Netizens Troll on Rana Naidu: ఏ కాదు ఏ ప్లస్ ప్లస్ - రానా నాయుడు సీన్స్, డైలాగ్స్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్
11 March 2023, 13:42 IST
Netizens Troll on Rana Naidu: వెంకటేష్, రానా కలిసి నటించిన రానా నాయుడు వెబ్‌సిరీస్ శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఈ సిరీస్‌పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వస్తోన్నాయి.
వెంకటేష్
Netizens Troll on Rana Naidu: వెంకటేష్, రానా తొలిసారి కలిసి నటించిన రానా నాయుడు వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్‌తోనే వెంకటేష్, రానా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు.
అమెరికన్ సిరీస్ రే డోనోవన్ ఆధారంగా కంప్లీట్ యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసుకొని సిరీస్‌ను తెరకెక్కించారు. వెంకటేష్‌కు ఫ్యామిలీస్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా లేడీస్ అతడి సినిమాల్ని ఎక్కువగా చూస్తారు. వెంకటేష్ పై ఉన్న క్లీన్ ఇమేజ్ కారణంగా రానా నాయుడు సిరీస్‌ను ఫ్యామిలీస్ కలిసి చూసే అవకాశం ఉండొచ్చని అనుకున్నారు.
కానీ ఇది యూత్ సిరీస్ మాత్రమేనని, ఫ్యామిలీస్ కలిసి చూసేది కాదని రానా నాయుడు ప్రమోషన్స్‌లో వెంకటేష్, రానా చెప్పారు. వారి మాటల వెనుక భావం ఏమిటో సిరీస్ చూసిన చూసిన తర్వాతే అర్థమైందని నెటిజన్లు చెబుతోన్నారు. సిరీస్‌లో విచ్చలవిడిగా సెమీ న్యూడ్ సీన్స్, బూతు డైలాగ్స్ ఉండటంపై ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ అభ్యంతరం వ్యక్తంచేస్తోన్నారు.
వెంకటేష్ ఇమేజ్ డామేజ్…
యువతను తప్పుదోవ పట్టించేలా ఈ సిరీస్ ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు. వెంకటేష్, రానా ఈ సిరీస్ ఎలా ఒప్పుకున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. వెంకటేష్ ఇమేజ్ డామేజ్ అయ్యే అవకాశం ఉందని ట్వీట్స్ చేస్తోన్నారు. వెంకటేష్ ఉన్నాడనే నమ్మకంతో ఫ్యామిలీస్‌తో చూడొద్దని సలహాలు ఇస్తోన్నారు.
వల్గారిటీని నమ్ముకునే సిరీస్‌ను రూపొందించినట్లు ఉందని కామెంట్స్ చేస్తోన్నారు. రానా నాయుడు సిరీస్‌తో మరోసారి ఓటీటీ సెన్సార్‌షిప్ టాపిక్ తెరపైకి వచ్చింది. ఓటీటీ పేరుతో కంప్లీట్ బూతునే నమ్ముకుంటూ సిరీస్‌లను రూపొందిస్తోన్నారని అంటున్నారు. ఓటీటీలను సెన్సార్‌షిప్ పరిధిలోకి తీసుకురావాలని అంటున్నారు. ఈ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సూపర్న్ వర్మ దర్వకత్వం వహించారు.