Nani Wife Reviews Hi Nanna: హాయ్ నాన్న మూవీపై నాని భార్య రివ్యూ చూశారా?
07 December 2023, 15:52 IST
- Nani Wife Reviews Hi Nanna: నాని, మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్న మూవీపై అతని భార్య ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇచ్చిన రివ్యూ వైరల్ అవుతోంది. సింపుల్ గా రెండు లైన్లలో ఆమె ఈ సినిమా గురించి మనసుకు హత్తుకునేలా చెప్పింది.
హాయ్ నాన్న మూవీలో మృణాల్ ఠాకూర్, నాని
Nani Wife Reviews Hi Nanna: నాని నటించిన హాయ్ నాన్న మూవీ గురువారం (డిసెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాపై నాని భార్య అంజనా యెలవర్తి ఇచ్చిన రివ్యూ వైరల్ అవుతోంది. బుధవారం రాత్రి ప్రీమియర్ షో చూసిన తర్వాత ఆమె ఇన్‌స్టా స్టోరీలో తన రివ్యూ పోస్ట్ చేసింది.
హాయ్ నాన్న మూవీ చూసిన తర్వాత తనకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో చెబుతూ నాని భార్య పోస్ట్ చేసింది. నానిని వాళ్ల తనయుడు అర్జున్ సినిమా చూస్తూ హగ్ చేసుకున్న ఫొటోను షేర్ చేస్తూ ఆమె పోస్ట్ చేసిన ఇన్‌స్టా స్టోరీ వైరల్ అవుతోంది. "హాయ్ నాన్న ఇలా అనిపించింది. ఓ మంచి హగ్. రెండు గంటల పాటు మా నాన్నను తిరిగి తీసుకొచ్చిన సినిమా ఇది. నాని నువ్వు నిజంగా డాడ్ ఐకాన్" అని అంజు పోస్ట్ చేయడం విశేషం.
హాయ్ నాన్న మూవీ ఎలా ఉందంటే?
నాని ఎంచుకునే కథలు సింపుల్‌గానే ఉన్నా వాటిలో బలమైన భావోద్వేగాలు, డ్రామా కనిపిస్తుంటుంది. కెరీర్ ఆరంభం నుంచి ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ సక్సెస్‌లను అందుకుంటున్నాడు నాని. హాయ్ నాన్న(Hi Nanna Review)తో మరోసారి అదే రూట్లో అడుగులు వేశాడు.
ఓ జంట ప్రేమ ప్రయాణంతో ఎమోషనల్ రైడ్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు.ఓ చిన్న ట్విస్ట్‌పై ఆధారపడి డైరెక్టర్ శౌర్యువ్ ఈ కథను రాసుకున్నాడు. సింపుల్ లవ్ స్టోరీని నాని, మృణాల్ ఠాకూర్ తమ కెమిస్ట్రీ, యాక్టింగ్‌తో నిలబెట్టారు. ఒకే ప్రేమకథను రెండు కోణాల్లో చూపించడం, వాటిని కలుపుతూ వచ్చే మలుపును బలంగా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
విరాజ్ పాత్రలో నాని అదరగొట్టాడు. కూతురి కోసం ఆరాటపడే తండ్రిగా...ప్రేమికుడిగా, డిఫరెంట్ వేరియేషన్స్‌తో కూడిన పాత్రలో చక్కటి వేరియేషన్స్ చూపించాడు. హాయ్ నాన్న ఫీల్‌గుడ్ ఎమోషనల్ మూవీ. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా కోసం ఎదురుచూస్తోన్న ఆడియెన్స్ మంచి ఛాయిస్‌గా ఈ మూవీ నిలుస్తుంది.