Kumari Srimathi Review: ఓ మంచి బార్ లాంటి సిరీస్ కుమారి శ్రీమతి రివ్యూ.. డాక్టర్ బాబు ఆకట్టుకున్నాడా?
07 October 2023, 10:08 IST
Kumari Srimathi Web Series Review: నిత్యా మీనన్, కార్తీక దీపం డాక్టర్ బాబు నిరుపమ్ పరిటాల, తిరువీర్ ప్రధాన పాత్రల్లో వచ్చన తాజా ఓటీటీ వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నా కుమారి శ్రీమతి వెబ్ సరీస్ రివ్యూపై లుక్కేస్తే..
నిత్యా మీనన్, నిరుపమ్ పరిటాల కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: కుమారి శ్రీమతి
నటీనటులు: నిత్యా మీనన్, తిరువీర్, నిరుపమ్ పరిటాల, గౌతమి, తాళ్లురి రామేశ్వరి, మురళి మోహన్, వీకే నరేష్, ప్రేమ్ సాగర్, ప్రణీత పట్నాయక్, వాసు ఇంటూరి తదితరులు
సినిమాటోగ్రఫీ: మోహన కృష్ణ
ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి
కథ: బలభద్రపాత్రుని రమణి, మల్లిక్ రామ్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, షో క్రియేటర్: శ్రీనివాస్ అవసరాల
దర్శకత్వం: గోమఠేష్ ఉపాధ్యాయ
సంగీతం: స్టెక్కటో అండ్ కమ్రాన్
నిర్మాణం: స్వప్న సినిమా
సమర్పణ: ఎర్లీ మాన్సూన్ టేల్స్
విడుదల తేది: సెప్టెంబర్ 28, 2023
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
Kumari Srimathi Web Series Review Telugu: నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నిత్యా మీనన్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి. ఇందులో మసూద హీరో తిరువర్‌తోపాటు కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు నిరుపమ్ పరిటాల ప్రధాన పాత్ర పోషించారు. డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల షో క్రియేటర్‍గా డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. సుమారు 30 నుంచి 40 నిమిషాల నిడివితో 7 ఎపిసోడ్స్ ఉన్న కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
రాజమహేంద్రవరంలోని రామరాజు లంక అనే గ్రామంలో ఇటుకలపూడి శ్రీమతి (నిత్యా మీనన్) హోటల్‍లో ఫ్లోరింగ్ మేనేజర్‌గా పని చేస్తుంది. ఎలాంటి కష్టమొచ్చిన ఇల్లు అమ్మమని తాతయ్య (మురళి మోహన్)కు చిన్నతనంలో మాట ఇస్తుంది శ్రీమతి. కానీ బాబాయ్ కేశవరావు (ప్రేమ్ సాగర్)తో ఆస్తి గొడవ విబేధాలు వస్తాయి. ఇల్లు, రైస్ మిల్లు లేగేసుకుంటాడు కేశవరావు. దీంతో శ్రీమతి, తన తల్లి దేవకి (గౌతమి), చెల్లి కల్యాణి (ప్రణీత పట్నాయక్), నానమ్మ శేషమ్మ (తాళ్లూరి రామేశ్వరి) వేరే ఇంట్లో అద్దెకు ఉంటూ నివసిస్తారు.
ట్విస్టులు
తాతాల కాలం నాటి ఇల్లును పడగొట్టాలని బాబాయ్ ప్రయత్నిస్తుంటే కోర్టులో కేసు వేస్తుంది శ్రీమతి. అందులో కేశవరావుకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన కోర్ట్ రూ. 38 లక్షలు ఇచ్చి శ్రీమతే ఇల్లు కొనుక్కోవచ్చని చెబుతుంది. అందుకు 6 నెలలు గడువు పెడుతుంది. దీంతో బార్ పెట్టి డబ్బు సంపాదించుకోవాలనుకుంటుంది శ్రీమతి. మరి శ్రీమతి బార్ పెట్టిందా? ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది? ఆమెకు ఎవరెవరు సపోర్ట్ గా నిలిచారు? శ్రీమతి తండ్రి (నరేష్) ఎక్కడికి పారిపోయాడు?, శ్రీరామ్ (నిరుపమ్), అభినవ్ (తిరువీర్) పాత్రలు ఏంటీ? ఇంటిని శ్రీమతి సంపాదించుకుందా? అనేది తెలియాలంటే కుమారి శ్రీమతి చూడాల్సిందే.
విశ్లేషణ:
తాతయ్యకు ఇచ్చిన మాటను ఆశయంగా తీసుకున్న శ్రీమతి చివరికి తన ఇంటిని సొంతం చేసుకుందా అనేదే కుమారి శ్రీమతి కథ. అందుకోసం బార్ పెట్టి డబ్బు సంపాదించే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ, దాన్ని ఎవరినీ నొప్పించకుండా అందంగా తెరకెక్కించారు. కేవలం రూ. 13 వేలకు పని చేసే శ్రీమతి రూ. 38 లక్షలు సంపాదించుకోవడానికి బార్ పెట్టాలనుకోవడం, అందులోనూ 30 ఏళ్లు వచ్చిన పెళ్లి చేసుకోని మధ్యతరగతి మహిళను చూసే విధానం వంటి అంశాలతో కామెడీ అండ్ ఎమోషనల్ తీర్చిదిద్దారు.
ట్రయాంగిల్ లవ్ స్టోరి
ఇంటి ఓనర్ శ్రీరామ్ సహాయంతో బార్ పెట్టాలనుకున్న శ్రీమతి చేసే ప్రయత్నాలు, గ్రామంలో సొంత వారి నుంచే ఎదురైన పరిస్థితులు, కుటుంబం అనుబంధం, పెళ్లి కోసం తల్లి చేసే ఫోర్స్ వంటివి బాగానే చూపించారు. బార్ పెట్టి డబ్బు సంపాదించడమే కాకుండా దాని వల్ల మహిళలకు వచ్చే ఇబ్బందులు, లైసెన్స్ ప్రాసెస్, ఈ క్రమంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ, పెళ్లి ప్రపోజల్స్, చైల్డ్ హుడ్ క్రష్, హౌటల్ మేనేజ్‍మెంట్ కోర్స్ వంటి పాయింట్స్ ఆకట్టుకుంటాయి. నాలుగో ఎపిసోడ్ ఎండింగ్ ట్విస్ట్ బాగుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అస్సలు ఊహించలేం.
అక్కడక్కడ బోరింగ్
డబ్బు అవసరం ఉన్నా ఇతరులకు నష్టం కలగకుండా శ్రీమతి వ్యాపారం చేసే తీరు, అందుకు పెట్టే రూల్స్ నిజంగా ఆకట్టుకుంటాయి. బార్ కోసం చేసే ప్రయత్నాల్లో ఒక్కో సమస్య రావడం, దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్లడం ఎన్ని అడ్డంకులు ఎదురైనా గివప్ చేయకుండా సాగాలనే స్ఫూర్తినిస్తుంది. అక్కడక్కడ బోరింగ్ అనిపిస్తుంది. అయితే ఈ సీన్లన్నీ కథలో వచ్చే పాత్రలను పరిచయానికి ఉపయోగపడింది.
డ్రింకర్స్ సేఫ్టీ
అవసరాల శ్రీనివాస్ పాత్ర ట్విస్ట్ ఇస్తుంది. అలాగే హీరో నాని గెస్ట్ రోల్ చేయడం ప్లజెంట్‌గా అనిపిస్తుంది. అనుకున్నది జరుగుతుంది, స్టోరీ ఇక పూర్తవుతుంది అని అనుకునేలోపే కొత్త సమస్య రావడం, మరి హీరోయిస్టిక్ సీన్స్ లేకుండా.. రియలిస్టిక్‌గా, ఇలా జరిగే అవకాశం ఉందన్నట్లుగా చాలా చక్కగా చూపించారు. బార్ మూసేయాలని మహిళలు ధ్వంసం చేస్తే వాళ్లతో మాట్లాడి లిమిట్ డ్రింక్ అని కాన్సెప్ట్ పెట్టడం, డ్రాపింగ్ చేయడం, లాభం కన్నా మనుషుల సెఫ్టీ, బాధ్యత ముఖ్యంగా బార్ నడపడం కొత్తగా అనిపిస్తుంది.
అతని నటన హైలెట్
సంగీతం బాగుంది. విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి. రామరాజు లంక అందాలు బాగా చూపించారు. ఇక నిత్యా మీనన్ నటనతో అదరగొట్టింది. డాక్టర్ బాబు నిరుపమ్ సైతం నటనతో మెప్పించాడు. ప్రేమ్ సాగర్ నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. తిరువీర్, గౌతమి, రామేశ్వరి మిగతా పాత్రలు అంతా బాగా చేశారు. ఓవరాల్‌గా చెప్పాలంటే సిరీస్ పూర్తయ్యేలోపు ఓ మంచి బార్, ఓ మంచి మందు లాంటి సిరీస్‌లా అనిపిస్తుంది కుమారి శ్రీమతి.
రేటింగ్: 3/5