తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun Vs Mega Fans: ఎన్టీఆర్ తెలుగు ప్రైడ్ అయితే మ‌రి రామ్‌చ‌ర‌ణ్? - బ‌న్నీ ట్వీట్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్‌

Allu Arjun vs Mega Fans: ఎన్టీఆర్ తెలుగు ప్రైడ్ అయితే మ‌రి రామ్‌చ‌ర‌ణ్? - బ‌న్నీ ట్వీట్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్‌

15 March 2023, 11:55 IST

  • Allu Arjun vs Mega Fans: ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వ‌చ్చిన సంద‌ర్భంగా అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు.

అల్లు అర్జున్
అల్లు అర్జున్

అల్లు అర్జున్

Allu Arjun vs Mega Fans: మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్‌కు విభేదాలు ఉన్న‌ట్లు టాలీవుడ్‌లో చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విభేదాల‌పై ఇటు మెగా ఫ్యామిలీతో పాటు అల్లు హీరోలు కూడా సైలెంట్‌గానే ఉంటో వ‌స్తోన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

తాజాగా మ‌రోసారి అల్లు అర్జున్ చేసిన ట్వీట్ పై మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతోన్నారు. . ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వ‌చ్చిన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని చిత్ర బృందంతో పాటు హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను అభినందిస్తూ అల్లు అర్జున్‌ ఓ ట్వీట్ చేశాడు. ఆస్కార్ వేదిక‌పై తెలుగు పాట‌కు ద‌క్కిన గౌర‌వం చూస్తుంటే ఆనందంగా ఉందంటూ ఈ ట్వీట్‌లో బ‌న్నీ పేర్కొన్నాడు.

అంతేకాకుండా గ్లోబ‌ల్ స్టార్స్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ త‌మ స్టెప్పుల‌తో ప్ర‌పంచం మొత్తాన్ని షేక్ చేశారు అంటూ అల్లు అర్జున్ వ్యాఖ్యానించాడు. ఈ ట్వీట్‌లో తెలుగు ప్రైడ్ అంటూ ఎన్టీఆర్‌పై ప్ర‌శంస‌ల్ని కురిపించాడు అల్లు అర్జున్‌. రామ్‌చ‌ర‌ణ్‌ను ను మాత్రం మై ల‌వ్‌లీ బ్ర‌ద‌ర్ అంటూ పేర్కొన‌డంతో మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు.

ఎన్టీఆర్‌ను పొగుడుతూ రామ్‌చ‌ర‌ణ్‌ను త‌క్కువ చేయ‌డానికే బ‌న్నీ ఈ ట్వీట్ చేసిన‌ట్లు చెబుతోన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రైడ్ అయితే రామ్‌చ‌ర‌ణ్ ఏంటి అంటూ ట్వీట్లు చేస్తోన్నారు.

నంద‌మూరి హీరోలును అల్లు ఫ్యామిలీ ఫుల్ స‌పోర్ట్ ఇస్తూ లేపుతోంద‌ని, అల్లు అర్జున్ ఎన్టీఆర్‌కు స‌పోర్ట్ చేస్తుంటే అల్లు అర‌వింద్ బాల‌కృష్ణ‌ను లేపుతున్నాడో అంటూ మ‌రో ఫ్యాన్ కామెంట్ చేశాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం