తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nagarjuna Remuneration: లీకైన నాగార్జున రెమ్యునరేషన్.. బిగ్ బాస్ ఒక్కో ఎపిసోడ్‍కి కోట్లల్లో పారితోషికం

Nagarjuna Remuneration: లీకైన నాగార్జున రెమ్యునరేషన్.. బిగ్ బాస్ ఒక్కో ఎపిసోడ్‍కి కోట్లల్లో పారితోషికం

Sanjiv Kumar HT Telugu

28 September 2023, 13:53 IST

  • Bigg Boss 7 Telugu Nagarjuna Remuneration: తెలుగులో బీభత్సమైన పాపులారిటీ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ కొనసాగుతుండగా.. హోస్ట్ నాగార్జున రెమ్యునరేషన్ లీకైంది.

బిగ్ బాస్ 7 తెలుగుకి నాగార్జున రెమ్యునరేషన్
బిగ్ బాస్ 7 తెలుగుకి నాగార్జున రెమ్యునరేషన్

బిగ్ బాస్ 7 తెలుగుకి నాగార్జున రెమ్యునరేషన్

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ నాలుగు వారాలకు చేరుకుంది. ఇందులోకి 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని భట్ల ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం 11 మంది హౌజ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇటీవల జరిగిన నాలుగో వారం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీళ్లకు నాలుగో పవరాస్త్రను దక్కించుకునేందుకు టాస్కులు ఇస్తున్నాడు బిగ్ బాస్. అందులో కంటెస్టెంట్స్ చురుగ్గా పాల్గొంటూ.. మంచి కంటెంట్ ఇస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Top 10 IMDb rating movies: ప్రపంచ సినిమాలో అత్యుత్తమ ఐఎండీబీ రేటింగ్ కలిగిన టాప్ 10 మూవీస్ ఇవే.. ఈ ఓటీటీల్లో చూడండి

Srikanth on Rave Party: మొన్న నా భార్యతో విడాకులు ఇప్పించేశారు.. ఇప్పుడిలా.. వాడెవడో నాలాగే ఉన్నాడు కానీ..: శ్రీకాంత్

Deepika Padukone Baby Bump: దీపికా బేబీ బంప్.. భర్తతో కలిసి ఓటేయడానికి వస్తూ చూపించిన బ్యూటీ

Laapataa Ladies: అందరినీ ఆలోచింపజేసేలా మంజూ మాయ్ చెప్పిన పవర్‌ఫుల్ హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఇవి.. మిస్ అవకండి

బిగ్ బాస్ తెలుగు 3 నుంచి

ఇక ప్రతి బిగ్ బాస్ సీజన్‍లో సెలబ్రిటీలను కంట్రోల్ చేయడం, వారించడం, సలహాలు ఇవ్వడం, ఎంటర్టైన్ చేయడం వంటివి చేయడం హోస్ట్ పని. బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ నుంచి కింగ్ నాగార్జునే హోస్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ 7 తెలుగుకు హోస్ట్ చేస్తున్నందుకు నాగార్జున అధికంగా రెమ్యునరేషన్ అందుకోనున్నారని ఓ న్యూస్ లీక్ అయింది.

ఒక్కో ఎపిసోడ్‍కు

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ఒక్కో ఎపిసోడ్‍కు రూ. కోటి పారితోషికం తీసుకుంటున్నారట నాగార్జున. ఈ సీజన్ ఎంత లేదన్నా 3 నెలలు సాగుతుంది. అంటే దాదాపుగా 12 వారాలకుపైనే ప్రసారం అవుతుంది. నాగార్జున వచ్చి ఎంటర్టైన్ చేసే శని, ఆది వారాలు కలుపుకుని బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ మొత్తానికి మన్మథుడికి సుమారు రూ. 20 కోట్లకుపైగా పారితోషికం అందుతుందని సమాచారం.

మొత్తంగా 20 కోట్లు

ఇదిలా ఉంటే నాగార్జున బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్‍కు మొత్తంగా రూ. 5 నుంచి 8 కోట్లు తీసుకున్నాడట. నాలుగో సీజన్‍కు రూ. 8 నుంచి 10 కోట్లు, ఐదో సీజన్‍కు రూ. 12 కోట్లు, 6వ సీజన్‍కు రూ. 16 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఇక అన్ని సీజన్లకు మించి భారీగా బిగ్ బాస్ 7 తెలుగుకు నాగార్జున రూ. 20 కోట్లు అందుకుంటున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

సినిమా కంటే ఎక్కువ

బిగ్ బాస్ షోకి నాగార్జున వీకెండ్ ఒక రోజు కేటాయిస్తే సరిపోతుంది. మొత్తంగా దీని కోసం నాగ్ 15 రోజులు వెచ్చిస్తారు. అంటే కింగ్ నాగార్జునకు ఒక సినిమా కంటే బిగ్ బాస్ షోకి వచ్చే పారితోషికమే ఎక్కువ అని అర్థం అవుతుంది. ఇదిలా ఉంటే నాగార్జున ప్రస్తుతం నా సామిరంగ సినిమాతో బిజీగా ఉన్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం