తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Miss Shetty Mr Polishetty Bo Collection: మళ్లీ పెరిగిన కలెక్షన్స్.. అమెరికాలో భారీగా.. కోట్లల్లో లాభాలు

Miss Shetty Mr Polishetty BO Collection: మళ్లీ పెరిగిన కలెక్షన్స్.. అమెరికాలో భారీగా.. కోట్లల్లో లాభాలు

Sanjiv Kumar HT Telugu

17 September 2023, 15:14 IST

google News
  • Miss Shetty Mr Polishetty 10 Days Collection: ఎప్పుడు ప్రేక్షకులను తన నటనతో నిరాశ పరచడు నవీన్ పోలిశెట్టి. చేసేవి కొన్ని చిత్రాలు అయినా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అలా చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా హిట్ టాక్‍తో దూసుకుపోతోంది.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బాక్సాఫీస్ లాభాలు
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బాక్సాఫీస్ లాభాలు

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బాక్సాఫీస్ లాభాలు

డే 10 కలెక్షన్స్

నవీన్ పోలిశెట్టి తొలిసారిగా సీనియర్ బ్యూటి అనుష్కతో కలిసి నటించిన మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. దీనికి కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. హెచ్చు తగ్గులతో మంచి వసూళ్లు సాధిస్తోంది. అలా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 10వ రోజున రూ. 69 లక్షల షేర్, రూ. 1.20 కోట్ల గ్రాస్ వసూళు అయింది. వాటిలో నైజాం నుంచి రూ. 34 లక్షలు, సీడెడ్ నుంచి 7 లక్షలు, ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 28 లక్షల కలెక్షన్స్ ఉన్నాయి. అంటే శనివారం (సెప్టెంబర్ 16) రోజున కలెక్షన్స్ పెరిగాయి.

10 రోజుల్లో వచ్చింది

మహేశ్ బాబు పి దర్శకత్వం వహించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు 10 రోజుల్లో కలెక్షన్స్ పర్వాలేదనిపిస్తున్నాయి. 10 రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 11.03 కోట్లు షేర్, రూ. 19.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఉన్నాయి. అందులో నైజాం ఏరియాలో రూ. 6.02 కోట్లు, సీడెడ్‍లో రూ. 1 కోటి, ఓవరాల్ ఆంధ్ర నుంచి రూ. 4.01 కోట్లు కలెక్ట్ అయ్యాయి.

యూఎస్‍లో భారీగా

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రానికి ఏపీ, తెలంగాణలో 10 రోజులకు రూ. 11.03 కోట్ల షేర్ వచ్చినట్లు పైన చెప్పుకున్నాం. అలాగే కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో (కర్ణాటకతోపాటు భారత్‍లోని ఇతర రాష్ట్రాల్లో) 10 రోజులకు రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‍లో రూ. 6.85 కోట్లు వచ్చాయి. ఇలా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 19.38 కోట్ల షేర్, రూ. 37.40 కోట్ల గ్రాస్ రాబట్టింది. అంతేకాకుండా యూఎస్ బాక్సాఫీస్ వద్ద 1.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 12 కోట్లకుపైగా) గ్రాస్ కలెక్షన్స్ క్రాస్ చేసి.. 2 మిలియన్ డాలర్ల వైపు పరుగులు పెడుతోంది.

లాభాలు

అనుష్క-నవీన్ పోలిశెట్టి జోడీ కట్టిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు రూ. 12.50 కోట్ల మార్కెట్ కాగా రూ. 13.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్‍ను కంప్లీట్ చేసి డబుల్ బ్లాక్ బస్టర్‍గా నిలిచింది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ. అంతేకాకుండా ఈ చిత్రానికి రూ. 5.88 కోట్ల ప్రాఫిట్ కూడా వచ్చింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం