తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Legend Twitter Review: శరవణన్‌ను దారుణంగా ట్రోల్‌ చేస్తున్న నెటిజన్స్‌

The Legend Twitter Review: శరవణన్‌ను దారుణంగా ట్రోల్‌ చేస్తున్న నెటిజన్స్‌

HT Telugu Desk HT Telugu

29 July 2022, 14:22 IST

    • The Legend Twitter Review: ది లెజెండ్‌ పేరుతో సినిమా తీసిన శరవణన్‌ ఆరుల్‌ను ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఈ మూవీలో అతని యాక్టింగ్‌ను దారుణంగా ట్రోల్‌ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
ది లెజెండ్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఊర్వశి రౌతేలా, రాయ్ లక్ష్మిలతో శరవణన్ ఆరుల్
ది లెజెండ్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఊర్వశి రౌతేలా, రాయ్ లక్ష్మిలతో శరవణన్ ఆరుల్ (Nitin Lawate)

ది లెజెండ్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఊర్వశి రౌతేలా, రాయ్ లక్ష్మిలతో శరవణన్ ఆరుల్

తమిళనాడులో శరవణ స్టోర్స్‌తో పాపులరైన శరవణన్‌ ఆరుల్‌ ది లెజెండ్‌ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతని వయసు 51 ఏళ్లు. ఈ ది లెజెండ్‌ మూవీపై చాలా రోజులుగా ఎంతో బజ్‌ నడుస్తోంది. ఈ సినిమాను ఏకంగా ఐదు భాషల్లో, 2500 స్క్రీన్లలో రిలీజ్‌ చేశారు. కానీ తీరా చూస్తే మూవీ మాత్రం దారుణంగా ఉంది. ఇందులో శరవణన్‌ నటన చూసి ఫ్యాన్స్‌ తెగ నవ్వుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Silk Saree Movie: సీరియల్ నటుడు హీరోగా మూవీ.. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీగా సిల్క్ శారీ

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

ఇదేం యాక్టింగ్‌.. ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్‌ లేవు.. ఓవర్‌ బిల్డప్‌ అంటూ ట్విటర్‌లో ట్రోల్‌ చేస్తున్నారు. గురువారం (జులై 28) మూవీ రిలీజ్‌ అయినప్పటి నుంచీ నెటిజన్లు అతనితో ఆడుకుంటున్నారు. జేడీ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీకి హారిస్‌ జయరాజ్‌ మ్యూజిక్‌ కంపోజ్‌ చేయడం విశేషం. పైగా ఇందులో శరవణన్‌ సరసన రాయ్‌ లక్ష్మి, ఊర్వశి రౌతేలాలాంటి హీరోయిన్స్ నటించారు.

మూవీలోని సెంటిమెంట్‌ సీన్లలోనూ మీరు కడుపుబ్బా నవ్వుతారు.. మీకు ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌ ఉంటే కచ్చితంగా వెళ్లి ఎంజాయ్ చేయండి అంటూ ఓ యూజర్‌ ట్వీట్‌ చేయడం విశేషం. ముఖ్యంగా శరవణన్ నటనపైనే చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ అంటే ఇలా ఉండాలి అంటూ మరో యూజర్‌ సెటైరికల్‌గా ట్వీట్‌ చేశాడు.

లీడ్‌ యాక్టర్‌ శరవణన్‌ డ్యాన్స్‌ చూసిన తర్వాత నా కిడ్నీకి హార్ట్‌ అటాక్‌ వచ్చిందంటూ ఇంకో యూజర్‌ సరదాగా మూవీని ట్రోల్‌ చేశాడు. నిజానికి ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌, ట్రైలర్‌లు రిలీజైన సమయంలో శరవణన్‌ లుక్స్‌ చూసి ఇతడు హీరో ఏంటి అని నెటిజన్లు పెదవి విరిచారు. ఇప్పుడు ఊహించినట్లుగానే సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ఫన్నీ కామెంట్స్‌తో అతని పరువు తీస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం