన్న గొడ‌వ‌ల‌న్నీ స‌మ‌సిపోయి మంచి రోజులు రానున్నాయ‌ని న‌ట‌రాజ్ మాస్ట‌ర్ చేతి చూసి శివ జ్యోతిష్యం చెప్పాడు. ఆషూరెడ్డి చేతి చూసి ఒక‌రితో విడిపోయి మ‌రొక‌రితో సాన్నిహిత్యం పెంచుకుంటున్నావని ఆమెతో అన్నాడు. నామినేషన్స్ లో త‌న‌కు ఎంత మంది వెన్నుపోట్లు పొడ‌వ‌బోతున్నార‌ని చెప్పాలని అరియానా జ్యోతిష్యుడైన శివ‌ను అడ‌గ్గా...రెండు వెన్నుపోట్లు ఉండే అవకాశం ఉందని అతడు బదులిచ్చాడు. బిగ్‌బాస్‌లో త‌న‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌ని అఖిల్ చెప్పిన మాట‌కు... త‌న‌తోనే స‌మ‌స్య అంటున్నావా అని శివ అన‌డంతో జ్యోతిష్యం యాక్టివిటీ సీరియస్ గా మారిపోయింది. ఆ సీరియస్ నెస్ ను బిందుమాధవి కూల్ చేసింది.  చాలా రోజుల నుంచి సింగిల్ గా ఉన్నాను..డేటింగ్‌కు ఎవ‌రైనా దొర‌కుతారా అని శివ‌ను బిందు మాధ‌వి అడ‌గ్గా..ఈమ‌ధ్య  కాలంలో మీ వెంట ఒక‌రు పడుతున్నాడని శివ ఆమె చేతి చూసి చెప్పాడు.  తాను ఆమెను ఫాలో అవుతున్న విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా బిందు మాధవికి అతడు చెప్పడానికి ప్రయత్నించాడు. ఎనిమిదో రోజు ఉదయం నుంచి ఆషూరెడ్డి, శివ గొడవలు పడుతూ కనిపించారు. 

ట్రెండింగ్ వార్తలు

Pokiri Trending: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘పోకిరి’ సినిమా.. ఎందుకో తెలుసా?

Samantha Next Movie: పుట్టిన రోజున గుడ్‍న్యూస్ చెప్పిన సమంత.. రీఎంట్రీ సినిమా ఫిక్స్.. ఇంట్రెస్టింగ్‍గా టైటిల్, పోస్టర్

Agent OTT: ఏజెంట్ సినిమాకు సంవత్సరం: ఓటీటీలోకి ఇంకెప్పుడు?

Ramam Raghavam: దర్శకుడిగా జబర్తస్త్ కమెడియన్ ధన్‌రాజ్ ద్విభాషా చిత్రం.. తమిళ హీరో కామెంట్స్

 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.