తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prathinidhi 2: రాష్ట్రానికి అప్పులు.. మీకు ఆస్తులు.. రాజకీయ నాయకులపై సెటైర్‌గా ప్రతినిధి 2

Prathinidhi 2: రాష్ట్రానికి అప్పులు.. మీకు ఆస్తులు.. రాజకీయ నాయకులపై సెటైర్‌గా ప్రతినిధి 2

Sanjiv Kumar HT Telugu

20 April 2024, 8:27 IST

  • Prathinidhi 2 Trailer Released By Sukumar: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తాజాగా ప్రతినిధి ట్రైలర్‌ను విడుదల చేశారు. పొలిటికల్ లీడర్స్‌పై ప్రశ్నలు కురిపిస్తూ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది మూవీ ట్రైలర్. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాష్ట్రానికి అప్పులు.. మీకు ఆస్తులు.. రాజకీయ నాయకులపై సెటైర్‌గా ప్రతినిధి 2
రాష్ట్రానికి అప్పులు.. మీకు ఆస్తులు.. రాజకీయ నాయకులపై సెటైర్‌గా ప్రతినిధి 2

రాష్ట్రానికి అప్పులు.. మీకు ఆస్తులు.. రాజకీయ నాయకులపై సెటైర్‌గా ప్రతినిధి 2

Prathinidhi 2 Trailer Out Now: నారా రోహిత్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా ప్రతినిధి 2. ఈ సినిమాతో జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే ప్రతినిధి 2 టీజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఏప్రిల్ 19న ప్రతినిధి 2 థియేట్రికల్ ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ లాంచ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Prasanna Vadanam OTT: ఓటీటీలోకి నెలలోపే సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Krishnamma Collection: కృష్ణమ్మ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్- సత్యదేవ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్- ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Katrina Kaif: హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీపై రూమర్లు.. స్పందించిన టీమ్!

Raajadhani Files TV Premiere: పోలింగ్‍కు ఒక్క రోజు ముందు టీవీ ఛానెల్‍లో రాజధాని ఫైల్స్ సినిమా.. టెలికాస్ట్ టైమ్ ఇదే

జనవరి 30, 1948న స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా గాంధీ మరణించిన తర్వాత గుండెపోటుతో ఎంత మంది మరణించారు అని జర్నలిస్ట్ పాత్ర పోషించిన నారా రోహిత్ అడగడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికి వస్తే.. ఒక ముఖ్యమంత్రి మరణించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు జరుగుతాయి. ఆత్మహత్యాయత్నం చేసుకొని అనేకమంది ఆసుపత్రిలో చేరుతారు.

వారిలో ఒక వ్యక్తిని ''మీ కుటుంబం కంటే నాలుగు సంక్షేమ పథకాలు ఇచ్చిన రాజకీయ నాయకుడు ముఖ్యమా? అని కథానాయకుడు ప్రశ్నిస్తాడు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో తమ గెలుపుపై అధికార పార్టీకి అనుమానాలు ఉంటాయి. ఇప్పటికే సంక్షేమ పథకాలతో బిస్కెట్స్ వేశాం. అది సరిపోదు అని అజయ్ పాత్ర అంటుంది.

మరోవైపు, ఓ ఛానెల్‌లో ప్రత్యేకంగా వార్తలు ప్రసారం చేస్తున్న కథానాయకుడిని పోలీసులు అప్పటికే జరుగుతున్న హత్యలపై అనుమానిస్తున్నారు. అతను ఎవరు? అతని ఎజెండా ఏమిటి? వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసే విషయంలో ఓటర్లను ఎందుకు హెచ్చరించాడు? ఇలాంటి ఎలిమెంట్స్ ఎగ్జయిటింగ్‌గా ప్రజెంట్ చేశారు.

న్యూస్ ఇంటర్వ్యూలో కొబ్బరి బొండాలు అమ్మా, బండి మీద బత్తాయి కాయలు అమ్మా. ఎన్నో వ్యాపారాలుచేసి ఇంతపెద్ద స్థాయికి వచ్చాను అని అజయ్ ఘోష్ పాత్ర చెబుతుంది. అతను చెప్పే విధానం ఒక పొలిటికల్ లీడర్‌ను గుర్తు చేసేలా ఉంది. మరేంటి సారి మీతోపాటు కాయలు అమ్ముకున్నవాళ్లు ఇంకా కాయలు అమ్ముకుంటున్నారు. మీరు మాత్రం ఎలా కోటీశ్వరుడు అయ్యారు సార్. రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే మీకెలా సార్ ఆస్తులు పెరుగుతున్నాయి అని యాంకర్ అడిగే క్వశ్చన్ ఆలోచించేలా చేసింది.

రాజ‌కీయ వ్యవ‌స్థలోని అవినీతిని ప్రశ్నిస్తూ మూర్తి దేవగుప్తపు ఒక పవర్ ఫుల్ కథను రాశారు. కథానాయకుడి అసలు పాత్రను వెల్లడించకుండా ట్రైలర్‌లో సినిమా గురించి మరింత సమాచారం ఉంది. నారా రోహిత్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సిరీ లెల్లా కథానాయికగా నటించింది. సచిన్ ఖేడేకర్, దినేష్ తేజ్, రఘుబాబు, జిషు సేన్‌గుప్తా, పాపులర్ యాంకర్ ఉదయ భాను, అజయ్ ఘోష్ , శ్రీ ముఖ్య పాత్రల్లో కనిపించారు.

సినిమాటోగ్రాఫర్ నాని చమిడిశెట్టి, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్, ఎడిటర్ రవితేజ గిరిజాల క్యాలిటీ కంటెంట్‌ను అందించడానికి అద్భుతమైన టీం వర్క్ అందించారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. మూవీ ట్రైలర్ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఉత్కంఠను మరింత పెంచింది. ప్రతినిధి 2 ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు అయితే రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం