IPL Anchor: అందరి ముందే బట్టలు మార్చుకోవాలి.. ఐపీఎల్ యాంకర్ వింధ్య కామెంట్స్-ipl anchor cricket commentator vindhya vishaka comments on her modeling days ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl Anchor: అందరి ముందే బట్టలు మార్చుకోవాలి.. ఐపీఎల్ యాంకర్ వింధ్య కామెంట్స్

IPL Anchor: అందరి ముందే బట్టలు మార్చుకోవాలి.. ఐపీఎల్ యాంకర్ వింధ్య కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Apr 14, 2024 11:16 AM IST

IPL Anchor Vindhya Vishaka About Modeling: ఐపీఎల్ సీజన్స్‌లో యాంకర్‌గా సత్తా చాటుతోన్న తెలుగు అమ్మాయి వింధ్య విశాఖ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అందరి ముందే బట్టలు మార్చుకునే సందర్భం గురించి తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అందరి ముందే బట్టలు మార్చుకోవాలి.. ఐపీఎల్ యాంకర్ వింద్య కామెంట్స్
అందరి ముందే బట్టలు మార్చుకోవాలి.. ఐపీఎల్ యాంకర్ వింద్య కామెంట్స్

Cricket Commentator Vindhya Vishaka: ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. తమ ఫెవరేట్ జట్లు కప్పు కొట్టాలని అభిమానులు జపం చేస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ ప్లేయర్స్ తమ ఉత్తమ ప్రదర్శన చూపుతున్నారు. ఇక ఐపీఎల్ మ్యాచ్‌ల తర్వాత వాటి గురించి ఎంతో ఇంట్రెస్టింగ్‌గా చెబుతారు యాంకర్స్. మ్యాచ్‌లోను ఆకట్టుకునే పదాలతో క్రికెట్ కామెంట్రీ అలరిస్తుంది. అలా ఐపీఎల్ సీజన్‌లో తెలుగు అమ్మాయి అదరగొడుతోంది.

మగవాళ్లను చూసివారికి

తన ప్రొఫెషనల్ బాడీ లాంగ్వెజ్‌తో ఎంతో మంది క్రికెట్ అభిమానులను తన ఫ్యాన్స్‌గా చేసుకుంది వింధ్య విశాఖ. 1992 ఏప్రిల్ 18న సికింద్రాబాద్‌లో జన్మించిన వింధ్య విశాఖ మేడపాటి మొదట టీవీ ఛానెళ్లలో యాంకర్‌గా రాణించింది. అనంతరం 20 మంది యాంకర్లను వెనక్కి నెట్టి ఐపీఎల్‌కు హోస్ట్‌గా అవకాశం దక్కించుకున్న మొదటి తెలుగు అమ్మాయిగా వింధ్య రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పటివరకు స్పోర్ట్స్ ప్రజంటర్‌గా మగవాళ్లను చూసిన తెలుగు తెరకు తొలి తెలుగు తెలుగు అమ్మాయిగా వింధ్య నిలిచింది.

షరతు పెట్టడంతో

ఐపీఎల్ 11వ సీజన్ నుంచి హోస్ట్‌గా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న వింధ్య విశాఖ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మోడలింగ్ రోజులను గుర్తు చేసుకుంది. "క్రికెట్ రంగంలో ఎక్కువగా మగవారు మాత్రమే ఉన్నారు. మా కుటుంబసభ్యుల ప్రోత్సాహం వల్లే నేను ఈ కెరీర్‌లో రాణిస్తున్నాను. డిగ్రీ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు న్యూస్ ప్రజంటర్‌గా, మోడల్‌గా అవకాశాలు ఎక్కువగా వచ్చేవి. కానీ, చదువును నిర్లక్ష్యం చేయకూడదని మా అమ్మ షరతు పెట్టడంతో ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశాను" అని వింధ్య తెలిపింది.

విజేతగా నిలిచాను

"కొంతకాలం పాటు మోడలింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. అలా కాలేజీ రోజుల్లోనే కొన్ని అందాల పోటీల్లో పాల్గొన్నాను. వాటిలో కొన్నింట్లో విన్నర్ కూడా అయ్యాను. దాంతో ఎలాగైనా మోడలింగ్ చేయాలనే ఆలోచన వచ్చింది. చదువు పూర్తి అయిన తర్వాత మోడలింగ్‌లో శిక్షణ తీసుకున్నా" అని వింధ్య విశాఖ చెప్పింది.

అందరి ముందే

"కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఒక ఫ్యాషన్ వీక్‌లో నేను పార్టిస్‌పేట్ చేశాను. అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ షో. అలాగే అదే నా కెరీర్‌లో మిగిలిపోయింది. ఎందుకంటే అక్కడి వాతావరణం చూసిన తర్వాత నాకు ఈ రంగం ఏమాత్రం సెట్ కాదని అనుకున్నాను. ఆ ఫ్యాషన్ కోసం వచ్చిన అమ్మాయిలకు బట్టలు మార్చుకోడానికి సరైన గదులు కూడా లేవు. బ్యాక్ స్టేజ్ వద్దే అందరి ముందు బట్టలు మార్చుకోవాల్సి ఉంటుంది. అది చూసి కొంతపాటు షాక్ అయ్యా" అని వింధ్య చెప్పుకొచ్చింది.

అందుకే నో చెప్పా

"ఆ క్షణంలోనే నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ రంగం నాకు ఎంతమాత్రం సెట్ కాదు అనిపించింది. ఆ ఒక్క షో వల్లే మోడలింగ్ వదిలేశాను. నాకు ఎదురైన అనుభవం మాత్రమే చెబుతున్నాను. ప్రతి చోటా ఇలానే ఉంటుందని నా అభిప్రాయం కాదు. నాకు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి. గోపాల గోపాల, ముకుంద వంటి సినిమాలకు అడిగారు. కానీ, నాకు సినిమా రంగం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేక వాటికి నో చెప్పాను" అని ఐపీఎల్‌లో హోస్ట్‌గా వ్యవహరించిన వింధ్య విశాఖ తెలిపింది.

IPL_Entry_Point