Naa Saamiranga Breakeven: నా సామిరంగ బ్రేక్ ఈవెన్ - హనుమాన్ తర్వాత లాభాల్లోకి అడుగుపెట్టిన సంక్రాంతి మూవీ ఇదే
22 January 2024, 9:52 IST
Naa Saamiranga Breakeven: సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో హనుమాన్ తర్వాత బ్రేక్ ఈవెన్‌ను సాధించిన సెకండ్ మూవీగా నాగార్జున నా సామిరంగ నిలిచింది. ఎనిమిది రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 44.8 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు సినిమా యూనిట్ తెలిపింది.
నాగార్జున నా సామిరంగ
Naa Saamiranga Breakeven: నాగార్జున నా సామిరంగ బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో హనుమాన్ తర్వాత అన్ని ఏరియాల్లో లాభాల్లోకి అడుగుపెట్టిన సెకండ్ మూవీగా నా సామిరంగ నిలిచింది. సోమవారం నాటితో నా సామిరంగ మూవీ సెకండ్ వీక్‌లో అడుగుపెట్టింది. ఎనిమిది రోజుల్లో వరల్డ్ వైడ్‌గా నాగార్జున మూవీ 44.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు నిర్మాతలు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈమూవీ 21.89 కోట్ల షేర్‌ను సాధించినట్లు ప్రకటించారు. 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. నిర్మాతలకు మూడు కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టింది.
సోమవారం రోజు కలెక్షన్స్ ఇవే...
సోమవారం రోజు ఈ సినిమా కోటి ముప్పై లక్షలకుపైగా కలెక్షన్స్ రాబట్టినట్లు యూనిట్ ప్రకటించింది. నైజాం ఏరియాలో 26 లక్షలు, సీడెడ్‌లో 23 లక్షలు, వైజాడ్‌గ్‌లో 28 లక్షల కలెక్షన్స్‌ను నా సామిరంగ సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. గుంటూరులో 12, కృష్ణలో 11 లక్షల కలెక్షన్స్ నా సామిరంగకు వచ్చినట్లు తెలిపారు. అన్ని ఏరియాల్లో నా సామిరంగ మూవీ బ్రేక్ ఈవెన్‌ను సాధించి సెకండ్ వీక్‌లోకి ఎంటరైనట్లు సినిమా వర్గాలు వెల్లడించాయి
హనుమాన్ తర్వాత నాగ్ మూవీనే...
సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో హనుమాన్ తర్వాత నాగార్జున నా సామిరంగ మాత్రమే బ్రేక్ ఈవెన్‌ను సాధించిన మూవీగా నిలిచింది. మహేష్ బాబు గుంటూరు కారం కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. వెంకటేష్ సైంధవ్ డిజాస్టర్‌గా మిగిలింది. బంగార్రాజు తర్వాత మరోసారి సంక్రాంతి విన్నర్‌గా నాగ్ నిలిచాడు. లాంగ్ గ్యాప్ తర్వాత నా సామిరంగతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు.
పురింజు మరియం జోస్...
నా సామిరంగకు విజయ్ బిన్నీ దర్శకత్వం వహించాడు. మలయాళంలో విజయవంతమైన పురింజు మరియం జోస్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో కిష్టయ్య అనే మాస్ క్యారెక్టర్‌లో నాగార్జున కనిపించాడు. అతడి క్యారెక్టరైజేషన్, ఎలివేషన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. నాగార్జునతో పాటు ఈ మూవీలో అల్లరి నరేష్, రాజ్‌తరుణ్ హీరోలుగా కనిపించారు. ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో మిర్నామీనన్, రుక్సర్ థిల్లాన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాసచిట్టూరి నా సామిరంగ మూవీని నిర్మించాడు. నా సామిరంగ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నది. కేవలం 37 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్‌ను పూర్తిచేయడం గమనార్హం.
ధనుష్‌తో మల్టీస్టారర్..
నా సామిరంగ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నాడు. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఇటీవలే సెట్స్‌పైకి వచ్చింది. జనవరి నెలాఖరు నుంచి నాగార్జున ఈ మూవీ షూటింగ్‌లో భాగం కాబోతున్నాడు. అలాగే మరో కొత్త దర్శకుడితో నాగ్ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.
టాపిక్