తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhola Shankar Twitter Review: భోళా శంకర్.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

Bhola Shankar Twitter Review: భోళా శంకర్.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

Hari Prasad S HT Telugu

11 August 2023, 9:15 IST

google News
    • Bhola Shankar Twitter Review: భోళా శంకర్.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటూ ఈ మూవీ ట్విటర్ రివ్యూ వచ్చేసింది. శుక్రవారం (ఆగస్ట్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గురించి తెల్లవారుఝాము నుంచే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్
మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ (twitter)

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్

Bhola Shankar Twitter Review: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ శుక్రవారం (ఆగస్ట్ 11) రిలీజైంది. గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య హిట్లతో ఊపుమీదున్న చిరు.. హ్యాట్రిక్ విజయం కోసం ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇండియాలో ఈ మూవీ రిలీజ్ కాకముందే గురువారం అర్ధరాత్రి నుంచే అమెరికా ప్రీమియర్ షోల నుంచి మూవీ టాక్ బయటకు వచ్చింది.

యూఎస్ ప్రీమియర్స్ ను బట్టి భోళా శంకర్ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని తేలింది. చిరు లుక్స్, అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్, మూవీలో సెకండాఫ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయంటూ ట్విటర్ లో ప్రేక్షకులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ చిరు ఫ్యాన్స్ తెగ హడావిడి చేశారు. ఈలలు, గోలలతో థియేటర్లు మార్మోగిపోయాయి.

చాలా మంది థియేటర్లలో ఫ్యాన్స్ సందడి చేస్తున్న వీడియోలను ట్విటర్ లో షేర్ చేశారు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయగలిగే మూవీ అని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక ఈ సినిమాలో ఖుషీలోని పాపులర్ నడుము సీన్ రీక్రియేట్ చేయడాన్ని కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఆ సినిమాలో పవన్, భూమిక మధ్య ఉండే ఆ సీన్ ను.. ఈ భోళా శంకర్ లో సరదాగా చిరు, శ్రీముఖి మధ్య రీక్రియేట్ చేయడం విశేషం.

ఇటు మాస్ ను, అటు ఫ్యామిలీని మెప్పించేలా మూవీ తీసిన మెహర్ రమేష్ ను కూడా మెచ్చుకుంటూ ట్విటర్ లో చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. మరికొందరు ఇంటర్వెల్ బ్యాంగ్ బాగున్నట్లు చెబుతున్నారు. సినిమాల్లోకి రీఎంట్రీ తర్వాత బాస్ లుక్ ఈ భోళా శంకర్ లోనే బాగుందంటూ ఓ అభిమాని ట్వీట్ చేశారు. చిరు హ్యాట్రిక్ కొట్టినట్లే అని అతని ఫ్యాన్స్ తేల్చేశారు.

అదే సమయంలో కొందరు న్యూట్రల్ అభిమానుల నుంచి కాస్త నెగటివ్ రివ్యూలు కూడా వస్తున్నాయి. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ కూడా భోళా శంకర్ మూవీపై ట్వీట్ చేశారు. చిరంజీవి నటన తప్ప సినిమాలో ఏమీ లేదని, అజిత్ వేదాళం మూవీని అనవసరంగా రీమేక్ చేశారని అతడు అనడం గమనార్హం. డైరెక్టర్ మెహర్ రమేష్ అసలు ఏమాత్రం దృష్టిపెట్టనట్లుగా కనిపిస్తోందని స్పష్టం చేశాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం