తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nithiin: మాచర్ల నియోజకవర్గం ప్రీ రిలీజ్ బిజినెస్ - బ్రేక్ ఈవెన్ కావాలంటే రావాల్సిన వసూళ్లు ఎంతంటే

Nithiin: మాచర్ల నియోజకవర్గం ప్రీ రిలీజ్ బిజినెస్ - బ్రేక్ ఈవెన్ కావాలంటే రావాల్సిన వసూళ్లు ఎంతంటే

HT Telugu Desk HT Telugu

11 August 2022, 17:35 IST

  • మాచర్ల నియోజకవర్గం ( Macherla Niyojakavargam)సినిమాతో ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నితిన్(Nithiin). మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధించాలంటే...

నితిన్
నితిన్ (twitter)

నితిన్

నితిన్ హీరోగా ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మాచర్ల నియోజకవర్గం ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. తనకున్న లవర్ బాయ్ ఇమేజ్ నుండి దూరమయ్యే ప్రయత్నాల్లో భాగంగా మాస్ కథను ఎంచుకుంటూ నితిన్ చేసిన సినిమా ఇది. మాచర్ల నియోజకవర్గంపై ఉన్న భారీ అంచనాల కారణంగా దాదాపు ఇరవైఒకటిన్నర కోట్లకుపైగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. నైజాంలో దాదాపు అరు కోట్లకుపైగా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Sreemukhi: అజిత్ కంటే ముందు గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్ శ్రీముఖిదే - రిలీజ్‌కు నోచుకోని తెలుగు యాంక‌ర్ బోల్డ్ మూవీ

Guppedantha Manasu Serial: శైలేంద్ర‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన మ‌ను - బిల్డ‌ప్‌లు తుస్ - ఎండీ సీట్‌ను కాపాడుకున్న వ‌సు

Jr NTR Hrithik Roshan: బాలీవుడ్ స్టార్ హీరోకి జూనియర్ ఎన్టీఆర్ వంట నేర్పిస్తున్నాడా.. తారక్‌కు బర్త్ డే విషెస్ వైరల్

Krishna mukunda murari serial: ఊహించని మలుపు, బ్లాక్ మెయిల్ కి దిగిన ముకుంద.. గుట్టు రట్టు చేయబోతున్న కృష్ణ

సీడెడ్ మూడు కోట్లు, ఆంధ్రాలో అన్ని ఏరియాలు కలిపి పదికోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలిసింది. టోటల్ గా ఏపీ, తెలంగాణలో కలిసి 19 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఓవర్ సీస్ లో కోటిన్నర, కర్ణాటక తో పాటు ఇతర రాష్ట్రాల్లో కోటివరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. మొత్తంగా ఇరవై ఒకటిన్నర కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ ను పూర్తయినట్లు చెబుతున్నారు.ఎగ్జిబిటర్లు బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు ఇరవై రెండు కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రస్తుతం సీతారామం, బింబిసార బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా కలెక్షన్స్ సాధిస్తున్నాయి. వాటికి పోటీగా ఈ సినిమా ఏ మేరకు నిలబడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఆ రెండు సినిమాలకు మించి బలమైన కంటెంట్ ఉంటేనే మాచర్ల నియోజకవర్గం బ్రేక్ ఈవెన్ అవుతుందని చెబుతున్నారు. భీష్మ తర్వాత నితిన్ కెరీర్ లో హిట్ లేదు.

భీష్మ దాదాపు ఇరవై ఐదు కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఆ సినిమా ఫలితాన్ని మాచర్ల నియోజకవర్గం పునరావృతం చేస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. కేథరిన్ కీలక పాత్ర పోషిస్తోంది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితారెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం