Naga Chaitanya: సమంతతో విడాకులపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు
01 August 2022, 13:47 IST
సమంతతో (Samantha) తాను విడాకుల గురించి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య (ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ విడాకుల గురించి తాను చెప్పాలనుకున్నవన్నీ ఇప్పటికే బయటపెట్టినట్లు పేర్కొన్నాడు. నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య
సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితం ఎక్కువగా వార్తల్లో నిలవడం అసహనానికి గురిచేస్తుందని అన్నాడు నాగచైతన్య. సమంతతో విడాకుల గురించి తాను చెప్పాలనుకున్నది ఇప్పటికే వ్యక్తపరిచానని, అంతకుమించి ఈ విషయం గురించి చెప్పాల్సింది ఏమీ లేదని పేర్కొన్నాడు. మూడేళ్ల వివాహ బంధానికి 2020లో నాగచైతన్య, సమంత ముగింపు పలికారు. వీరిద్దరు విడిపోవటానికి గల కారణాలేమిటన్నది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. వీరి విడాకులపై చాలా రోజులుగా పలు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంతతో విడాకులపై నాగాచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన జీవితంలోని మంచిచెడుల గురించి ముందుగానే అందరికి చెబుతుంటానని, ఏది దాచలేదని అన్నాడు. విడాకుల తర్వాత తమ అభిప్రాయాలేమిటన్నది సమంత, తాను ప్రకటన రూపంలో బయటపెట్టామని అన్నాడు. మా దారుల్లో మేము ముందుకు సాగుతున్నామని పేర్కొన్నాడు.
ఈ విడాకులపై ఇంతకుమించి ప్రపంచానికి తాము చెప్పాల్సింది ఏమీ లేదని, ఆ అవసరం తమకు లేదని తెలిపాడు. తన జీవితంలో ఏం జరిగిందనేది ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికి తెలుసుసనని, ఎవరికి ఏం చెప్పాల్సిన పనిలేదని అన్నాడు. బయట ప్రచారంలో ఉన్న పుకార్లపై తాను స్పందించే కొత్త ప్రచారానికి దారితీస్తుందని అన్నాడు. ఈ పుకార్లు, అబద్దలు ప్రచారాలు తాత్కాలికమైనవని, వాటికి ముగింపు పడే రోజు తప్పకుండా వస్తుందని నాగచైతన్య పేర్కొన్నాడు.
అతడి వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవలే ఈ విడాకులపై కాఫీ విత్ కరణ్ షోలో సమంత కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విడాకులు తనను చాలా బాధపెట్టాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా నాగచైతన్య బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తూ నటించిన లాల్ సింగ్ చడ్డా ఆగస్ట్ 11న రిలీజ్ అవుతోంది. ఆమిర్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.