Mythological Movies | బాలీవుడ్‌లో పురాణ, ఇతిహాసాలపై రాబోతున్న సినిమాలు ఇవే
24 January 2022, 21:24 IST
- ఇప్పుడు బాలీవుడ్ దర్శక, నిర్మాతలు పురాణ ఇతిహాసాల వైపు చూస్తున్నారు. రామాయణ, మహాభారతం వంటి ఇతిహాసాలు బాలీవుడ్‌కు కథా వస్తువులు అయ్యాయి. వీటిపై నిర్మితమవుతున్న సినిమాలు వరుస కట్టనున్నాయి.
బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న ఆదిపురుష్
Mythological Movies.. బాలీవుడ్‌లో మన టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి సృష్టించిన హవా అంతా ఇంతా కాదు. బాహుబలి, బాహుబలి 2 మూవీలు బాలీవుడ్‌లో రికార్డులను తిరగరాశాయి. సౌతిండియాకే పరిమితమైన తెలుగు, కన్నడ, తమిళ డైరెక్టర్లను పాన్ ఇండియా మూవీలు తీసేలా ప్రోత్సహించాయి. అంతేకాదు బాలీవుడ్‌లో ఓ నయా ట్రెండ్‌కు తెరతీశాయి. ఈ సినిమాల సక్సెస్‌తో ఇప్పుడు బాలీవుడ్ దర్శక, నిర్మాతలు పురాణ ఇతిహాసాల వైపు చూస్తున్నారు. రామాయణ, మహాభారతం వంటి ఇతిహాసాలు బాలీవుడ్‌కు కథా వస్తువులు అయ్యాయి. వీటిపై నిర్మితమవుతున్న సినిమాలు వరుస కట్టనున్నాయి. 2021 చివరలో, 2022 ఏడాదిలో ఎన్నో పురాణ, ఇతిహాసాలు ఇతివృత్తంగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
మహాభారత
మహాభారతాన్ని ద్రౌపది కోణంలో చూపించే వినూత్న ప్రయత్నమిది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకోన్ లీడ్ రోల్ నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మధు మంతెన ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ద్రౌపది రోల్‌లో దీపికా కనిపిస్తుండటంతో ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆదిపురుష్
బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ ఆదిపురుష్. తన్హాజీ వంటి చారిత్రక మూవీని తెరకెక్కించిన ఓమ్ రౌత్ డైరెక్షన్‌తో ఈ మూవీ వస్తోంది. రామాయణ ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. బాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీస్ లిస్ట్‌లో ఈ ఆదిపురుష్ టాప్‌లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ
ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ మూవీని తెరకెక్కించిన ఆదిత్య ధర్ ఈ హిస్టారికల్ మూవీకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. లీడ్ రోల్‌లో అదే ఉరి హీరో విక్కీ కౌశల్ కనిపించనున్నాడు. పౌరాణిక పాత్ర అయిన అశ్వత్థాముని కథనే ఓ సై-ఫి మూవీగా తెరకెక్కిస్తుండటం విశేషం.
రామాయణ
తెలుగుతోపాటు హిందీ, తమిళ్‌లో వస్తున్న మూవీ రామాయణ. ఈ మూవీ మొత్తం మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిచోరె డైరెక్టర్ నితీష్ తివారీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో 3డీలో ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం.
బ్రహ్మాస్త్ర
బాలీవుడ్ ప్రేక్షకులు రెండేళ్లుగా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. 2019 డిసెంబర్‌లోనే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉన్నా.. వాయిదా పడుతూ వస్తోంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ తెరకెక్కిన ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున నటించారు. ఈ మూవీ కూడా మూడు భాగాలుగా వస్తోంది. బాలీవుడ్‌లో రాబోతున్న అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఇదేనని భావిస్తున్నారు.
రామ్‌సేతు
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్ నటిస్తున్న మూవీ రామ్‌సేతు. లంకలో ఉన్న సీతను తీసుకురావడానికి వెళ్లే సమయంలో రాముడి నేతృత్వంలోని వానర సైన్యం ఈ రామసేతు అనే వారధిని నిర్మించిందని మన ఇతిహాసాలు చెబుతున్నాయి. అభిషేక్ శర్మ దర్శకత్వం వస్తున్న ఈ రామ్‌సేతు మూవీ వచ్చే దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.