తెలుగు న్యూస్  /  Entertainment  /  Mrunal Thakur Shares A Crying Picture And Says She Was Extremely Low

Mrunal extremely low: ఏడుస్తున్న మృణాల్.. ఏమైందంటూ ఫ్యాన్స్ కంగారు.. సోషల్ మీడియాలో వైరల్

22 March 2023, 8:08 IST

  • Mrunal extremely low: సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ తను ఏడుస్తున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఫొటోలో ఆమె ఏడుస్తూ కనిపించేసరికి అభిమానులు ఆందోళన చెందారు. స్ట్రాంగ్‌గా ఉండాలని సూచించారు.

మృణాల్ ఠాకూర్
మృణాల్ ఠాకూర్

మృణాల్ ఠాకూర్

Mrunal extremely low: సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచిమైన నటి మృణాల్ ఠాకూర్. తన నటనతో తెలుగువాళ్లను మంత్రముగ్ధులను చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఆఫర్లు దక్కించుకుంటోంది. ఇప్పటికే నాని సరసన ఓ సినిమాకు ఓకే చెప్పిన ఈ బ్యూటీ.. మరి కొన్ని ప్రాజెక్టులకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మృణాల్.. తాజాగా పెట్టిన తను షేర్ చేసిన ఇన్‌స్టార్ స్టోరీ వైరల్ అవుతోంది. ఇందులో ఈ ముద్దుగుమ్మ ఏడుస్తూ కనిపించేసరికి అభిమానులు ఆమెకు ఏమైంది అంటూ ఆరా తీయడం ప్రారంభించారు.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మృణాల్ ఠాకూర్ ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఏడుస్తూ కనిపించింది. ఈ బ్యూటీ కంటతడి పెట్టుకోవడం స్పష్టంగా కనిపించడంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఆమెకు ఏమైంది? అంటూ ఆరాలు తీయడం ప్రారంభించారు. స్ట్రాంగ్ ఉండాలని సూచించారు. అయితే మరో పోస్టుతో మృణాల్ ఈ విషయంలో స్పష్టతనిచ్చింది. క్రితం రోజు తను చాలా లోగా ఉందని, ఒత్తిడికి గురైనట్లు పేర్కొంది. అయితే ఈ రోజు తను చాలా సంతోషంగా ఉన్నానని స్పష్టం చేసింది.

"నిన్న నాకు చాలా కష్టంగా గడిచింది. కానీ ఈ రోజు చాలా స్ట్రాంగ్‌గా, తెలివిగా, సంతోషంగా ఉన్నాను. ప్రతి ఒక్కరికి వారి కథల్లో కన్ని పేజీలు ఉంటాయి. వాటిని బయటకు బిగ్గరగా చదవలేరు. కానీ నేను మాత్రం బయటకు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను నేర్చుకున్న పాఠాన్ని ఇంకెవరైనా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఒక్కో రోజు బలహీనంగా, అమాయకంగా ఉండటం మంచిదే." అని మృణాల్ ఠాకుర్ తన ఇన్‌స్టా స్టోరీలో తెలిపింది.

ప్రస్తుతం మృణాల్ బాలీవుడ్‌తో టాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. హిందీలో యువ హీరో ఇషాన్ కట్టర్ సరసన గుమ్రా అనే క్రైమ్ థ్రిల్లర్లో నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇది తమిళంలో సూపర్ హిట్టయిన తడం చిత్రానికి రీమేక్. ఇది కాకుండా పూజా మెరీ జాన్, ఆంఖ్ మిచోలి లాంటి సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు తెలుగులో నేచురల్ స్టార్ నానితో ఓ సినిమాకు పచ్చజెండా ఉపింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.