తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ranveer Nude: ఓ అమ్మాయి న్యూడ్ ఫొటోలు దిగితే ఒప్పుకునేవాళ్లా: మిమి చక్రవర్తి

Ranveer Nude: ఓ అమ్మాయి న్యూడ్ ఫొటోలు దిగితే ఒప్పుకునేవాళ్లా: మిమి చక్రవర్తి

22 July 2022, 14:54 IST

google News
    • రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ఈ విషయంపై బెంగాలీ నటి, రాజకీయ నేత అయిన మిమీ చక్రవర్తి స్పందించారు. ఇదే ఓ అమ్మాయి చేస్తే ఒప్పుకునే వాళ్లా అంటూ ప్రశ్నించింది.
రణ్‌వీర్-మిమీ
రణ్‌వీర్-మిమీ (Twitter)

రణ్‌వీర్-మిమీ

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఫుల్ వైరల్ అవుతోంది. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ అతడి నగ్న చిత్రంపై కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అయితే బెంగాలీ నటి, రాజకీయ నేత అయిన మిమీ చక్రవర్తి స్పందించారు. రణ్‌వీర్ మాదిరి ఓ అమ్మాయి న్యూడ్ ఫొటోషూట్ చేస్తే ఇలాగే సానుకూలంగా స్పందించేవారా అంటూ ట్విటర్ వేదికగా పోస్టు పెట్టారు.

రణ్‌వీర్ సింగ్ లేటెస్ట్ ఫొటోషూట్‌కు నెట్టింట కామెంట్లు విశేషంగా వస్తున్నాయి. అదే "ఓ మహిళ అలాంటి ఫొటోషూట్ చేస్తే ఇలాంటే రెస్పాన్సే వస్తుందా? ఆమె ఇంటి నుంచి కాల్చి బూడిద చేసేవాళ్లు. మోర్చాస్ లాంటి వాళ్లు ఆమెను నరికేస్తామని బెదిరిపులు చేసేవాళ్లు" అని మిమీ ట్విటర్ వేదికగా స్పందించారు. అంతటితో ఆగకుండా సమానత్వం ఎక్కడ ఉందంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

"మనం సమానత్వం గురించి మాట్లాడుతున్నాం. అది ఇప్పుడు ఎక్కడ ఉంది?? ఇది మీ దృక్పథం పూర్తిగా నాశనం చేయగలదు. రణ్‌వీర్ విషయంలో మన దృక్పథాన్ని ఇంకా విస్తృతం చేద్దాం. ఎందుకంటే అతడికున్న దేహం ఎన్నో త్యాగాలు చేయడం వల్ల వస్తుంది. ఉప్పు, చక్కెర, పిండిపదార్థాలు తినకుండా కష్టపడి అతడి తన బాడీని రెడీ చేసుకున్నాడు." అని మిమీ పేర్కొన్నారు.

మిమీ చక్రవర్తి ట్వీట్‌పై నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. నేను మీ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నాను. కానీ ఇదంతా ఊహాజనితమే. మనం గతంలో మిలింద్ సోమన్, మధు సప్రేలను ఇలాంటి ఫొటోషూట్‌లో చూశాం. ప్రారంభంలో వ్యతిరేకించినప్పటికీ తర్వాత ప్రజలు మర్చిపోయి కూల్‌గా ఉన్నారు. అని ఓ యూజర్ పోస్ట్ పెట్టారు.

ఒకప్పుడు బర్ట్‌ రేనాల్డ్స్‌ ఫొటోషూట్ స్టైల్లోనే ఇప్పుడు రణ్‌వీర్‌ న్యూడ్‌గా కెమెరా ముందు పోజులిచ్చాడు. ఈ మ్యాగజైన్‌కు రణ్‌వీర్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాలు, తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు.

"భౌతికంగా నగ్నంగా ఉండటం నాకు చాలా ఈజీ. అయితే ఇప్పటి వరకూ నేను సినిమాల్లో చేసిన పర్ఫార్మెన్స్‌లలోనూ నగ్నంగానే ఉన్నాను. అందులో మీరు నగ్నంగా ఉన్న నా ఆత్మను చూడొచ్చు. నిజానికి అదీ నగ్నత్వం అంటే. నేను వేయి మంది ముందు కూడా నగ్నంగా నిలబడగలను. నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. వాళ్లే కాస్త అసౌకర్యానికి గురవుతారు" అని తన ఇంటర్వ్యూలో రణ్‌వీర్‌ అనడం విశేషం.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం