తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thank You Ticket Price: ఏపీ తెలంగాణ‌లో థాంక్యూ టికెట్ ధ‌ర‌లు ఇవే...రివీల్ చేసిన ప్రొడ్యూసర్

Thank you Ticket price: ఏపీ తెలంగాణ‌లో థాంక్యూ టికెట్ ధ‌ర‌లు ఇవే...రివీల్ చేసిన ప్రొడ్యూసర్

18 July 2022, 12:54 IST

  • నాగ‌చైత‌న్య హీరోగా విక్ర‌మ్ కెకుమార్ ద‌ర్శ‌క‌త్వం రూపొందుతున్న థాంక్యూ చిత్రం జూలై 22న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ఏపీ, తెలంగాణ‌లో టికెట్ల ధ‌ర‌లను నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. 

నాగ‌చైత‌న్య
నాగ‌చైత‌న్య (twitter)

నాగ‌చైత‌న్య

మనం సక్సెస్ త‌ర్వాత యువ హీరో nel ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె కుమార్ క‌ల‌యిక‌లో రూపొందుతున్న చిత్రం థాంక్యూ. భిన్న‌మైన ప్రేమ‌క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం జూలై 22న ప్రేక్ష‌కుల ముందుకురానుంది. ఓ యువ‌కుడి జీవితంలో వివిధ ద‌శ‌ల్లోసాగిన ప్రేమ‌క‌థ‌ను ఆవిష్కరిస్తూ విక్రమ్ కె కుమార్ సినిమాను రూపొందించారు. జీవితంలో తాను ఉన్న‌త స్థాయికి చేరుకోవ‌డానికి కార‌ణ‌మైన వారికి ఓ యువ‌కుడు ఎలా థాంక్యూ చెప్పార‌నే అంశాన్ని హృద్యంగా ఈ సినిమాలో ఆవిష్క‌రించ‌బోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Aranmanai 4 - Rathnam OTT: ఒకే రోజు ఓటీటీలోకి త‌మ‌న్నా అరాణ్మ‌ణై 4...విశాల్ ర‌త్నం - ట్విస్ట్ ఏంటంటే?

OTT Weekend Movies: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఈ సినిమాలు, వెబ్ సిరీస్‍ను మిస్ అవ్వొద్దు!

Furiosa A Mad Max Saga: మ్యాడ్‌మ్యాక్స్‌కు ప్రీక్వెల్ వ‌స్తోంది… 1400 కోట్ల విజువ‌ల్ వండ‌ర్‌ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

NNS Serial May 16th Episode: మిస్సమ్మకు అమర్ ముద్దు - అరుంధ‌తిని చంపిన‌ మ‌నోహ‌రి - స‌ర‌స్వతిని కాపాడిన రామ్మూర్తి

థాంక్యూ సినిమాలో మూడు డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ తో కూడిన క్యారెక్ట‌ర్‌లో నాగ‌చైత‌న్య క‌నిపించ‌బోతున్నారు. ఏపీ తెలంగాణలో ఈ సినిమా టికెట్ ధరలు ఎలా ఉండనున్నాయనేది కొంతకాలంగా ఆసక్తికరంగా మారింది. ఈ టికెట్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని మ‌ల్టీప్లెక్స్‌ల‌లో 300, సింగిల్ స్ర్కీన్స్‌లో 175గా టికెట్ ధ‌ర‌లు ఉన్నాయి.

కానీ థాంక్యూ సినిమాకు తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్ లో 100 ప్లస్ జీఎస్టీ, మల్టీప్లెక్స్ లలో 150 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించినట్లు పేర్కొన్నాడు. ధరల తగ్గింపు వల్ల తనకు వచ్చే లాభం తగ్గుతుందని అయినా ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.ఏపీలో మాత్రం టికెట్ ధ‌ర‌ల‌తో పెద్ద‌గా మార్పులు చేయ‌డం లేద‌ని తెలిసింది. ఏపీలో సింగిల్ స్క్రీన్స్‌లో 125 ప్లస్ జీఎస్టీ రూపాయల కనీస ధరగా ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ రేట్స్ ను తగ్గించడం కుదరదని పేర్కొన్నారు.

మ‌ల్టీప్లెక్స్‌ల‌లో 177 రూపాయ‌లుగా ఉండబోతున్నట్లు తెలిపారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసమే ఈ ధరలను నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ సినిమాలోరాశీఖ‌న్నా, మాళ‌వికానాయ‌ర్‌, అవికాగోర్ హీరోయిన్లుగా న‌టించారు. త‌మ‌న్ సంగీతాన్నిఅందిస్తున్నారు. బీవీఎస్ ర‌వి క‌థ‌ను అందిస్తున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం