తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nithiin Vakkantham Vamsi Movie: మాస్ రోల్‌లో నితిన్ - మారేడుమిల్లిలో 32వ సినిమా షూటింగ్ షురూ

Nithiin Vakkantham Vamsi Movie: మాస్ రోల్‌లో నితిన్ - మారేడుమిల్లిలో 32వ సినిమా షూటింగ్ షురూ

28 November 2022, 6:25 IST

  • Nithiin Vakkantham Vamsi Movie: నితిన్ 32వ సినిమా షూటింగ్ ఆదివారం మారేడుమిల్లిలో మొద‌లైంది. ఈ సినిమాలో నితిన్ గ‌డ్డంతో మాస్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నాడు.

నితిన్
నితిన్

నితిన్

Nithiin Vakkantham Vamsi Movie: కెరీర్‌లో ఎక్కువ‌గా ల‌వ‌ర్‌బాయ్ పాత్ర‌ల్లోనే క‌నిపించారు నితిన్‌. చాలా రోజుల త‌ర్వాత త‌న 32వ సినిమాలో ఔట్ అండ్ ఔస్ మాస్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమాకు వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఆదివారం నుంచి మారేడుమిల్లిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

ట్రెండింగ్ వార్తలు

Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

నితిన్ మాస్ లుక్ ఫొటోను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. నితిన్ ముఖాన్ని కాకుండా బ్యాక్ లుక్ మాత్ర‌మే ఇందులో చూపించారు. ఈ సినిమాలో పొడ‌వైన గ‌డ్డం, మీసాల‌తో ర‌ఫ్ లుక్‌లో నితిన్ క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. మారేడుమిల్లిలో జ‌రిగే ఈ ఫ‌స్ట్‌ షెడ్యూల్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రేష్ట్ మూవీస్‌, ఆదిత్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ ప‌తాకాల‌పై నితిన్ ఫాద‌ర్ సుధాక‌ర్‌రెడ్డి, సోద‌రి నిఖితారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తోన్నారు.

ఏప్రిల్‌లో నితిన్ 32వ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. దాదాపు ఎనిమిది నెల‌ల విరామం త‌ర్వాత షూటింగ్ మొద‌లుపెట్ట‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఒకానొక‌ద‌శ‌లో ఈ సినిమా ఆగిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. షూటింగ్ మొద‌లుపెట్టి పుకార్ల‌కు పుల్‌స్టాప్ పెట్టారు చిత్ర‌యూనిట్‌.

ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమాతో నితిన్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ప‌రాజ‌యం పాలైంది. ఈ సినిమా రిజ‌ల్ట్ త‌ర్వాత క‌థ‌ల విష‌యంలో నితిన్ జాగ్ర‌త్త వ‌హించిన‌ట్లు తెలిసింది. వ‌క్కంతం వంశీ స్టోరీపై రీ వ‌ర్క్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేశాడు వ‌క్కంతం వంశీ. అత‌డు డైరెక్ష‌న్ చేస్తోన్న రెండో సినిమా ఇది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.