Nagarjuna: 20 ఏళ్ల క్రితం మోసం చేసిన నాగార్జున.. ఒక్క వీడియోతో ఇప్పుడు బయటకు!
20 September 2023, 15:44 IST
Nagarjuna Cheating: టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నేడు (సెప్టెంబర్ 20) అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే నాగార్జున సుమారు 20 ఏళ్ల క్రితం చేసిన ఓ మోసం ఇప్పుడు ఓ వీడియో ద్వారా బయటకు వచ్చింది.
20 ఏళ్ల క్రితం మోసం చేసిన నాగార్జున.. ఒక్క వీడియోతో ఇప్పుడు బయటకు!
అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున టాలీవుడ్ కింగ్‌గా ఎదిగారు. ఎందరో అమ్మాయిలకు మన్మథుడుగా మారారు. సుధీర్ఘమైన ఆయన సినీ కెరీర్లో ఎన్నో వినోదాత్మక చిత్రాలు అందించారు. వాటిలో నటించడమే కాకుండా పలు సినిమాలను నిర్మించారు. ఎంతోకాలంగా అగ్ర హీరోగా వెలుగొందుతున్నారు. ఇటీవల ఘోస్ట్ సినిమాతో ప్లాప్ చూసిన ఆయన త్వరలో నా సామిరంగ (Naa Saamiranga) మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు.
రీ రిలీజ్ ద్వారా
నాగార్జున సినీ కెరీర్లో మన్మథుడు సినిమాకు స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఈ సినిమా అంటే ఇష్టపడని వారుండరు. నాగార్జున సినిమాల్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ మూవీలో ఇది ఒకటి. అయితే ఇటీవల నాగ్ బర్త్ డే సందర్భంగా మన్మథుడు మూవీని రీరిలీజ్ చేశారు. ఈ మూవీ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఈ రీరిలీజే నాగార్జున చేసిన ఓ మోసాన్ని బయటపెట్టింది. మన్మథుడు సినిమాలో నాగార్జున నీళ్లు ఉన్న బ్రిడ్జ్ దాటే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది.
వీడియో వైరల్
నాగార్జున కళ్లు మూసుకుని బ్రిడ్జ్ దాటే ఈ సన్నివేశాన్ని పారిస్‌లో చిత్రీకరించారని మనం అప్పుడు సినిమా చూసినప్పుడు అనుకున్నాం. ఎందుకంటే మూవీలో నాగ్, సోనాలి బింద్రె పారిసే వెళ్తారు కాబట్టి. కానీ, నిజానికి ఈ బ్రిడ్జ్ ఫ్రాన్స్ దేశంలోని పారిస్‌లో లేదట. అది ఆస్ట్రియా అనే మరో దేశంలో ఉందట. ఈ విషయాన్ని చెబుతూ మీమ్ రూపంలో ఓ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అంటే ఇంతకాలం మన్మథుడులోని బ్రిడ్జ్ పారిస్‌లో లేదని, ఆస్ట్రియాలో ఉందని తెలిసి నెటిజన్లు అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియా
ఏమైనా గానీ, ఆస్ట్రియాలో షూట్ చేసి.. పారిస్‌లో చేశామని నాగార్జున అండ్ మూవీ టీమ్ ఎంత బాగా మోసం చేశారో కదా మన్మథుడు సినిమాలోని డైలాగ్స్ నే వాడుతు అనుకుంటున్నారు. కాగా ఈ సినిమా వచ్చి ఇప్పటికీ 20 ఏళ్లు కావొస్తుంది. అప్పుడంటే సోషల్ మీడియా పెద్దగా లేకపోయేసరికి ఇలాంటివి తెలియలేదు. కానీ, ఇప్పుడు మాత్రం ప్రతి చిన్న తప్పుని వెలెత్తి చూపుతూ మీమ్స్, కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.